
ముంబై: కరోనా వైరస్‌ను ఎదుర్కొని వృద్ధి పథంలో దూసుకెళ్లెందుకు ఐటీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ అంశంపై ఇన్ఫోసిస్ ఉన్నతాధికారి రిచర్డ్ లోబో స్పందిస్తూ.. లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు కొంత ఇబ్బంది పడ్డామని, కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో అత్యుత్తమ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే కంపెనీకి చెందిన షేర్ హోల్డర్లతో చర్చించి సంస్థకు ఉపయోగపడే మెరుగైన విధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు.
బీవైఎల్‌డీ కన్సెల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ సోన్స్ స్పందిస్తూ.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని, కంపెనీ వృద్ధికి దోహదపడే ఉద్యోగులకే సంస్థలు ప్రాధాన్యత ఇస్తాయని అన్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇన్పోసిస్ సంస్థ ఉద్యోగుల శ్రేయస్సు కొరకు ప్రత్యేకమైన టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు లోబో తెలిపారు. (చదవండి: ఉద్యోగాలు, బోనస్ ఇస్తున్నాం: యాక్సెంచర్)
Comments
Please login to add a commentAdd a comment