new regulations
-
ఆ పోస్టులకు 65 ఏళ్ల వారూ అర్హులే!
సాక్షి, అమరావతి: రాజు తలచుకుంటే ‘దెబ్బల’కు కొదవా అన్న నానుడికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పదవుల కోసం క్యూ కట్టేవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో.. తమకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కించేందుకు.. గతంలో ఉన్న నిబంధనలను సైతం అడ్డగోలుగా మార్చేస్తున్నది. తాజాగా రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకానికి సంబంధించి, ఇన్నాళ్లూ గరిష్ట వయసు పరిమితి 62 ఏళ్లుగా ఉండేది. అయితే ఇకపై 65 ఏళ్ల వయసు వారు కూడా ఆ పదవులకు అర్హులేనంటూ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో పాటు ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలకు కూడా తాజా నిబంధన వర్తిస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైనవారు.. రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెచ్చరించింది. వారి స్థానంలో తమ వారిని, భారీగా ముడుపులు ఇచ్చే వారిని నియమించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో కీలక పోస్టుల్లో ఉన్న కొందరిని బలవంతంగా బయటకు పంపించారు. వారిలో ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్కో ఓఎస్డీ ఆంటోనిరాజు ఉన్నారు. వీరి తరువాత పదిమంది డైరెక్టర్ల చేత గత జూలైలో రాజీనామాలు చేయించారు. కూటమి నేతలు ఆ పోస్టులకు ఇప్పటికే రూ.కోట్లలో బేరాలు మొదలు పెట్టారు. అయితే తామనుకున్నది చేసేందుకు, తాము కోరుకున్నవారిని నియమించేందుకు వయసు అడ్డు రావడంతో దానిని సవరించారు. మూడేళ్లు పెంచేసుకుని, అరవై ఐదేళ్లు ఉన్నవారికీ అవకాశం కల్పించేలా కొత్త జీవో రూపొందించారు. గతంలో విద్యుత్ సంస్థల్లో చీఫ్ జనరల్ మేనేజర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు తాజాగా డైరెక్టర్ల పోస్టులకు పోటీ పడుతున్నారు. ఎలాగైనా కూటమి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి కోసమే కొత్తగా ఈ వయసు పెంపుదల అనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఎన్ఎంసీ కొత్త నిబంధనలు సడలించండి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతోందని, వాటిని సడలించి పాత పద్ధతినే కొనసాగించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్ఎంసీ కొత్తగా పలు నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి పది లక్షల మంది జనాభాకు వంద వైద్య సీట్ల చొప్పునే అనుమతిచ్చేలా నిబంధనలు రూపొందించింది. అలాగే కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతివ్వాలంటే 605 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి కూడా ఉండాలని నిర్ణయించింది. ఈ రెండు నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర విభజన తర్వాత టెర్షియరి కేర్ సర్వీసెస్ విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 12 కాలేజీల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. సిబ్బంది నియామకాలు కూడా పూర్తయ్యాయి. కానీ కొత్త నిబంధనల వల్ల ఏపీకి ఒక్క మెడికల్ కాలేజీ కూడా కొత్తగా మంజూరయ్యే అవకాశం ఉండదు’ అని కేంద్ర మంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు విడదల రజిని వివరించారు. వైద్య, ఆరోగ్య రంగంలో సీఎం వైఎస్ జగన్ తీసుకొస్తున్న సంస్కరణలకు కేంద్రం తరఫున తగిన సహకారం అందించాలని.. ఏపీ ప్రజలకు ఎలాంటి నష్టం రాకుండా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. తమ వినతికి మన్సూక్ మాండవీయ సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్‌దాస్, ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాంశు కౌశిక్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీలకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది. ఫార్మా కంపెనీలు, వారి ప్రతినిధులు, వైద్య పరికరాల సంస్థల దగ్గర్నుంచి వైద్యులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కానుకలు, డబ్బులు, ఆతిథ్యం స్వీకరించకూడదని నిబంధనలు విధించింది. ఫార్మా కంపెనీలు ఇచ్చే పార్టీల్లో పాల్గొనడం, ప్రయాణ సదుపాయాలను తీసుకోవడం వంటివి చేయకూడదని పేర్కొంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు వృత్తిపరమైన బాధ్యతని కలిగి ఉంటూ ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2నే ఈ నిబంధనల్ని జారీ చేసింది. అంతే కాదు ఫార్మా కంపెనీలు తయారు చేసే మందులు ఇతర పరికరాల వినియోగాన్ని ఆమోదిస్తూ ప్రకటనలివ్వకూడదంది. -
ఉపకారానికి కొర్రీ .. విద్యార్థులు వర్రీ!
సాక్షి, హైదరాబాద్: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై కేంద్రం విధించిన సరికొత్త నిబంధనలు పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాము సూచించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటేనే కేంద్ర వాటా విడుదల చేస్తామని స్పష్టం చేయడం, దీనిపై రాష్ట్ర సర్కారు మిన్నకుండడంతో రెండేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.600 కోట్లు నిలిచిపోయాయి. దీంతో అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. రాష్ట్రంలో వివిధ పోస్టుమెట్రిక్ కోర్సులు చదివే విద్యార్థులు ఏటా 2 లక్షలకు పైగా ఉంటారు. 60 శాతానికి పెరిగిన కేంద్రం వాటా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రాష్ట్రాలకు నిధులిస్తుంది. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులు కలిపి విద్యార్థులకు అందిస్తుంటాయి. ఎన్నో ఏళ్లుగా ఈ పద్ధతి కొనసాగుతోంది. అయితే తన వాటా నిధులు 40 నుంచి 60 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి కొత్త నిబంధనలు విధించింది. గతేడాది నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 40 శాతం (గతంలో 60 శాతం) విడుదల చేయాలనే మెలిక పెట్టింది. అంతేకాకుండా విద్యార్థుల ఖాతా నంబర్లను కేంద్రానికి పంపితే నేరుగా నిధులు జమ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. వివరాలను పంపాలని సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం పంపలేదు. సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం! నేరుగా తామే ఖాతాల్లో నిధులిస్తామనే నిబంధనతో లబ్ధిదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశముందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు ఉపకారవేతనాలే నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీ ఖాతాలో జమ చేస్తోంది. కేంద్రం నిబంధనల ప్రకారం ఫీజులు కూడావిద్యార్థి ఖాతాలో జమ చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయని ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో లబ్ధిదారులకు అందించడమే ఉత్తమమని, ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల వివరాలను పంపకపోవడంతో రెండేళ్లుగా ఈ కోటాలో పైసా కూడా విడుదల కాలేదు. ఇరకాటంలో విద్యార్థులు.. 2021–22 విద్యా సంవత్సర దరఖాస్తుల పరిశీలన పూర్తయినప్పటికీ ఆయా విద్యార్థులకు సంబంధించిన ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో మెజార్టీ విద్యార్థులు ఉపకారవేతనాల కోసం ఎదురు చూస్తుండగా... కాలేజీ యాజమాన్యాలు ఫీజు నిధుల కోసం పడిగాపులు కాస్తున్నాయి. కొన్నిచోట్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తుండడంతో వారు అప్పులు చేసి సొంతగా ఫీజులు చెల్లిస్తున్న ఉదంతాలు సైతం కనిపిస్తున్నాయి. -
రైల్వే శాఖ కొత్త నిబంధనలు.. రైళ్లలో గీత దాటితే జైలుపాలే..
సాక్షి, రాజమహేంద్రవరం: రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. రైలులో తోటి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా కేసు నమోదు చేసి.. జైలుకు పంపాలని నిర్ణయించింది. ఈ పనిని రైల్వే రక్షక దళానికి (ఆర్పీఎఫ్) అప్పగించింది. తోటి ప్రయాణికుల వలన ఎదురవుతున్న సమస్యలపై రైల్వే మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. వీటి ప్రకారం ఇక నుంచి రైలు ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో పాటలు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేయడాన్ని నిషేధించారు. ఫోన్లో బిగ్గరగా మాట్లాడరాదు. సాధారణ ప్రయాణికులతో పాటు గుంపులుగా ప్రయాణించే వారు సైతం రాత్రి పది గంటల తరువాత ఇతరులకు ఇబ్బంది కలిగించే రీతిలో బిగ్గరగా మాట్లాడకూడదు. చదవండి: (చట్టాలు చేయకుండా నిలువరించలేరు) రాత్రి 10 గంటల తర్వాత బోగీలో అన్ని లైట్లూ ఆర్పేయాలి. ఈ నిబంధనలను పాటించని ప్రయాణికులపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తోటి ప్రయాణికుల వలన ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా 139 నంబరుకు ఫోన్ చేస్తే చాలు.. అలా ఇబ్బందికరంగా ప్రవర్తించే వారిపై ఆర్ఫీఎఫ్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుంటారు. దీనిపై బోగీల్లోని ఆర్ఫీఎఫ్ సిబ్బంది, టికెట్ చెకర్లు, కోచ్ అటెండెంట్లు, క్యాటరింగ్ సహా ఇతర రైలు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రయాణికులు ఇతరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండేలా వీరు అప్రమత్తం చేస్తుంటారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే ఆ రైలు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది. చదవండి: (TTD: ఆన్లైన్లో సర్వదర్శనం టికెట్లు విడుదల) ఫోన్ కాల్ చాలు.. జైలుకు పంపేస్తాం బోగీల్లో తోటి ప్రయాణికుల వలన ఎటువంటి చిన్న అసౌకర్యం కలిగినా చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు.. న్యూసెన్స్ కేసు నమోదు చేసి, జైలుకు పంపుతాం. – సైదయ్య, ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్, రాజమహేంద్రవరం -
కొత్త స్వరం.. గడ్కరీ కీలక ప్రకటన
వాహనాల హారన్ సౌండ్లు మార్చే యోచనలో కేంద్రం ఉందనే కథనాల నడుమ.. కీలకమైన ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం నాసిక్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. కార్లకు మాత్రమే హారన్ శబ్దాలను, అదీ భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాల్ని అన్వయింజేస్తామని, చట్టబద్ధత ద్వారా దీనిని అమలు చేయబోతున్నామని వెల్లడించారు. హారన్ శబ్దాలు మార్చేలా వ్యవస్థను తీసుకురాబోతున్నామని, ఇందుకోసం ప్రత్యేక చట్టం అమలులోకి తేబోతున్నామని ప్రకటించారు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. నిజానికి గతంలోనే ఆయన పేరు మీద ‘ప్లీజ్ ఛేంజ్ హార్న్’ కథనం వెలువడినప్పటికీ.. ఇప్పుడు నేరుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఫ్లూట్, తబలా, వయొలిన్, మౌత్ ఆర్గాన్, హార్మోనియం.. ఈ లిస్ట్ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారాయన. అంతేకాదు ఆంబులెన్స్, పోలీస్ వాహనాల సైరన్లను మార్చే అంశం పరిశీలిస్తున్నామని, వాటి స్థానంలో ఆల్ ఇండియా రేడియోలో వినిపించే ఆహ్లాదకరమైన సంగీతాన్ని చేర్చే విషయమై సమీక్షిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో వినిపించే ఆ సంగీతం వినేవారికి ఆహ్లాదకరమైన కలిగిస్తుందని భావిస్తున్నట్లు గడ్కరీ అభిపప్రాయపడ్డారు. వాహనాల రోదనల వల్ల జనాలు పడే ఇబ్బందులేంటో తనకూ అనుభవమని, అందుకే బండ్ల ‘హారన్’ మార్చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. ఆ జోన్స్ లేకపోవడమే.. నో హాంకింగ్ జోన్స్.. అంటే ఆ జోన్ ఉన్న ప్రాంతంలో వెహికల్స్ హారన్ కొట్టడానికి వీల్లేదు. నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. చాలాదేశాల్లో ఇలాంటి జోన్లు ఉన్నాయి. కానీ, మన దేశంలో ఎక్కడా అలాంటివి కనిపించవు. కేవలం ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మాత్రమే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో నో హాంకింగ్ జోన్స్‌కి బదులు.. హారన్ శబ్దాల్ని మార్చాలనే ఆలోచన చేయడం విశేషం. సడలింపు లేకుండా ఈ నిబంధనను అమలు చేస్తే.. హారన్ మార్పిడి కోసం వాహన తయారీదారీ కంపెనీలతో పాటు పాత వాహనదారులపైనా భారం పడనుంది. చదవండి: ప్రశాంతంగా యోగా కూడా చేసుకోనివ్వలేదు!: గడ్కరీ -
ఈఎంఐ పేమెంట్స్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
Auto-Debit For EMI Payments: హోం లోన్స్ ఇతరత్ర నెలవారీ చెల్లింపుల కోసం ఆటో డెబిట్ పేమెంట్ మోడ్‌ను ఆశ్రయిస్తున్నారా? బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్, మొబైల్ వాలెట్స్ వాడుతున్నారా? అయితే అక్టోబర్ 1 నుంచి అమలు కాబోతున్న కొత్త నిబంధనలను తెలుసుకోండి. ఈ తేదీ నుంచి బ్యాంకులుగానీ, ఇతరత్ర ఫైనాన్షియల్ సంస్థలుగానీ ఆటోమేటిక్ పేమెంట్స్ కోసం కస్టమర్ల నుంచి ‘అదనపు ధృవీకరణ’ను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేకుంటే చెల్లింపులు జరగబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఎలాంటి వాటిపై ప్రభావం అంటే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్ స్స్ర్కిప్షన్, మొబైల్ బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, యుటిలిటీ బిల్స్ ఈ పరిధిలోకి వస్తాయి. ఐదు వేల లోపు చెల్లింపుల మీద, అలాగే ‘వన్స్ ఓన్లీ’ పేమెంట్స్‌కు సైతం కొత్త నిబంధనలు వర్తించవు. గడువు తర్వాత తాముపేర్కొన్న విధంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకొనున్నట్లు కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ. ఎక్స్ట్రా ఛార్జీలు?? హోం లోన్స్ ఈఎంఐగానీ, ఇతరత్ర పేమెంట్స్‌గానీ ఐదువేల రూపాయలకు మించి ఆటోడెబిట్ మోడ్‌లో కట్ అయ్యేవిధంగా కొందరు సెట్ చేసుకుంటారు కదా. అయితే వీళ్లు ఇకపై మ్యానువల్‌గా అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానుండగా.. యూజర్ల నెత్తిన పిడుగు తప్పదనే మరోప్రచారం మొదలైంది. ఈ తరహా పేమెంట్స్‌కు యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే కథనాలు కొన్ని జాతీయ మీడియా వెబ్సైట్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఆర్బీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆర్బీఐతో చర్చలకు.. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు ఈ నిబంధన అమలుపై మల్లగుల్లాలు చేస్తున్నాయి. నిజానికి యూజర్ల భద్రత అంశం, ఆన్లైన్ మోసాల కట్టడి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఈ నిబంధనను రెండేళ్ల క్రితమే ప్రతిపాదించింది. ఏప్రిల్ 1, 2021 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంది. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొంత గడువు కోరడంతో.. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రైవేట్ బ్యాంకులు ఈ నిబంధన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఖాతాదారులు, యూజర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని ప్రకటిస్తూనే.. మరోవైపు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఆర్బీఐతో చర్చలకు సిద్ధం కావడం కొసమెరుపు. చదవండి: నిలువునా ముంచేసిన బ్యాంకు.. ఊరట అందించిన ఆర్బీఐ -
‘హారన్’ మోతను మార్చే పనిలో కేంద్రం.. ఇక చెవులకు వినసొంపైన సంగీతంతో!
-
ప్లీజ్ చేంజ్ హారన్: గడ్కరీ
Nitin Gadkari Horn Change Rules: నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ నడుమ చెవులు చిల్లులు పడే రేంజ్ రణగోణధ్వనుల్ని భరిస్తూ.. వాహనదారులు ముందుకు పోవాల్సిన పరిస్థితి. అయితే ఈ సినారియోను మార్చేందుకు కేంద్రం సరికొత్త ఆలోచన చేయబోతోంది. విచిత్రమైన, ఘోరమైన శబ్దాలు చేసే హారన్ సౌండ్‌ల్ని మార్చేసే దిశగా ఆలోచన చేయనున్నట్లు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ప్రకటన చేశారు. మరాఠీ న్యూస్ పేపర్ లోక్‌మట్ కథనం ప్రకారం.. నాగ్‌పూర్‌లో ఓ భవనంలో పదకొండవ అంతస్తులో నివాసం ఉంటున్న గడ్కరీకి.. ప్రశాంతంగా గంటసేపు ప్రాణాయామం కూడా చేసుకోని పరిస్థితి ఎదురవుతోందట. వాహనాల రోదనల వల్ల అంత ఎత్తులో ఉన్న తన పరిస్థితే అలా ఉంటే.. సాధారణ పౌరులు ఆ గోలను ఎలా భరిస్తున్నారో తాను ఊహించుకోగలనని చెప్తున్నారాయన. అందుకే బండ్ల ‘హారన్’ మార్చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఇప్పుడున్న వెహికిల్ హారన్ల ప్లేస్‌లో తబలా, వయొలిన్, ఫ్లూట్.. ఇలా రకరకాల వాయిద్యాల శబ్దాలను పరిశీలించబోతున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలో కార్లకు ఈ ఆలోచనను అమలు చేయబోతున్నట్లు, ఈ మేరకు త్వరలో కంపెనీలకు సూచనలు సైతం పంపిచనున్నట్లు గడ్కరీ వ్యాఖ్యలను ఆ కథనం ఉటంకించింది. ఒకవేళ కేంద్రం గనుక కరాకండిగా ఈ రూల్స్ అమలు చేస్తే మాత్రం.. వాహన తయారీదారీ కంపెనీలపై అదనపు భారం పడనుంది. ఆ టైంలోనే గట్టిగా.. హారన్ శబ్దాల వల్ల శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. మనుషుల్లో చెవుడుతో పాటు ఆందోళన, ఒత్తిళ్ల సమస్యలు ఎదురవుతున్నాయి. సాధారణంగా అతి ధ్వనులను అవతి వాహనాలు(ఏవైనా సరే), వ్యక్తులు తప్పిపోయిన సమయాల్లో.. దూరం నుంచి వాహనాలు వస్తున్నాయనే అలర్ట్ ఇవ్వడానికి(ఎమెర్జెన్సీ సర్వీసుల విషయంలో) మాత్రమే ఉపయోగించాలని రూల్స్ చెప్తున్నాయి. కానీ, ఈ రూల్స్ అమలు కావడం లేదు. రోడ్ల మీద వెళ్లే వాహనాల విషయంలోనే కాదు.. షిప్స్, రైళ్ల విషయంలోనూ ఈ నిబంధనలు పాటించాలి. సాధారణంగా రైళ్ల హారన్ 130-150 డెసిబెల్స్ దాకా ఉంటుంది. దూరం ఉన్నప్పుడు మాత్రమే ఈ శబ్ద తీవ్రతతో హారన్ కొట్టాలి. ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చిన తర్వాత కూడా ఈ రేంజ్ సౌండ్ హారన్ కొట్టడం రూల్స్‌కి వ్యతిరేకం!. నో హాంకింగ్ జోన్స్ కొన్ని చోట్ల హారన్లు కొట్టడానికి వీల్లేదు. అలాంటి ప్రాంతాల్ని ‘నో హాంకింగ్ జోన్స్’ అంటారు. మన దేశంలో ఎక్కడా అలాంటి జోన్లను ఏర్పాటు చేయలేదు. కేవలం శబ్ద తీవ్రత పరిమితిని మించినప్పుడు.. అదీ ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ నో హాంకింగ్ జోన్స్ వ్యవస్థను అమలు చేస్తే.. గడ్కరీ చెప్తున్న హారన్ మార్పిడి ఆలోచన అవసరమే ఉండదనేది చాలామంది వెల్లడిస్తున్న అభిప్రాయం. చదవండి: లెదర్ పరిశ్రమకు మంచి రోజులు -
భారత్‌లో యాహూ న్యూస్ బంద్
Yahoo News India: వెబ్ సర్వీసుల ప్రొవైడర్ యాహూ.. భారత్‌లో న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు నేటితో(ఆగష్టు 26) పుల్‌స్టాప్ పెట్టింది. ఈ మేరకు న్యూస్ ఆధారిత వెబ్సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించిన యాహూ.. మెయిల్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికాకు చెందిన వెబ్ సేవల కంపెనీ యాహూ.. ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్‌డౌన్‌తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. క్లిక్ చేయండి: వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డు.. ఇలా చేయొచ్చు ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్ నిలిచిపోనుంది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. డిజిటల్ కంటెంట్.. ముఖ్యంగా యాహూ క్రికెట్‌పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్ కంటెంట్ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ముట్టుకోకుండానే ఫోన్ పని చేస్తుందిక -
కొత్త నిబంధనలతో పెళ్లిళ్ళు సాధ్యమయ్యేనా?
సాక్షి, బెంగళూరు: కేరళ నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ రిపోర్టు చూపించాలి, లేదంటే వారిని వెనక్కి పంపిస్తారు. ఈ నిబంధనలు కాబోయే దంపతులకు చుక్కలు చూపిస్తున్నాయి. వధువు కర్ణాటక, వరుడు కేరళ, వివాహం కొడగు జిల్లా మడికేరిలో అయితే, వరుడు సహా వందలాది మంది బంధుమిత్రులు కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించడం సాధ్యమేనా అని కేరళీయులు నిట్టూరుస్తున్నారు. కొత్త నిబంధనలతో కష్టం.. కేరళ, మహారాష్ట్రలో కరోనా మళ్లీ పెరగడంతో అక్కడి నుంచి వచ్చే వారికి కొత్త నిబంధనను కర్ణాటక అమలు చేస్తోంది. కరోనా పరీక్ష నెగిటివ్ రిపోర్టు చూపిస్తేనే ఈ ఇరురాష్ట్రాల వారిని అనుమతిస్తారు. దీంతో చాలా మందికి ఇక్కట్లను తెచ్చిపెడుతోంది. సుమతి– ప్రమోద్‌ల పెళ్లికి ఆటంకం కొడగు జిల్లా మడికేరిలోని కడగదాళు గ్రామానికి చెందిన సుమతి అనే అమ్మాయి పెళ్లి కేరళలోని కాసరగోడు జిల్లాకు చెందిన ప్రమోద్ నాయర్‌తో నిశ్చయమైంది. మడికెరిలోని ఓంకారేశ్వర దేవాలయంలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికొడుకు బృందంవారు కరోనా నెగిటివ్ రిపోర్టు తీసుకురావాల్సి రావడంతో సమస్య వచ్చి పడింది. అంతమందీ కరోనా పరీక్షలు జరిపించాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పరీక్షలు చేయించుకున్నా 72 గంటల వరకు రిపోర్టులు రావని బంధువులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో సోమవారం వివాహం నాటికి కరోనా పరీక్షల ఫలితాలు రావడం ఆలస్యమవుతుందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులే హాజరైతే 10–15 మంది ఉంటారని, వారికి ప్రైవేటు ఆస్పత్రిలో టెస్టులు చేయిస్తే కనీసం రూ. 25 వేలైనా ఖర్చు అవుతుందని తెలిపారు. కూలీనాలీ చేసి కూతురు పెళ్లి చేస్తున్న తమలాంటి సామాన్యులకు అంతటి భారం మోయడం కుదరని చెప్పారు. తమ బాధను అర్థం చేసుకుని పెళ్లికైనా నిబంధనలను సడలించాలని వేడుకున్నారు. కేరళ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటువంటి ఉదంతాలు మరెన్నో ఉన్నాయి. చదవండి: కరోనా విజృంభణ.. రెండు వారాలపాటు లాక్డౌన్ ప్రాంక్ అంటూ 300 అశ్లీల వీడియోలు.. -
సినిమాను థియేటర్లో చూడటం..
‘‘లాక్డౌన్ సమయంలో దాదాపు అన్ని వ్యాపారాలు మూతబడ్డాయి. ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ మొదలయింది. ఆగస్ట్ చివరి వారంలో థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన ప్రారంభం అవుతుందనుకుంటున్నాం’’ అని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ల (పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ వంటి సంస్థలు) సీఈవోలు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే థియేటర్స్ ప్రారంభం అయితే ఎలా నడిపించాలనుకుంటున్నారో వంటì అంశాలను పొందుపరిచి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ప్రధానమంత్రి ఆఫీస్‌కి లేఖ రాశారు. అందులోని సారాంశం ఈ విధంగా. ► థియేటర్స్‌కి వచ్చేవాళ్లకు మాస్క్ తప్పనిసరి చేస్తాం. లోపలికి వచ్చే ముందు తప్పకుండా ఉష్ణోగ్రత చూసే లోపలికి అనుమతించడం జరుగుతుంది. ► ఇక నుంచి మొత్తం డిజిటల్ విధానంలో పనులు జరిగేలా చూస్తాం. పేపర్ టికెటింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం. ఎస్ఎంఎస్, బార్కోడ్ స్కానింగ్ పద్ధతిని పాటిస్తాం. ► ఒక సీట్‌కి మరో సీట్‌కి మధ్య గ్యాప్ ఉండేలా జాగ్రత్తపడతాం. ► మల్టీప్లెక్స్‌లో ఏ రెండు షోలు ఒకేసారి ప్రారంభం కాకుండా చూసుకుంటాం. దానివల్ల అన్ని స్క్రీన్స్‌లో ఇంటర్వెల్ ఒకేసారి కాకుండా వేరే వేరే టైమ్‌లో ఉంటుంది. ఇలా అయితే రద్దీ ఏర్పడే అవకాశం తక్కువ. ► ప్రతీ షోకి మధ్యలో కనీసం 15 నిమిషాల నుంచి అర్ధగంట విరామం ఉంటుంది. ఈ సమయంలో మొత్తం సీటింగ్ శానిటైజ్ చేయడానికి వీలవుతుంది. ► మల్టీప్లెక్స్‌లో వీలైనన్ని శానిటైజర్లు ఏర్పాటు చేస్తాం. ఇటువంటి విషయాలను ఇందులో ప్రస్తావించారు. ‘‘సినిమా చూడటానికి వచ్చే ప్రతీ ప్రేక్షకుడి భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రేక్షకులకు నమ్మకం కలిగించే వాతావరణం సృష్టించాలనుకుంటున్నాం. అలాగే ఒక్క పెద్ద సినిమా వస్తే మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని సినిమాలు థియేటర్స్‌కి రాకుండానే ఓటీటీలకు వెళ్లిపోయాయి. అదో కొత్త పరిణామం. ప్రస్తుతం అందరం కష్ట సమయంలో ఉన్నాం. సినిమా థియేటర్ల వ్యాపారం ఏడాదికి పన్నెండు వేల కోట్లు ఉంటుంది. ప్రస్తుతం థియేటర్స్ మూతబడటంతో నెలకు సుమారు వెయ్యి కోట్ల నష్టం ఏర్పడుతోంది. కానీ మళ్లీ అంతా సాధారణ స్థితికి వస్తుంది. ఎందుకంటే సినిమాను థియేటర్లో చూడటం అనేది మన డీఎన్ఏలోనే ఉంది. అదో సామూహిక అనుభవం’’ అని పేర్కొన్నారు ఆయా సంస్థల ప్రతినిధులు. -
బల్క్ కనెక్షన్లకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: బల్క్ కనెక్షన్లు తీసుకున్న సబ్స్క్రయిబర్స్కు కొత్త కనెక్షన్లు జారీ చేసే అంశానికి సంబంధించి టెలికం శాఖ (డాట్) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. జూలై 20న జారీ చేసిన ఆదేశాల ప్రకారం కొత్త కనెక్షన్ల జారీ సమయంలో టెలికం ఆపరేటర్లు భౌతికంగా సదరు బల్క్ కనెక్షన్లున్న ఆవరణకు వెళ్లి, దానికి సంబంధించిన లొకేషన్ గ్రిడ్, తనిఖీ చేసిన సమయం తదితర వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. అలాగే యూజర్ల ఆవరణలను ప్రతీ ఆరునెలలకోసారి టెల్కోలు సందర్శించి, లొకేషన్ గ్రిడ్ వివరాలను సేకరించాలి. బల్క్ కనెక్షన్లను టెలికం కంపెనీలు తప్పనిసరిగా తనిఖీ చేసేలా చూసేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక, సిమ్ కార్డులను యాక్టివేట్ చేయడానికి ముందు బల్క్ కనెక్షన్లు తీసుకున్న కంపెనీ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఈ–కేవైసీ, డిజిటల్ కేవైసీ (నో యువర్ కస్టమర్) ఆధారంగా జారీ చేసిన కనెక్షన్లకు సంబంధించిన పలు దరఖా స్తు ఫారంలలో అడ్డదిడ్డంగా రాతలు ఉంటున్నాయని, వాటిని సరిచేయాలని టెల్కోలకు డాట్ సూ చించింది. టెలికం శాఖ అనుమతుల మేరకు గతం లో ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ప్రక్రియతో టెల్కో లు కనెక్షన్లు జారీ చేసేవి. అయితే, ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీం కోర్టు 2018లో కీలక మార్గదర్శకాలు ఇవ్వడంతో అప్ప ట్నుంచీ డిజిటల్ కేవైసీ ప్రక్రియ అమలవుతోంది. -
సోషల్ మీడియాకు కొత్త ఐటీ నిబంధనలు..
సోషల్ మీడియాలో వదంతులకు చెక్ పెట్టే విధంగా కేంద్రం కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)నిబంధనలు రూపొందిస్తోంది. వీటి ప్రకారం సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద సమాచారం మూలాలు గుర్తించడంతో పాటు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోగా సదరు సమాచారాన్ని తమ ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాల్సి ఉంటుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, మెసేజింగ్ యాప్స్ ద్వారా ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా తీసుకోతగిన చర్యల గురించి కేంద్రం గతేడాది డిసెంబర్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీటిని విశ్లేషించిన మీదట తాజా నిబంధనలు రూపొందించింది. -
మెరుగైన రిస్క్ టూల్స్‌ను అనుసరించాలి
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) మెరుగైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని ఆర్బీఐ కోరింది. అలాగే, నిర్దేశించిన లిక్విడిటీ కవరేజీ రేషియో (నిధుల నిర్వహణ నిష్పత్తి)కు అనుగుణంగా తగినంత నిధులను కలిగి ఉండాలని ఆదేశించింది. రూ.10,000 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తులను కలిగిన ఎన్బీఎఫ్సీలు, అలాగే, డిపాజిట్లను స్వీకరించని అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి నూతన నిబంధనలను ఆర్బీఐ ఇటీవలే విడుదల చేసింది. నూతన నిబంధనలను 2020 డిసెంబర్ నుంచి కచ్చితంగా ఆచరించాలని నిర్దేశించింది. లిక్విడిటీ కవరేజీ రేషియోలో కనీసం 50 శాతం అధిక నాణ్యతతో కూడిన లిక్విడిటీ ఆస్తులను కలిగి ఉండాలని, 2024 డిసెంబర్ నాటికి 100%కి దీన్ని తీసుకెళ్లాలని ఆర్బీఐ పేర్కొంది. పారితోషికంపై కొత్త నిబంధనలు: విదేశీ, ప్రైవేటు, స్మాల్ ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకుల్లో హోల్‌టైమ్ డైరెక్టర్లు, సీఈవోలకు చెల్లించే పారితోషికం విషయమై ఆర్బీఐ కొత్త నిబంధనలు తెచ్చింది. వేరియబుల్ పే (పనితీరు ఆధార చెల్లింపులు)ల్లో నగదు పరిమాణం 67 శాతానికి మించరాదని నిర్దేశించింది. ఉద్యోగులకు సంబంధించి సమగ్ర చెల్లింపుల విధానాన్ని బ్యాంకులు రూపొందించుకోవాలని, వార్షికంగా వాటిని సమీక్షించాలని పేర్కొంది. -
ఆర్టీఐ కమిషనర్ల పదవి మూడేళ్లే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సమాచార హక్కు కమిషనర్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించే ప్రతిపాదన సహా.. సమాచార హక్కు చట్టం నూతన నిబంధనలకు కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇకపై అన్ని నియామకాలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. వేతనం, ఇతర అలవెన్సులు, సర్వీసు నిబంధనల విషయంలో నిర్ణయాధికారం కొత్త నిబంధనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లభించింది. ఆయా నిబంధనలను మార్చే అధికారం కూడా ఇకపై కేంద్రానికి ఉండనుంది. 2005 చట్టంలో సమాచార హక్కు కమిషనర్ల పదవీ కాలాన్ని కచ్చితంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేవరకు అని నిర్ణయించగా, తాజా నిబంధనల్లో దాన్ని మూడేళ్లకు కుదించారు. ప్రధాన సమాచార కమిషనర్ వేతనాన్ని రూ. 2.5 లక్షలుగా, సమాచార కమిషనర్ వేతనాన్ని రూ. 2.25 లక్షలుగా నిర్ణయించారు. ఈ మార్పులు సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని కాలరాయడమేనని, తాజా నిబంధనల వల్ల సమాచార కమిషన్లు ప్రభుత్వ విభాగాల స్థాయికి తగ్గిపోతాయని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
డిగ్రీ అయ్యాక రెండేళ్లు ఉండొచ్చు
లండన్: యూకేలో డిగ్రీ, పీజీ చేసే విద్యార్థులకు భారీగా ఊరట లభించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్క్ వీసాలో పాత నిబంధనల్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో అక్కడ చదువుకునే నిపుణులైన విదేశీ విద్యార్థులు తమ కెరీర్ మలచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు భారీగా లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం అక్కడ చదివే విదేశీ విద్యార్థులు డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తయ్యాక 4నెలలు పాటు మాత్రమే ఉండే వీలుంది. 27 వర్సిటీలు పైలెట్ స్కీమ్ కింద ఆరు నెలల పాటు ఉండే అవకాశాన్ని కల్పిస్తాయి. వీసా నిబంధనల్ని సవరించడంతో చదువు పూర్తయ్యాక రెండేళ్ల పాటు యూకేలో ఉంటూనే ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు. డిగ్రీ పూర్తయిన నాలుగు నెలలు మాత్రమే దేశంలో ఉండే అవకాశం ఇస్తే, ఉద్యోగాలు ఎక్కడ వస్తాయని, దీని వల్ల టాలెంట్ ఉన్న వారంతా వేరే దేశాలకు తరలివెళ్లిపోతారని యూకేలో యూనివర్సిటీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై గత ఆరేళ్లుగా విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత పాత నిబంధనలనే తీసుకురావాలని బోరిస్ సర్కార్ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘‘వీసా నిబంధనల్ని పునరుద్ధరించడం వల్ల విద్యార్థులు రెండేళ్ల పాటు పని చేయడంలో అనుభవాన్ని తెచ్చుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకునే అవకాశం కలుగుతుంది’’ అని యూకే హోంమంత్రి భారత్ సంతతికి చెందిన ప్రీతి పటేల్ అన్నారు. భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య ఒకప్పుడు బ్రిటన్‌లో చదువు పూర్తయిన విద్యార్థులు మరో రెండేళ్ల పాటు అదే వీసాపై ఆ దేశంలో కొనసాగే అవకాశం ఉండేది. కానీ థెరిసా మే హోం మంత్రిగా ఉన్నప్పుడు 2012లో విద్యార్థులు రెండేళ్లు పాటు కొనసాగే నిబంధనలను రద్దు చేశారు. దీంతో బ్రిటన్‌కు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 55శాతానికి పడిపోయింది. 2010లో 51,218 మంది విద్యార్థులు బ్రిటన్‌కు వస్తే, 2011–12లో వారి సంఖ్య ఏకంగా 22,575కి పడిపోయింది. 2017–18 వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయి 15,338కి చేరుకుంది. గత ఏడాది మాత్రం మళ్లీ విద్యార్థుల సంఖ్య పెరిగి 21 వేలకు పైగా చేరుకుంది. ‘రెండేళ్ల పోస్ట్ స్టడీ వీసా పునరుద్ధరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గత ఆరేళ్లుగా ఈ వీసా పునరుద్ధరణకు మేము పోరాటాలు చేస్తున్నాం’ అని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అల్మని యూకే యూనియన్ సంస్థ చైర్ పర్సన్ సనమ్ అరోరా అన్నారు. -
సెబీ ‘స్మార్ట్’ నిర్ణయాలు
ముంబై: స్టార్టప్‌లకు జోష్‌నిచ్చే నిర్ణయాలను సెబీ తీసుకుంది. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటును స్మార్ట్ సిటీస్‌కు కల్పించింది. వీటితో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే నిర్ణయాలను కూడా ప్రకటించింది. మరోవైపు ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులకు సంబంధించి సమాచారమందించే వ్యక్తులకు రూ. కోటి నజరానా ఇస్తామని ప్రకటించింది. హౌసింగ్ ఫైనాన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ విభాగాలు కలిగిన కంపెనీలకు షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ సరళీకరించింది. రుణ చెల్లింపుల విఫలానికి సంబంధించిన వివరాలను రేటింగ్ ఏజెన్సీలకు లిస్టెడ్ కంపెనీలు వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. మ్యూచువల్ ఫండ్స్‌కు కూడా కఠిన నిబంధనలను జారీ చేసింది. బుధవారం సమావేశమైన సెబీ డైరెక్టర్ల బోర్డ్ పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలు.. ► ఎఫ్‌పీఐల నో యువర్ కస్టమర్(కేవైసీ) నిబం ధనలు మరింత సరళతరమయ్యాయి. ► స్మార్ట్ సిటీలు, సిటీ ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్ విభాగాల్లో నమోదైన సంస్థలు మునిసిపల్ బాండ్లతో నిధులు సమీకరించవచ్చు. ► ప్రస్తుతం స్టాక్ ఎక్సే్చంజ్‌ల ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్ఫార్మ్పై నమోదైన స్టార్టప్‌లు ఇక నుంచి స్టాక్ సూచీలకు మారవచ్చు. అయితే, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. ► ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి సమాచారమందించే వ్యక్తులు, సంస్థలకు (విజిల్ బ్లోయర్స్) రూ.కోటి దాకా నజరానా ఇవ్వనున్నారు. కంపెనీ ఆడిటర్లు దీనికి అనర్హులు. ► కంపెనీ చెల్లించిన మూలధనం, రిజర్వ్‌ల్లో 25%కి మించకుండా బైబ్యాక్ ఆఫర్ ఉండాలి. ఈ ఆఫర్ 10%కి మించినట్లయితే, ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ► లిస్టింగైన లేదా లిస్టింగ్ కాబోతున్న ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల్లోనే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అంతేకాకుండా రేటింగ్ లేని డెట్ సాధనాల్లో ప్రస్తుతం 25 శాతంగా ఉండే పెట్టుబడులను 5 శాతానికే పరిమితం చేయాలని కూడా సూచించింది. ► డెట్ పోర్ట్‌ఫోలియో స్కీమ్‌లు లిస్టింగ్ కాని ఎన్‌సీడీల్లో గరిష్టంగా 10 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ప్రతిపాదిత పరిమితులపై కాలానుగుణంగా సమీక్షించి, అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు. ► రేటింగ్ లేని డెట్ సాధనాల్లో డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్, రెపో ఆన్ జీ–సెక్, ట్రెజరీ బిల్లులను మినహాయిస్తే, కొన్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్‌కు మిగులుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బిల్స్ రీ–డిస్కౌంటింగ్(బీఆర్డీఎస్), మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, రెపో ఆన్ కార్పొరేట్ బాండ్స్, రీట్స్/ఇన్విట్స్ యూనిట్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► లిస్టైన కంపెనీల్లో ప్రజలకు ఉండాల్సిన కనీస వాటాను 25% నుంచి 35%కి పెంచాలన్న ప్రతిపాదనకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉందని సెబీ పేర్కొంది. అయితే లిస్టైన ప్రభుత్వ రంగ సంస్థల్లో 45 శాతం వరకూ ఇప్పటికీ, 25 శాతం నిబంధనను అందుకోలేకపోయాయి. అందుకని 35 శాతం పబ్లిక్ హోల్డింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని మరింతగా మదింపు చేయాల్సి ఉందని సెబీ పేర్కొంది. -
ఆ నేరగాళ్లకు రాజీ అవకాశం ఉండదు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా, ఉగ్రవాదులకు నిధుల చేరవేత, బినామీ ఆస్తులను, రహస్యంగా విదేశీ ఆస్తులను కలిగి ఉండటం, అవినీతి తదితర నేరాలకు పాల్పడేవారికి ఇక నుంచి ఐటీ విభాగంతో రాజీ కుదుర్చుకునే అవకాశాన్ని కల్పించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నిర్ణయించింది. పై నేరాలకు పాల్పడేవారు రాజీ కుదుర్చుకునే హక్కును కోల్పోతారంది. అయితే నేరస్తుడి ప్రవర్తన, నేరం స్వభావం, తీవ్రత, నేరానికి పాల్పడేందుకు ప్రేరేపించిన పరిస్థితులు తదితరాలను పరిగణనలోనికి తీసుకున్న అనంతరం, అవసరమనుకుంటే ఆ వ్యక్తులు/సంస్థలకు రాజీ అవకాశం ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థిక మంత్రికి ఉంటుందని స్పష్టం చేసింది. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇంటికే..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చట్టానికి ప్రభుత్వం పదునుపెడుతోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏకంగా పాలకవర్గాలనే రద్దు చేసేలా తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019లో నిబంధనలను పొందుపరుస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినా, నిధులు పక్కదారి పట్టినా ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా పురపాలక చట్టంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నెలాఖరులో ఈ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ముసాయిదా ప్రతులను న్యాయశాఖ పరిశీలనకు పంపింది. న్యాయశాఖ సూచనలు, సలహాల అనంతరం ముసాయిదా చట్టం కేబినెట్ ఆమోదానికి వెళ్లనుంది. సమర్థంగా పనిచేయకపోతే... పట్టణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మున్సిపాలిటీల్లో అవినీతికి ముకుతాడు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై కొరడా ఝళిపించాలని, అవినీతికి పాల్పడ్డట్లు తేలితే పాలకవర్గాలను రద్దు చేయాలని నిర్దేశించారు. ఈ మేరకు కొత్త చట్టం రూపకల్పనపై కసరత్తు చేసిన నిపుణుల కమిటీ... సమర్థ పాలన అందించలేకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినా సదరు మున్సిపాలిటీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కట్టబెడుతూ నూతన చట్టాన్ని రూపొందించింది. దీంతో పాలకవర్గం రద్దు కాగానే.. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు (వార్డు సభ్యులు), కో ఆప్షన్ సభ్యుల పదవి కూడా ఊడనుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా ఒకవేళ పాలకవర్గానికి ఆరు నెలల కంటే ఎక్కువ కాలపరిమితి ఉంటే రద్దయిన తేదీ నుంచి ఆరు నెలల్లో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. పాలకవర్గం స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించి పాలన కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను దూరంగా ఉంచనుంది. పురపాలకశాఖ విచక్షణ మేరకు స్థానిక కమిషనర్ లేదా ఇతర అధికారులను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించేలా చట్టంలో పేర్కొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆరేళ్లపాటు అనర్హత వేటు... నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని తేలితే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. చట్టంలోని నిబంధనలను పాటించకపోయినా, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినా, నిధుల దుర్వినియోగానికి పాల్పడినా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను తొలగించే విధంగా చట్టం ఉండనుంది. అదేవిధంగా ఒకసారి ఉద్వాసనకు గురైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు ఆ తేదీ నుంచి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కానున్నారు. వార్డుల హేతుబద్ధీకరణ! సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న సర్కారు.. వార్డుల ఏర్పాటులో హేతుబద్ధత పాటించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 1,500 నుంచి 15 వేల వరకు వార్డులు ఉన్నాయి. అయితే నిర్దేశిత జనాభా ప్రాతిపదికన కాకుండా అడ్డగోలుగా విభజించడంతో అభివృద్ధిలో అసమానతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలో వార్డుల వర్గీకరణపైనా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనాభాకు అనుగుణంగా కౌన్సిలర్ల సంఖ్యను ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది. -
ఎన్పీఏల గుర్తింపునకు ఇకపై నెల గడువు
ముంబై: మొండి బకాయిల్ని (ఎన్పీఏ) గుర్తించే విషయంలో ఆర్బీఐ శుక్రవారం నూతన నిబంధనలను విడుదల చేసింది. ఒక్కరోజు చెల్లింపుల్లో విఫలమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించాలన్న ఆర్బీఐ పూర్వపు ఆదేశాలను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో పాత నిబంధనల స్థానంలో ఆర్బీఐ కొత్తవాటిని తీసుకొచ్చింది. రుణ ఖాతాల పరిష్కారానికి సంబంధించి ఇంతకుముందు వరకు అమల్లో ఉన్న అన్ని పరిష్కార విధానాల స్థానంలో నూతన నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆర్బీఐ తెలిపింది. వీటి కింద ఇకపై ఎన్పీఏల ఖాతాల గుర్తింపునకు గాను 30 రోజుల గడువిచ్చారు. నూతన ఆదేశాల ప్రకారం ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తులను ముందే గుర్తించి, సకాలంలో వాటిని ఆర్బీఐకి తెలియజేసి పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఒత్తిడిలో (వసూళ్ల పరంగా) ఉన్న రుణ ఖాతాలను బ్యాంకులు ముందుగానే గుర్తించడంతోపాటు, చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన వెంటనే వాటిని ప్రత్యేకంగా పేర్కొన్న ఖాతాలుగా (ఎస్ఎంఏ) వర్గీకరించాల్సి ఉంటుందని ఆర్బీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. డిఫాల్ట్ అవడానికి ముందే పరిష్కార ప్రణాళికపై దృష్టి పెట్టాలని సూచించింది. ‘‘బ్యాంకు, ఆర్థిక సంస్థ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ వీటిల్లో ఏదైనా ఓ రుణగ్రహీత డిఫాల్ట్ అయినట్టు ప్రకటించిన అనంతరం 30 రోజుల్లోపు ఆయా రుణగ్రహీత ఖాతాకు సంబంధించి పరిష్కార విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. పరిష్కార ప్రణాళిక అమలు చేసేట్టయితే, రుణమిచ్చిన అన్ని సంస్థలూ అంతర్గత ఒప్పందంలోకి (ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్) వస్తాయి’’ అని ఆర్బీఐ పేర్కొంది. దివాలా లేదా వసూళ్లకు సంబంధించి చట్టపరమైన చర్యలు చేపట్టే స్వేచ్ఛ రుణదాతలకు ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను నిపుణులు ప్రశంసించారు. ‘‘నూతన కార్యాచరణను 2018 ఫిబ్రవరి 12 నాటి ఆదేశాల ఆధారంగా రూపొందించారు. తగినంత మెజారిటీతో పరిష్కారాలను అన్వేషించే యంత్రాంగం ఏర్పాటుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్ అన్నది నిబంధనల మేరకు బ్యాంకులు ఉమ్మడిగా పరిష్కా రాన్ని ఐబీసీకి వెలుపల గుర్తించేందుకు తోడ్పడుతుంది’’ అని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ ఎల్ విశ్వనాథన్ పేర్కొన్నారు. ‘‘నూతన నిబంధనలు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్‌బీఎఫ్‌సీలకు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఎన్పీఏల గుర్తింపు ఇప్పుడిక వేగాన్ని సంతరించుకుంటుంది’’ అని ఎకనమిక్ లా ప్రాక్టీస్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ సుహైల్ నథాని పేర్కొన్నారు. -
ఎవరెస్ట్.. ఇక అందరూ ఎక్కలేరు!
కాఠ్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇకపై ఎవరు పడితే వారు అధిరోహించే అవకాశం లేదు. ఎవరెస్ట్ శిఖరంపై పర్వతారోహకుల మరణాలు, ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ఎవరెస్ట్ అధిరోహణపై కొన్ని నిబంధనలు విధించాలని నేపాల్ పర్యాటక శాఖ ఆలోచిస్తుంది. అధిరోహకులకు కనీస అర్హతలు ఉండేలా చూడనుంది. ఎక్కువ తాళ్ల ఏర్పాటు, ఆక్సిజన్, ఎక్కువ షెర్పాలను తీసుకెళ్లడం వంటి నిబంధనలు తీసుకురానున్నట్లు నేపాల్ పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. టిబెట్ ప్రభుత్వం కేవలం 300 మందికి ఎవరెస్ట్‌ను అధిరోహించే అవకాశం కల్పిస్తుండగా నేపాల్ అపరిమితంగా పర్వతారోహకులకు అనుమతి మంజూరు చేస్తోంది. 11 వేల కిలోల చెత్త: ఎవరెస్ట్‌ను శుద్ధి చేసేందుకు నేపాల్ ప్రభుత్వం రెండు నెలల పాటు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా మొత్తం 11 వేల కిలోల చెత్తతో పాటు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. -
ఇంజనీరింగ్ ప్రవేశాలకు నూతన నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు, కాలేజీల గుర్తింపునకు సంబంధించి కొత్త నిబంధనలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనలను సవరిస్తూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది. శనివారం ఈ మేరకు అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. ఏఐసీటీఈ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచింది. కొత్తగా జారీ చేసిన నిబంధనలు 2018–19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేటు యూనివర్సిటీలకు ఏఐసీటీఈ గుర్తింపు తప్పనిసరి. కొత్తగా విద్యా సంస్థ అనుమతికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజును అదనంగా రూ.లక్ష పెంచింది. విద్యా సంస్థ క్యాంపస్ విస్తీర్ణాన్ని పట్టణ ప్రాంతాల్లో 2.5 ఎకరాల నుంచి 1.5 ఎకరాలకు, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 ఎకరాల నుంచి 4 ఎకరాలకు కుదించింది. ప్రస్తుతం ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి యూజీ స్థాయిలో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలనే నిబంధన ఉంది. తాజాగా ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండేలా 1:20 నిష్పత్తిగా నిబంధనను సవరించింది. పీజీ స్థాయిలో ఫార్మసీలో 1:10 నుంచి 1:5గా ఫ్యాకల్టీ ని నిర్ధారించింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 1:15 నుంచి 1:20గా నిర్దేశించింది. దీంతో కాలేజీల్లో ఫ్యాకల్టీ తగ్గే అవకాశం ఉంది. ఇది యాజమాన్యాలకు కొంత ఊరట కలిగించే అంశం. డిప్లొమాలోని అన్ని కోర్సుల్లో ప్రతి 20 మందికి ఒక ఫ్యాకల్టీ ఉండగా.. ఆ నిష్పత్తిని 1:25గా ఏఐసీటీఈ సవరించింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా ఇండక్షన్ ట్రైనింగ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కనీసం 48 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కూడిన ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సూచించింది. గతంలో 16 ఎంబీపీఎస్, 32 ఎంబీపీఎస్ స్పీడుతో అవకాశం ఇవ్వగా దాన్ని పెంచింది. దీంతో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌ను వీలైనంత వేగంగా చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇంటర్నెట్ వేగాన్ని సైతం పెంచాల్సి ఉంటుంది. -
సబ్సిడీ రుణాలు గోవిందా
అన్ని కార్పొరేషన్లకు బ్యాక్‌టు సబ్సిడీ విధానం అధికారులతో వర్కుషాపులు నిర్వహించనున్న సర్కారు రుణాల మంజూరులో మరిన్ని కఠిన నిర్ణయాలు? విజయనగరం కంటోన్మెంట్: ఏ ఆసరా లేనివారికి ఉపాధి కల్పించే విషయంలో సర్కారు కఠిన వైఖరి అవలంబిస్తోంది. సబ్సిడీలు వర్తింపజేయడానికి లెక్కలేనన్ని ఆంక్షలు విధిస్తోంది. రుణాల మంజూరులో లేనిపోని చిక్కులు కల్పిస్తోంది. యూనిట్ల పనితీరుకు పరీక్ష పెడుతోంది. సబ్సిడీని తాత్కాలికంగా రుణంగానే ఇస్తూ... దానిపైనా వడ్డీ వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వెనుకబడి, అట్టడుగున ఉన్నవారికి ఆసరా కల్పించేందుకు ఏర్పాటు చేసిన సబ్సిడీ రుణాలపై సర్కారు కఠినవైఖరి అనుసరిస్తోంది. ప్రతీ సబ్సిడీ రుణానికీ ముందుగా సబ్సిడీ విడుదల చేస్తే దాంతో బ్యాంకు రుణం జత చేసుకుని ఉపాధి పొందేందుకు అవకాశం ఉండేది. కానీ బ్యాక్‌టు సబ్సిడీ విధానాన్ని ప్రవేశ పెట్టి మొత్తంగా రుణాలుగానే అందించి... రెండేళ్లపాటు సబ్సిడీని లాక్ చేసే కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. భవిష్యత్తులో ఇక సబ్సిడీ అనేదే తమకు అందకుండా చేయాలన్నదే సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. ముందుగా సబ్సిడీ వస్తేనే రుణం ఇచ్చే బ్యాంకర్లకు సబ్సిడీ లాక్ చేసుకుని ఆ మొత్తాన్ని కూడా రుణంగా ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చేసింది. మొదటగా పైలట్ ప్రాజెక్టు రూపంలో ఎస్సీ కార్పొరేషన్‌కు అన్వయించిన ఈ విధానం ఇప్పుడు బీసీ కార్పొరేషన్‌కూ వర్తింపజేసింది. త్వరలో మరిన్ని కార్పొరేషన్లలో అమలు చేయనుంది. యూనిట్ కొనసాగితేనే... రుణంగా పొందిన యూనిట్ నిర్వహణపై ఇక డేగకన్ను వేస్తారు. ఏమాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినా ఆ లబ్ధిదారుకు సబ్సిడీని రద్దు చేస్తారు. కార్పొరేషన్ల అధికారులు ఆ యూనిట్లను మూడు నెలలకోసారి పర్యవేక్షించి యూనిట్ నడుస్తుందని ధ్రువీకరించి సర్టిఫికేట్ ఇవ్వాలి. అలా రెండేళ్ల పాటు ఇస్తే యూనిట్ నడుస్తుందని సబ్సిడీ ఉంటుంది. యూనిట్లో నష్టం వచ్చినా... మరే ఇతర ఇబ్బందులెదురయినా సబ్సిడీ రద్దవుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఈ కొత్త విధానాన్ని అవలంబించి లబ్దిదారులకు సబ్సిడీని రానీయకుండా చేసే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెబుతున్నారు. దీనిని మరింత కఠినతరం చేసేందుకు ఈ అంశాలనే ప్రాధాన్యాంశాలుగా తీసుకుని గుంటూరు, విజయవాడల్లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అందరు అధికారులు, కార్పొరేషన్ల ఈడీలు, బ్యాంకర్లతో వర్క్ షాపులను నిర్వహిస్తున్నట్టు తెల్సింది. గత ఐదేళ్లలో సగమే రుణం జిల్లాలో గత ఐదేళ్లుగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలో నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం రుణాలివ్వడమే లేదు. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వారికే రుణాలనిచ్చి నిరుపేదలకు మొండిచెయ్యి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తంగా అన్ని కార్పొరేషన్లకూ బ్యాక్‌టు సబ్సిడీ విధానాన్ని అవలంబించడం దారుణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
భారీ రుణాలకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
♦ అధికంగా రుణాలు జారీ చేస్తే ప్రత్యేక కేటాయింపులు ♦ ఒక కార్పొరేట్ గ్రూపునకు మూలధనంలో 25 శాతమే రుణం ముంబై: బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల సమస్య (ఎన్పీఏ) పెరిగిపోవడంతో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ రుణాల విషయంలో బ్యాంకులకు కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఇవి 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం ‘స్పెసిఫైడ్ బారోవర్’కు సాధారణ రుణ జారీ పరిమితి (ఎన్‌పీఎల్‌ఎల్)కి మించి రుణాలు జారీ చేయాలంటే అధిక రిస్క్‌ను భరిస్తూ బ్యాంకులు అందుకు తగినట్టు అదనంగా నిధులు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఎన్‌పీఎల్‌ఎల్‌కు మించి జారీ చేసే రుణాలకు అదనంగా 3 బేసిస్ పాయింట్ల మేర నిధులను ప్రత్యేకించాల్సి ఉంటుంది. ఒక సంస్థకు బ్యాంకుల కూటమి కలసి రుణం జారీ చేసినసందర్భంలో ఒక్కో బ్యాంకు విడిగా ఎంత మేర రుణం ఇస్తే ఆ మేర ఈ రేషియోను పంచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన ఏడాది తర్వాత పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఓ కార్పొరేట్ సంస్థకు 25 శాతమే: కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు ఏ కార్పొరేట్ గ్రూపునకు కూడా తన మూలధనంలో 25%కి మించి రుణం ఇవ్వరాదు. ఎన్పీఏ రిస్క్‌ను దృష్టిలో ఉంచుకున్న ఆర్బీఐ ప్రస్తుతమున్న 55 శాతం పరిమితిని 25%కి తగ్గించింది. ఈ పరిమితి అన్నది ప్రస్తుత మూలధన నిధుల ప్రకారం కాకుండా టైర్ 1 మూల ధనంపై వర్తిస్తుందని ఆర్బీఐ తన ముసాయిదాలో పేర్కొం ది. దీనిపై ప్రజాభిప్రాయాలకు ఆర్బీఐ ఆహ్వానం పలికింది. ఈ నిబంధనలు 2019 మార్చి 31 నుంచి అమలు చేయనున్నట్టు తెలిపింది. ఆర్బీఐ ప్రతిపాదనలు బాసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ (బీసీబీఎస్) సూచనలకు అనుగుణంగానే ఉన్నాయి. బీసీబీఎస్ సైతం బ్యాంకులను వాటి మూల ధనం ఆధారంగా రుణాల జారీని పరిమితం చేయాలని సూచించింది. ఎస్‌హెచ్‌జీలకు 7% వడ్డీకే రుణాలు: వార్షికంగా ఏడు శాతం వడ్డీకే స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రుణాలు మంజూరు చేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. 250 జిల్లాల్లో అన్ని రకాల మహిళా ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకులు రుణాలు అందించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద అన్ని ఎస్‌హెచ్‌జీలు వడ్డీ రాయితీపై ఏడు శాతానికే రుణాలు పొందడానికి అర్హులుగా పేర్కొంది. మసాలా బాండ్లకు అనుమతి: బ్యాంకులు ద్రవ్య సర్దుబాటు కింద మసాలా బాండ్ల జారీకి, కార్పొరేట్ బాండ్ల స్వీకరణకు ఆర్బీఐ అనుమతించింది. ద్రవ్య సరఫరాను మెరుగుపరిచేందుకు, మార్కెట్ అభివృద్ధికి ఈ చర్యలు తోడ్పడతాయని ఆర్బీఐ పేర్కొంది.