సాఫ్ట్‌వేర్ జాబ్ చేయడం మీ కలనా? అయితే మీకో శుభవార్త. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలని ఉంటుంది. కానీ ఏ కోర్స్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏ కోర్స్ చేస్తే ఎంత శాలరీ వస్తుంది. ఈ కోర్స్ చేయడం మంచిదేనా అంటూ ఇలా రకరకాల అనుమానాలతో సందిగ్ధతకు గురవుతుంటారు. అలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ ఇటీవల జరిగి ఓ సర్వే రాబోయే రోజుల్లో సాఫ్ట్‌వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి కోర్స్‌లు నేర్చుకుంటే భవిష్యత్ బాగుంటుందనే విషయాల్ని వెల్లడించింది.
'2022 టెక్ స్కిల్స్ అండ్ ట్రెండ్స్ రిపోర్ట్' పేరుతో ఇటీవల వెలుగులోకి వచ్చిన సర్వే ప్రకారం.. 2019-2021 మధ్య 2లక్షలకు పైగా అసెస్‌మెంట్‌ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా, సాంకేతిక నైపుణ్యాలు నిరంతరం అభివృద్ధి చెందుతూ, డిజిటలైజేషన్ ప్రక్రియ వ్యాపార కోణాన్ని మారుస్తోందని నివేదిక గుర్తించింది. అందువల్ల, జావా, జావాస్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్ డెవలపర్‌లు ఈ సంవత్సరంలో అన్ని టెక్ విభాగాల్లో డిమాండ్ ఉన్న స్కిల్‌గా భావిస్తున్నారు.
ఫ్రంటెండ్, బ్యాకెండ్ ఫుల్ స్టాక్ డెవలపర్లకు బీభత్సమైన డిమాండ్ ఉంది. అయితే డేటా సైన్స్, ఏడబ్ల్యూఎస్, ఎజెడ్యూఆర్ఈAzure, ఎస్‌క్యూఎల్, డేటా విశ్లేషణ, క్లౌడ్ సిస్టమ్, ఆటోమేషన్, డేటా సైన్స్, వెబ్ ప్రోగ్రామింగ్ తో పాటు డేటా విజువలైజేషన్‌లో ఉపయోగించడం వల్ల పైథాన్ అత్యంత ప్రజాదరణ పొందిన కోడింగ్‌గా ఉద్భవించిందని సర్వేలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment