- కర్ణాటకలో ఇప్పటికీ అంధకారంలో 1,450 గ్రామాలు
- రాష్ర్టంలోని 24 జిల్లాలకే పరిమితమైన విద్యుత్ సౌకర్యం
- రూ.15,600 కోట్ల నివేదికకు దక్కని కేంద్రం అనుమతి
- 2020 వరకూ ఇదే పరిస్థితి అంటున్న అధికారులు
సాక్షి, బెంగళూరు : సమాచార సాంకేతిక రంగంలో రారాజుగా వెలుగొందుతున్న కర్ణాటకలో ఇప్పటికీ వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ అంధకారంలోనే తమ జీవితాలను వెల్లదీస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం దశాబ్ధాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం కన్పించడం లే దని బాధితులు వాపోతున్నారు. రాష్ట్రంలో డిమాం డ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. ధర్మల్, జల, సౌర, పవన వంటి వివిధ రూపాల్లో ప్రతి రో జు 5,222 మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. ఇది కాక రోజుకు అదనంగా 850 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తు తం విద్యుత్ సౌకర్యం కలిగిన ప్రాంతాల్లోని వారికే నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతోంది. దీంతో కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దస్త్రాలు చెత్తబుట్టల్లో చేరిపోతున్నాయి. ఈ పరిస్థి తి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. రాష్ట్రం లోని 1,450 గ్రామాల్లోని 40,660 కుటుంబాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉంటున్నాయి. వీటికి తోడు రెవెన్యూ గ్రామాలుగా గుర్తించని తండా లు, గొల్లరహట్టి, హక్కిబుక్కికి చెందిన జనవాసాలు కూడా అంధకారంలో మగ్గిపోతున్నాయి. కరెంటు సౌకర్యం లేని జిల్లాల తీరును పరిశీలిస్తే 490 గ్రామాలతో ఉత్తర కన్నడ జిల్లా ఈ వరుసలో మొదటి స్థానంలో ఉంది. చివరి స్థానంలో ఉన్న కోలారు, శివమొగ్గా జిల్లాల్లో కూడా 53 చొప్పున గ్రామాలు ఉండటం గమనార్హం. మొత్తంగా 30 జిల్లాలు ఉన్న కర్ణాటకలో ఇప్పటికి వందశాతం విద్యుత్ సౌకర్యం లేని జిల్లాలు ఆరు ఉన్నట్లు రాష్ట్ర ఇంధనశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి పథకం కింద రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యంలేని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా రూపొందించిన నివేదికను కేంద్రానికి పంపి దాదాపు ఏడాది కావస్తున్నా అటువైపు నుంచి ఎలాంటి సమాధానం లేదని సాక్షాత్తు రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్ వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పథకానికి రూ.15,600 కోట్లు ఖర్చుకాగలవని ప్రాథమిక అంచనా.
మరో ఐదేళ్లవరకూ ఈ పరిస్థితి?...
కర్టాటకను వంద శాతం విద్యుత్ సౌకర్యం కలిగిన రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కూడ్లగి (4వేల మెగావాట్లు), కలబుర్గి (1,320 మెగావాట్లు), హాసన్ (660 మెగావాట్లు), ఘటప్రభ (1,320 మెగావాట్లు) ధర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు గ్యాస్ ఆధారిత బెళగావి-దావణగెరె (2,100 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు 2020 ఏడాదికి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. అందువల్ల అప్పుడు రాష్ట్ర డిమాండ్‌కు సరిపడ విద్యుత్‌తోపాటు మిగులు విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. తద్వారా 2020 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి వీలవుతుందని ఇంధనశాఖ అధికారులు చెబుతున్నారు.
వీడని చీకట్లు !
Published Mon, May 11 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement
Advertisement