Information technology sector
-
టెక్నాలజీతో అగ్రగామిగా నిలిచేందుకు..
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను అనుకూలంగా మలచుకొని పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆవిష్కరణల రంగాల్లో అగ్రగామిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 5, 6 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్ పేరిట రెండు రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సు ద్వారా కృత్రిమ మేథ (ఏఐ) సహా ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. పాఠ్య పుస్తకాల్లో ‘ఏఐ పాఠాలు’ కృత్రిమ మేథ (ఏఐ)కు ఉన్న భవిష్యత్తు దృష్ట్యా ఇప్పటి నుంచే ఈ రంగం అభివృద్ధికి మౌలికవసతులు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తద్వారా కొత్త తరం ఆవిష్కర్తలు, పెట్టబడిదారులను రప్పించడం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా అభివృద్ధి సాధించాలని భావిస్తోంది. ఏఐ సాయంతో వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయడంతోపాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏఐ పాఠ్యాంశాలను చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏఐతోపాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీ పాఠాలను బోధించడం ద్వారా భవిష్యత్తు తరానికి నిత్య జీవితంలో వాటి వినియోగంపై అవగాహన పెంచడం సాధ్యమవుతుందని భావిస్తోంది. ఏఐ ద్వారా వాతావరణ మార్పులను ముందే గుర్తించి రైతులు, ప్రజలను అప్రమత్తం చేసేలా నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వనుంది. స్కిల్స్ యూనివర్సిటీలో ఏఐకి ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏఐ సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా కోర్సులకు రూపకల్పన జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం చెబుతున్న ఫోర్త్ సిటీలోనూ ఏఐ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న నూతన పారిశ్రామిక పాలసీని కూడా ఏఐ టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, ఆవిష్కరణలు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా రూపొందిస్తున్నారు. ఇతర సాంకేతికతలతో ఏఐ మేళవింపు ద్వారా దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ‘డ్రైవర్ లెస్ టెక్నాలజీ’పై ఐఐటీ హైదరాబాద్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. దేశీయంగా రోడ్లు, మౌలికవసతులకు సంబంధించిన అనేక సంక్లిష్ట అంశాలను దృష్టిలో పెట్టుకొని ‘డ్రైవర్ లెస్’వాహనాలపై జరుగుతున్న పరిశోధనల విషయంలో ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం వీలైనంత త్వరగా కొత్త టెక్నాలజీని రాష్ట్రంలో అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. -
ఐటీ పవర్ హౌస్‌లుగా పట్టణాలు
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను ‘పవర్ హౌస్’లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలుచోట్ల ‘ఐటీ హబ్’లను నిర్మిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ రెండో ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) పాలసీ (2021–26) ప్రకారం వచ్చే రెండేళ్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 25 వేల ఐటీ ఉద్యోగాల కల్పనతో పాటు, రాష్ట్ర ఐటీ ఎగుమతుల్లో 5 శాతం ఇక్కడి నుంచే సాధించేలా సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ప్రభుత్వం ఇప్పటికే నిర్మించిన ఐటీ హబ్‌లతో పాటు ఇతర ప్రైవేటు సంస్థల ద్వారా 9 వేల ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో టీఎస్ఐఐసీ ద్వారా నిర్మించిన ‘ఐటీ హబ్’ల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేటల్లో ఐటీ హబ్‌ల నిర్మాణం పనులు చివర దశకు చేరకున్నాయి. ఈ నెల 15న సిద్దిపేట ఐటీ హబ్‌ను రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావుతో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు వరంగల్, ఖమ్మం ఐటీ హబ్‌లలో సీటింగ్ సామర్థ్యానికి మించి ఐటీ కంపెనీల నుంచి డిమాండ్ ఉండటంతో ఆయా ప్రాంతాల్లో రెండో దశ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వరంగల్ ఐటీ హబ్ రెండో దశ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, ఖమ్మంలోనూ త్వరలో ప్రారంభం కానున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి ది్వతీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా ఉద్యోగాల కల్పనతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే వరంగల్ లాంటి పట్టణాల్లో టెక్ మహీంద్ర, సియాంట్, ఎల్టీఐ మైండ్ ట్రీ, జెన్పాక్ట్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు విస్తరించాయి. వరంగల్ ఐటీ హబ్‌లోనే ఏకంగా 2,500 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. స్టార్టప్‌లను ప్రోత్సహించడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా టీ హబ్, ‘టాస్్క’, వీ హబ్ వంటి సంస్థలు కూడా తమ ప్రాంతీయ కార్యాలయాలను ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ఐటీ హబ్‌లలో ఏర్పాటు చేస్తున్నాయి. స్థానికంగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు టాస్క్ నిరంతర శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. సిద్దిపేటలో ఈ నెల 15న ప్రారంభమయ్యే ఐటీ హబ్‌లోనూ టాస్క్ ద్వారా ప్రతి బ్యాచ్‌లో 150 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వడంతో పాటు స్థానికంగా ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించే దిశగా ఐటీ శాఖ సన్నాహాలు చేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా.. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌ల నిర్మాణంతో కంపెనీలను ఆకర్షించేందుకు ఐటీ శాఖ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇటీవలి యూకే, అమెరికా పర్యటనల్లో మంత్రి కేటీ రామారావు ఎన్ఆర్ఐ సీఈఓలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్లగొండ ఐటీ హబ్‌లలో కంపెనీల ఏర్పాటుకు అనేక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. సొనాటా సంస్థ నల్లగొండ ఐటీ టవర్‌లో 200 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. వనపర్తి, రామగుండంలోనూ.. ప్రస్తుతం కరీంనగర్, బెల్లంపల్లి వంటి పట్టణాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఐటీ హబ్‌లలోనే కాకుండా పలు ప్రైవేటు సంస్థలు అద్దె భవనాల్లో ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్లో ఎక్లాట్ సొల్యూషన్స్ అనే కంపెనీ సుమారు వేయి మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్‌లతో పాటు కొత్తగా వనపర్తి, రామగుండంలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భవిష్యత్తులో కనీసం 500 సీటింగ్ కెపాసిటీతో చిన్న పట్టణాల్లో మరిన్ని ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. – జయేశ్ రంజన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి -
విశాఖలో ఐటీ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నంలో వచ్చే ఏడాది జనవరిలో ఐటీ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ఐటీ అసోసియేషన్ (ఐటాప్), ఏపీఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏపీఐఎస్, ఎస్టీపీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ వైజాగ్–2023 ఐటీ సమ్మిట్ పోస్టర్, వెబ్‌సైట్‌ని మంత్రి అమర్నాథ్ శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు. జనవరి 20, 21 తేదీల్లో స్థానిక మారియట్ హోటల్లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తొలి రోజున ఎస్టీపీఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, స్టార్టప్‌లతో పాటు ఐటీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, రెండో రోజున బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం)తో పాటు ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు, ఐటీ రంగ నిపుణులు చర్చిస్తారని వివరించారు. ఐటాప్ అధ్యక్షుడు శ్రీధర్ కొసరాజు పాల్గొన్నారు. -
ఐటీలో కొలువుల ఖుషీ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిపరమైన పరిణామాలతో సాఫ్ట్వేర్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నియామకాల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జూన్ ముగిసే నాటికి) టాప్ 10 ఐటీ కంపెనీలు 1.21 లక్షల మంది ఉద్యోగులను తీసుకోవడం ఇందుకు నిదర్శనం. గడిచిన అయిదేళ్ల కాలంలో ప్రథమార్ధంలో నియామకాలకు సంబంధించి ఇది గరిష్టం కావడం గమనార్హం. దీనికన్నా ముందు 2019 తొలి ఆరు నెలల్లో టాప్ 10 కంపెనీలు అత్యధికంగా 45,649 మంది సిబ్బందిని నియమించుకున్నాయి. ఇక ఈ ఏడాది విషయానికొస్తే, డిజిటల్ విభాగంపై అంతర్జాతీయంగా కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నందున హైరింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2021 పూర్తి ఏడాదిలో నియామకాలు 2 లక్షల స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నాయి. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో అంతా డిజిటల్ బాట పట్టడం మరింత వేగవంతం అవుతుండటంతో ఐటీ కంపెనీలు కూడా ఆదాయాలపై అత్యంత ఆశావహంగా ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది రెండంకెల స్థాయి వృద్ధిపై ధీమాగా ఉన్నాయి. కొత్త టెక్నాలజీల ఊతం.. నిపుణులకు డిమాండ్ ఆల్–టైమ్ గరిష్ట స్థాయిలో ఉంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కంపెనీల్లో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణమని పేర్కొన్నాయి. మొదటిది కొంగొత్త టెక్నాలజీలు కాగా రెండోది డిజిటల్ అంశమని తెలిపాయి. దాదాపు దశాబ్దం క్రితం సుమారు ఒకే రకం టెక్నాలజీతో పరిశ్రమ నడిచేదని, ప్రస్తుతం రకరకాల టెక్నాలజీలు ఆవిష్కృతమవుతున్నాయని వివరించాయి. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, క్లౌడ్, 5జీ.. ఇలా అనేకానేక సాంకేతికతలు పుట్టుకొస్తుండటంతో నిపుణులకు డిమాండ్ పెరుగుతోందని ఓ ఐటీ కంపెనీ అధికారి తెలిపారు. ఇక, రెండో అంశమైన డిజిటల్ విషయానికొస్తే ప్రస్తుతం చాలా కంపెనీల ఆదాయాల్లో ఈ విభాగం వాటా 30–50 శాతం దాకా ఉంటోంది. ఈ కారణంగానూ పెద్ద సంఖ్యలో డిజిటల్ నిపుణుల నియామకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయా టెక్నాలజీల్లో సుశిక్షితులైన వారి సంఖ్య పరిమితంగానే ఉండటంతో డిమాండ్‌తో పాటు వేతన ప్యాకేజీ కూడా పెరుగుతోందని వివరించాయి. ఈ నిపుణులకు డిమాండ్.. డేటా సైంటిస్టులు, ఫుల్ స్టాక్ ఇంజినీర్లు, సైబర్‌సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు మొదలైన వారికి డిమాండ్ అధికంగా ఉంటోంది. డేటా సైంటిస్టు ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు లక్షల్లో ఉన్నాయి. క్లౌడ్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, నెట్వర్క్ సెక్యూరిటీ వంటి వివిధ విభాగాల్లో యాక్సెంచర్ సంస్థలో 34,000 పైచిలుకు ఖాళీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్వాంటమ్ మెషిన్ లెరి్నంగ్ వంటి టెక్నాలజీల్లో నిపుణులకు ప్రారంభ వేతనాలు నెలకు రూ. 1.20 లక్షల దాకా ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ ఒక నివేదికలో తెలిపింది. అట్రిషన్ రేటు పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసుకోవడానికి కంపెనీలు జీతభత్యాలను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో కంపెనీలకు ఆ మేరకు వ్యయాలు పెరుగుతాయని వివరించింది. అట్రిషన్ సమస్య పరిష్కారానికి, డిమాండ్ అందుకోవడానికి కంపెనీలు జోరుగా ఫ్రెషర్ల నియామకాలు చేపట్టనున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ నాలుగు ఐటీ కంపెనీలు 1.1 లక్షల మంది ఫ్రెషర్లను తీసుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఉద్యోగాల కల్పనలో మేటి.. దాదాపు 45 లక్షల మంది పైగా ఉద్యోగులతో సాఫ్ట్వేర్ రంగం దేశీయంగా అత్యధికంగా ఉద్యోగాలు కలి్పస్తున్న రంగాల్లో ఒకటిగా ఉంటోంది. వీటిలో దేశ విదేశ ఐటీ, బీపీఎం కంపెనీలు కూడా ఉన్నాయి. భారత్ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 1992–93లో ఐటీ రంగం వాటా 0.4%గా ఉండగా ప్రస్తుతం 8%కి చేరింది. 1991లో 150 మిలియన్ డాలర్లుగా ఉన్న పరిమాణం ఇప్పుడు 194 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఉపాధి కల్పన కూడా భారీగా పెరిగింది. టాప్ 10 ఐటీ కంపెనీలలో అయిదేళ్ల క్రితం 10 లక్షలుగా ఉన్న సిబ్బంది సంఖ్య 40% పెరిగి 14 లక్షలకు చేరింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థల్లో రెండు లక్షల మంది పైగా సిబ్బంది ఉండగా.. హెచ్‌సీఎల్ టెక్‌లో 1.76 లక్షలు, టెక్ మహీంద్రాలో 1.26 లక్షల ఉద్యోగులు ఉన్నారు. 5 లక్షల మంది ఉద్యోగులతో టీసీఎస్ దేశీయంగా ప్రైవేట్ రంగంలో అత్యధికంగా కొలువులు కల్పిస్తున్న కంపెనీగా ఎదిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ సంస్థలు రెండంకెల స్థాయి ఆదాయాలు ఆశిస్తున్న నేపథ్యంలో హైరింగ్ మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని అంచనాలు ఉన్నాయి. -
ఆఫీసు నుంచా.. ఇంటి నుంచా..!
సాక్షి, హైదరాబాద్: ఆతిథ్య, రిటైల్ రంగాల తరహాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కూడా సెప్టెంబర్ నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. తద్వారా ఐటీ రంగంపై పరోక్షంగా ఆధారపడి న అనేక మందికి తిరిగి ఉపాధి దొరుకుతుందని భావిస్తోంది. కోవిడ్ థర్డ్‌వేవ్‌ను కారణంగా చూపుతూ ఐటీ ఉద్యోగు లు ఆఫీసుల నుంచి పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. మరోవైపు బడా ఐటీ కంపెనీలు వారానికి ఐదు రోజుల పని విధానం కాకుండా పరిమిత సంఖ్యలో కార్యాలయాలకు ఉద్యోగులు హాజరయ్యే హైబ్రిడ్ వర్క్‌ప్లేస్ (కొద్దిరోజులు ఇంటి నుంచి, మరికొద్ది రోజులు ఆఫీసు నుంచి పనిచేయడం) విధానంవైపు మొగ్గు చూపుతున్నాయి. కోవిడ్‌తో ఉపాధి కోల్పోయిన రవాణా, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర ఉద్యోగులు మాత్రం ఐటీ ఆఫీసులు తిరిగి కళకళలాడే రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. 10 శాతానికి మించని హాజరు కోవిడ్ మూలంగా ఏడాదిన్నరగా మూతపడిన హైదరాబాద్ ఐటీ కార్యాలయాల్లో సిబ్బంది హాజరు గత జూన్ నాటికి 60శాతానికి చేరుకుంటుందని ఐటీ వర్గాలు అంచనా వేశాయి. అది ఈ ఏడాది చివరి నాటికి 80శాతానికి పైనే ఉంటుందని సర్వే లు వెల్లడించాయి. అయితే గత ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్ రెండో దశ విజృంభించడంతో ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల హాజరు పదిశాతంగా నమోద వుతోంది. థర్డ్‌వేవ్ భయంతోపాటు వ్యాక్సినేషన్ పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో ఐటీ దిగ్గజ సంస్థలు 20 శాతం మంది ఉద్యోగులు బృందాల వారీగా ఆఫీసు నుంచి పనిచేసేలా ‘హైబ్రిడ్’విధానాన్ని తెరమీదకు తెస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, విప్రో వంటి సంస్థలు వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వచ్చేలా ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నాయి. ఇతరుల సమస్యలనూ అర్థం చేసుకోండి వ్యాక్సినేషన్ వేగం పెరగడంతోపాటు రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వి«ధానంతో ఆ రంగంపై ఆధారపడిన ట్యాక్సీ డ్రైవర్లు, క్యాంటీన్లు, హౌజ్ కీపింగ్, సెక్యూరిటీ, ఇతర సర్వీసు ప్రొవైడింగ్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ రంగం కూడా సెప్టెంబర్ నుంచి పూర్తి సామర్థ్యం తో పనిచేయాలని కోరుకుంటున్నాం. వారిపై ఆధారపడిన ఇతర రంగాల వారి సమస్యలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. – జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ, పరిశ్రమల శాఖ డిసెంబర్ నాటికి మెరుగవుతుంది కోవిడ్ పరిస్థితుల్లోనూ హైదరాబాద్ ఐటీ రంగం మంచి పురోగతి సాధిస్తోంది. రాష్ట్రంలోని 1,500కు పైగా ఐటీ కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. 2020–21లో 13 శాతం వృద్ధిరేటుతో 1.45 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. వచ్చే ఏడాది కూడా రెండంకెల వృద్ధిరేటు సాధించడం ఖాయం. ఆఫీసు నుంచే పనిచేయాలని భారతీయ కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తుండగా, దిగ్గజ సంస్థలు హైబ్రిడ్ విధానానికి మొగ్గు చూపుతున్నాయి. అందువల్ల డిసెంబర్ నాటికి ఆఫీసుకొచ్చే ఉద్యోగుల శాతం మెరుగవుతుందని అంచనా వేస్తున్నాం. –భరణికుమార్ ఆరోల్, ప్రెసిడెంట్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ -
లోకల్ ఐటీకి బూస్టింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సంస్థలను పెద్దఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు స్థానిక ఐటీ సంస్థల నుంచే సంబంధిత సేవలను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2020–23 కింద స్థానిక ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేవిధంగా పలు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగంలోనూ స్థానిక సంస్థలను పెద్దఎత్తున ప్రోత్సహించే విధంగా కీలక చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూని కేషన్స్ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక లోకల్ ఐటీ రంగం నుంచే కొనుగోళ్లు .. ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు రూ.కోటిలోపు విలువైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఐటీ సర్వీసులను స్థా నిక ఐటీ సంస్థల నుంచి కొనుగోలు చేసే విధంగా ఐటీ పాలసీ 2021–24లో నిబంధన విధించారు. ఏటా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు కలిపి ఐటీ సేవలకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్ల విలువైన కొనుగోళ్లు చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా బయట రాష్ట్రాల నుంచే ఉంటుండ టంతో స్థానిక ఐటీ కంపెనీలను ప్రోత్సహించే విధంగా పలు ప్రతిపాదనలు చేశారు. కంపెనీలు రాష్ట్రంలో నమోదై కనీసం 50 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే నిబంధన విధించింది. అంతేకాదు రూ.కోటి విలువ దాటిన టెండర్ల ఖరారు సమయంలో సాంకేతిక మదింపు సమయం లో స్థానిక ఐటీ కంపెనీలకు 5 శాతం అదనపు ప్రా ధాన్యత కల్పించాలి. ఇందుకోసం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ప్రత్యేక పోర్టల్‌ను అందుబా టులోకి తీసుకురానుంది. ఈ నిర్ణయంతో పలు ఐటీ కంపెనీలు రాష్ట్రంలో నమోదు చేసుకోవడం ద్వారా ఇక్కడే నుంచే సర్వీసులు అందిస్తాయని.. తద్వారా పెద్దఎత్తున ఐటీ కంపెనీలను ఆకర్షించవచ్చని సీఐఐ ఏపీ చాప్టర్ మాజీ చైర్మన్, ఎఫ్ట్రానిక్స్ సీఈవో దాసరి రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. డేటా భద్రతకు అధిక ప్రాధాన్యత ప్రభుత్వ విభాగాల్లో వినియోగించే ఐటీ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ నాణ్యత, భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా డేటా సెంటర్ ఏ ర్పాటు చేయడంతో పాటు ఐటీ ఉత్పత్తులు, సేవల విషయంలో కేంద్రీకృత వ్యవస్థను ఏ ర్పాటు చేస్తోంది. ఇకనుంచి ప్రభుత్వ విభాగా లు కొనుగోళ్లకు సంబంధించి ఏపీటీఎస్‌ను అధీకృత ఏజెన్సీగా ఐటీ శాఖ నియమించిం ది. రూ.10 లక్షలు దాటి కొనుగోలు చేసే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్, ఐటీ సేవలను ఇకపై ఏపీటీఎస్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.10 లక్షల లోపు కొనుగోలు చేసే వాటికి రేట్ కాంట్రాక్ట్‌ను ఏపీటీఎస్ నిర్దేశిస్తుంది. ఐటీ భద్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రభుత్వం ఏకీకృత నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. ఈ మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో త్వరోలోనే ఐటీ శాఖ వీటికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించనుంది. -
ఇదిగిదిగో నీటి కుక్క!
సాక్షి, హైదరాబాద్: అది ఓ అరుదైన ఉభయచరం.. ప్రపంచవ్యాప్తంగా అంతరించబోయే జాతుల్లో ఆ జీవి ఉంది.. హైదరాబాద్ శివార్లలో అనుకోకుండా ప్రత్యక్షమైంది.. అదే నీటిపైనా, నేలమీదా ఉండగలిగే స్మూత్ కోటెడ్ ఒటొర్ (నీటి కుక్క). నాలుగైదు రోజుల క్రితం హిమాయత్‌సాగర్ జలాల్లో దీనిని పర్యావరణ, పక్షి ప్రేమికులు కనిపెట్టడమే కాకుండా దాన్ని తమ కెమెరాల్లోనూ బంధించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కంప్యూటర్ నిపుణులుగా పనిచేస్తున్న శ్రీకాంత్ భమిడిపాటి, గోకుల్ కృష్ణ అద్దంకి పర్యావరణ ప్రేమికులుగా, ‘బర్డ్‌వాచర్స్’గా తమ అభిరుచిని చాటుకుంటున్నారు. నాలుగైదు రోజుల కింద హిమాయత్‌సాగర్ వైపు వెళ్లినపుడు ఓ అరుదైన దృశ్యం కంటపడింది. పిల్లి, పులి, కుక్కల ఆకారం పోలిన ఒక నల్లటి జంతువు వేగంగా పరిగెడుతూ నీళ్లలోకి వెళ్లింది. వెంటనే వారు నాలుగైదు ఫొటోలు తీశారు. అది నీటిలోకి వెళ్లిన ప్రాంతం దగ్గరకు వెళ్లి చూస్తే అప్పటికే కనబడకుండా పోయింది. దాని పాదముద్రల జాడలు కూడా భిన్నంగా ఉండటంతో వాటి ఫొటోలను కూడా తీశారు. ఇంటర్నెట్లో అలాంటి లక్షణాలున్న జంతువుల ఫొటోలతో పోల్చిచూసి, దానిని స్మూత్ కోటెడ్ ఒటొర్గా నిర్ధారించుకున్నారు. ఈ ఫొటోలు, తమ వద్దనున్న సమాచారాన్ని అందజేయడంతో పాటు ఈ అంశంపై లోతైన విశ్లేషణ నిర్వహించాల్సి ఉంటుందని అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మూసీ వెంట సర్వే నిర్వహిస్తే.. అతి అరుదైన జాతి ఉభయచరం హైదరాబాద్ శివార్లలోని హిమాయత్‌సాగర్‌లో కనిపించిందంటే చాలా గొప్ప విషయం. మూసీ నదీ పరీవాహక ప్రాంతమంతా సర్వే నిర్వహిస్తే ఒటోర్కు సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశముంది. – శ్రీకాంత్ భమిడిపాటి, బర్డ్ వాచర్ ఈ జాతిని రక్షించుకోవాలి.. అరుదైన, అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఉభయచరాన్ని ప్రత్యేకమైన ఆ జాతిని రక్షించుకోవాల్సిన అవసరముంది. – గోకుల్ కృష్ణ అద్దంకి, బర్డ్ వాచర్ చార్మినార్‌నే కాదు ఒటొర్నూ చూడాలి హైదరాబాద్ చార్మినార్, ఐటీ, హైటెక్ సిటీ వంటి వాటికే కాదు ప్రకృతి రమణీయతకు, జీవవైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణకు, అరుదైన జంతుజాలానికి కూడా ఆలవాలమై ఉందని తెలిపేందుకు నీటి కుక్క ఉనికిని గుర్తించడం కూడా ఉపయోగపడుతుంది. – శివకుమార్ వర్మ, పర్యావరణ ప్రేమికుడు -
ఐటీలో హైదరాబాద్ దూసుకెళ్తోంది
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని, త్వరలోనే నగరాన్ని స్టార్టప్‌లకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. బెంగళూరు, గురుగ్రామ్‌లతో పోలిస్తే హైదరాబాద్ పర్యావరణహితంగా ఉందని, ఇక్కడ మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. రాజధానికి గత 17 ఏళ్లలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి ఐదు ప్రపంచ దిగ్గజ సంస్థలు వచ్చాయన్నారు. హైదరాబాద్ ఒక్కరోజులో అభివృద్ధి చెందలేదని.. ఈ నగరానికి 450 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. గురువారం హైటెక్ సిటీలో జరిగిన టెక్ మహీంద్రా మిషన్ ఇన్నోవేషన్–2018 కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. టెక్ మహీంద్రా కేంద్ర కార్యాలయాన్ని హైద రాబాద్‌కు తరలించాలని సూచించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీ–హబ్ ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది టీ–హబ్ సెకండ్ ఫేజ్‌ను ప్రారంభించనున్నామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19–21 వరకు 3 రోజుల పాటు హైదరాబాద్‌లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ నిర్వహించబోతున్నామన్నారు. ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్... ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే నగరాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 4 టౌన్‌షిప్‌లు నిర్మిస్తున్నామని వివరించారు. నగరంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నామని, ప్రజల దాహార్తిని తీర్చడానికి 10 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం విషయంలో నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సింగిల్ విండో విధానంలో 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తూ పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. రెండు న్నరేళ్లలో టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 5,500కుపైగా పరిశ్రమలు వెలిశాయన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసు కుపోతోందని, దేశంలోనే అత్యంత ఘనమైన ఆర్థికాభివృద్ధి తెలంగాణలో నమోదైందన్నారు. రోజు వారీ జీవితంలో టెక్నాలజీ కీలకంగా మారిందన్న కేటీఆర్... విద్య, వైద్య రంగాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధ మయ్యే విద్యార్థులకు టీ–శాట్ చానల్స్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్ మూర్తి, నాస్కామ్ ప్రెసిడెంట్ డేబ్జానీ ఘోష్ పాల్గొన్నారు. -
డిజిటల్ ఏపీ
ప్రగతిపథంలో దూసుకెళ్తాం: సీఎం చంద్రబాబు •{పతి ఇంటినీఇంటర్నెట్తో అనుసంధానిస్తాం •జూలై ఆఖరుకు రాష్ట్రవ్యాప్తంగా సమీకృత డిజిటల్ సేవలు •ఫైబర్ గ్రిడ్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విశాఖపట్నం: సమాచార సాంకేతిక రంగాల్లో సృజనాత్మకత, నవకల్పనలతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ మొదటి దశను సీఎం చంద్రబాబు, సిస్కో సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ టి.చాంబర్స్ గురువారం విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ-గవర్నెన్స్, ఈ-లెర్నింగ్, ఈ- మెడిసిన్ కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో దేశంలోనే మొదటి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించనుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సేవలను ఏకీకృత వ్యవస్థ పద్ధతిలో ప్రజలకు అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టు మొదటి దశలో ఏప్రిల్ చివరికి ఉత్తరాంధ్రలోనూ, జులై ఆఖరుకు రాష్ట్రంలో అన్ని ఇళ్లకు ఇంటర్నెట్, సమీకృత డిజిటల్ సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. డిజిటలైజేషన్‌కు రూ.4,700 కోట్లు అవుతుందని మొదట అంచనా వేశామని, కానీ అందుబాటులో ఉన్న విద్యుత్తు స్తంభాలను ఉపయోగించుకొని కేవలం రూ.330 కోట్లతోనే ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. డిజిటల్ ఏపీ కార్యక్రమంలో కంటెంట్ అభివృద్ధికి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సేవలను రూ.149కే అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. దీనికి ప్రత్యేకంగా డిజిటల్ సెటాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేస్తామన్నారు. కార్యక్రమంలో సిస్కో సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ టి.చాంబర్స్, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యన్నారాయణ, సిస్కో ఏసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఇర్విన్ టాన్, సిస్కో ఇండియా ప్రెసిడెంట్ దినేష్ మల్కాని తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ ఏపీ ప్రాజెక్టులో భాగస్వామిగా సిస్కో డిజిటల్ ఏపీ ప్రాజెక్టులో భాగంగా అమెరికాకు చెందిన సిస్కో సిస్టమ్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు ఎంవోయూపై రాష్ట్ర ప్రభుత్వ, సిస్కో ప్రతి నిధులు గురువారం సంతకాలు చేశారు. క్యాడ్బరీతో ‘కోకో’కు ప్రాధాన్యం: సీఎం రాష్ట్రంలో క్యాడ్బరీ ప్లాంట్ ఏర్పాటుతో కోకో పంట సాగుకు ప్రాధాన్యం ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో మాండల్స్ ఇంటర్నేషనల్ (క్యాడ్బరీ) కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘క్యాడ్బరీ’ విస్తరణ, అభివృద్ధి, ఉపాధి అవకాశాలను సంస్థ ప్రతి నిధులు సీఎంకు వివరించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో 134 ఎకరాల్లో రూ. 1,000 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ కర్మాగారం ఆసియా-పసిఫిక్‌లో అతిపెద్ద చాక్లెట్ కర్మాగారం అని వివరించారు. వచ్చే నెల 25న సంస్థ మొదటి దశ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా చంద్రబాబుని ఆ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. సమావేశంలో క్యాడ్బరీ గ్రూప్ కంట్రీ హెడ్ వెంకటేశం చంద్రమౌళి, గవర్నమెంట్ సర్వీసెస్ హెడ్ అమిత్ కుమార్ సింగ్, సీఎంవో ముఖ్యకార్యదర్శి సతీశ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. మలేసియా విధానాలు నాకు ఆదర్శం మలేసియా మంత్రి లీవె షంగ్లైతో చంద్రబాబు మలేసియా ప్రభుత్వం పరిపాలనలో అనుసరించే పారదర్శక విధానాలు తనకెంతో స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు చెప్పారు. మలేసియా రవాణా శాఖ మంత్రి లీవె షంగ్లై తన ప్రతినిధి బృందంతో గురువారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పర్యాటక రంగంలో ఏపీతో కలసి పనిచేయడానికి మలేసియా సిద్ధంగా ఉందని లీవె చెప్పారు. ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, పట్టణాభివృద్ధి, రవాణ రంగాల అభివృద్ధిలో సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బౌద్ధ టూరిజానికి ఏపీ ఒక కేంద్రంగా రూపొందుతుందని, ఒకనాడు బౌద్ధం విలసిల్లిన నేలపై ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని చంద్రబాబు వివరించారు. మలేసియా ప్రతినిధి బృందం లో ఆ దేశ రవాణా శాఖ జనరల్ సెక్రటరీ సరిదుద్దీన్ ఖాసిం తదితరులున్నారు. -
సిర్గాపూర్. ఇన్!
అది మారుమూల గ్రామం.. పైగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం.. అయినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దూసుకెళుతోంది.. ప్రపంచంలో ఎవరైనా తెలుసుకునే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు, జనాభా, తండాలు, ప్రభుత్వ సంస్థలు, రేషన్, పింఛన్, తదితర ప్రభుత్వ పథకాలన్నీ వెబ్సైట్లో పొందుపర్చారు. ఇలా.. అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది కల్హేర్ మండలంలోని సిర్గాపూర్. - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందంజ - పారదర్శకత కోసం వైబ్‌సైట్ రూపకల్పన - ప్రపంచానికి అందుబాటులో గ్రామ సమాచారం - వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టిన సర్పంచ్ మనీష్‌పాటిల్ కల్హేర్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సిర్గాపూర్ గ్రామం ముందంజలో ఉంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ఇండియాకు స్ఫూర్తిగా గ్రామ సర్పంచ్ మనీష్‌పాటిల్ కృషీతో ‘సిరాపూర్.ఇన్’ పేరిట కొత్తగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. సర్పంచ్ మనీష్ఫాటిల్కు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పారదర్శకత కోసం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. వెబ్‌సైట్‌ను కంప్యూటర్లో క్లీక్ చేస్తే గ్రామనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం కలిపించారు. మనీష్‌పాటిల్ ఇప్పటికే గ్రామనికి సంబంధించిన ఫేస్‌బుక్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. సిర్గాపూర్ గ్రామం పేరిట తయారు చేసిన వెబ్సైట్లో వివిధ ఫిర్యాదులను గ్రామ ప్రజల నుంచి స్వీకరించేందుకు అవకాశం కల్పించారు. వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే సర్పంచ్‌కు, గ్రామం పేరిట ఏర్పాటు చేసిన ఈ మెయిల్ ఐడీకి మెసేజ్ చేరుతుంది. వీటి ఆధారంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడాతారు. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే.. సిర్గాపూర్ డాట్ ఇన్ పేరిట అందుబాటులోకి తెచ్చిన వెబ్‌సైట్‌ను సోమవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ప్రాంభించారు. అంతకు ముందు సర్పంచ్ మనీష్‌పాటిల్ వెబ్సైట్ గురించి ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. సర్పంచ్‌ను ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి, తదితరులు అభినందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మంచిపేరు వస్తుందని కోనియడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇతర సర్పంచ్‌లు సిర్గాపూర్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ భాస్కర్‌సేట్, ఎస్ఐ శంకరయ్య, హెచ్ఎం గురునాథ్, ఎంపీటీసీ రాజుకుమార్, కాంగ్రెస్ నాయకులు అంజిరెడ్డి, మహేశ్వర్సేట్, శివకుమార్, సంగమేశ్వర్ పాల్గొన్నారు. -
వీడని చీకట్లు !
- కర్ణాటకలో ఇప్పటికీ అంధకారంలో 1,450 గ్రామాలు - రాష్ర్టంలోని 24 జిల్లాలకే పరిమితమైన విద్యుత్ సౌకర్యం - రూ.15,600 కోట్ల నివేదికకు దక్కని కేంద్రం అనుమతి - 2020 వరకూ ఇదే పరిస్థితి అంటున్న అధికారులు సాక్షి, బెంగళూరు : సమాచార సాంకేతిక రంగంలో రారాజుగా వెలుగొందుతున్న కర్ణాటకలో ఇప్పటికీ వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ అంధకారంలోనే తమ జీవితాలను వెల్లదీస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం దశాబ్ధాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం కన్పించడం లే దని బాధితులు వాపోతున్నారు. రాష్ట్రంలో డిమాం డ్కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. ధర్మల్, జల, సౌర, పవన వంటి వివిధ రూపాల్లో ప్రతి రో జు 5,222 మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. ఇది కాక రోజుకు అదనంగా 850 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తు తం విద్యుత్ సౌకర్యం కలిగిన ప్రాంతాల్లోని వారికే నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతోంది. దీంతో కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దస్త్రాలు చెత్తబుట్టల్లో చేరిపోతున్నాయి. ఈ పరిస్థి తి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. రాష్ట్రం లోని 1,450 గ్రామాల్లోని 40,660 కుటుంబాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉంటున్నాయి. వీటికి తోడు రెవెన్యూ గ్రామాలుగా గుర్తించని తండా లు, గొల్లరహట్టి, హక్కిబుక్కికి చెందిన జనవాసాలు కూడా అంధకారంలో మగ్గిపోతున్నాయి. కరెంటు సౌకర్యం లేని జిల్లాల తీరును పరిశీలిస్తే 490 గ్రామాలతో ఉత్తర కన్నడ జిల్లా ఈ వరుసలో మొదటి స్థానంలో ఉంది. చివరి స్థానంలో ఉన్న కోలారు, శివమొగ్గా జిల్లాల్లో కూడా 53 చొప్పున గ్రామాలు ఉండటం గమనార్హం. మొత్తంగా 30 జిల్లాలు ఉన్న కర్ణాటకలో ఇప్పటికి వందశాతం విద్యుత్ సౌకర్యం లేని జిల్లాలు ఆరు ఉన్నట్లు రాష్ట్ర ఇంధనశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి పథకం కింద రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యంలేని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా రూపొందించిన నివేదికను కేంద్రానికి పంపి దాదాపు ఏడాది కావస్తున్నా అటువైపు నుంచి ఎలాంటి సమాధానం లేదని సాక్షాత్తు రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్ వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పథకానికి రూ.15,600 కోట్లు ఖర్చుకాగలవని ప్రాథమిక అంచనా. మరో ఐదేళ్లవరకూ ఈ పరిస్థితి?... కర్టాటకను వంద శాతం విద్యుత్ సౌకర్యం కలిగిన రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కూడ్లగి (4వేల మెగావాట్లు), కలబుర్గి (1,320 మెగావాట్లు), హాసన్ (660 మెగావాట్లు), ఘటప్రభ (1,320 మెగావాట్లు) ధర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు గ్యాస్ ఆధారిత బెళగావి-దావణగెరె (2,100 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు 2020 ఏడాదికి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. అందువల్ల అప్పుడు రాష్ట్ర డిమాండ్‌కు సరిపడ విద్యుత్‌తోపాటు మిగులు విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. తద్వారా 2020 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి వీలవుతుందని ఇంధనశాఖ అధికారులు చెబుతున్నారు.