సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నంలో వచ్చే ఏడాది జనవరిలో ఐటీ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ఐటీ అసోసియేషన్ (ఐటాప్), ఏపీఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏపీఐఎస్, ఎస్‌టీపీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ వైజాగ్–2023 ఐటీ సమ్మిట్ పోస్టర్, వెబ్‌సైట్‌ని మంత్రి అమర్‌నాథ్ శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు.
జనవరి 20, 21 తేదీల్లో స్థానిక మారియట్ హోటల్‌లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తొలి రోజున ఎస్‌టీపీఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, స్టార్టప్‌లతో పాటు ఐటీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, రెండో రోజున బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం)తో పాటు ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు, ఐటీ రంగ నిపుణులు చర్చిస్తారని వివరించారు. ఐటాప్ అధ్యక్షుడు శ్రీధర్ కొసరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment