సోషల్ మీడియాలో వదంతులకు చెక్ పెట్టే విధంగా కేంద్రం కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)నిబంధనలు రూపొందిస్తోంది. వీటి ప్రకారం సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద సమాచారం మూలాలు గుర్తించడంతో పాటు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోగా సదరు సమాచారాన్ని తమ ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాల్సి ఉంటుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, మెసేజింగ్ యాప్స్ ద్వారా ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా తీసుకోతగిన చర్యల గురించి కేంద్రం గతేడాది డిసెంబర్‌లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీటిని విశ్లేషించిన మీదట తాజా నిబంధనలు రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment