
ముంబై: కరోనా ఉదృతి నేపథ్యంలో దేశీయ ఐటీ కంపనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించి నాణ్యమైన సేవలు అందించాలని భావిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి అంతర్జాతీయ కంపెనీల వ్యూహాలను అధ్యయనం చేస్తున్నాయి. ఐటీ ప్రాజెక్ట్స్‌కు కేంద్ర బిందువైన అమెరికా, యూకే దేశాలలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశానికి ఎక్కువ ప్రాజెక్టులు అందించే ఈ దేశాలు సంక్షోభంలో ఉండడం తీవ్ర నష్టమని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. గత మూడెళ్లగా దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలు డిజిటల్ వ్యవస్థను పటిష్టం చేస్తున్న తరుణంలో కరోనా సంక్షోభం రావడం ఐటీ వృద్ధికి తీవ్ర నష్టమని నిపుణులు అంచానా వేస్తున్నారు.