Power Facility
-
వాళ్ల ఐకమత్యం మాకు మహాబలం
షాజహాన్‌పూర్: ప్రతిపక్షాల ఐకమత్యం తమకే లాభం చేకూరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే కౌగిలింతతో సరిపుచ్చారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో శనివారం జరిగిన రైతు ర్యాలీలో మోదీ ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విపక్షాల ఐక్యత, అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ వచ్చి హఠాత్తుగా తనని కౌగిలించుకోవడం తదితర విషయాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక విపక్షాలు పార్లమెంట్లో అవిశ్వాసం పేరిట కాలక్షేపం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘దేశంలో ఇప్పుడు ఒక్కటే దళ్(రాజకీయ పార్టీని ఉద్దేశించి) లేదు. ఎన్నో దళ్లు కలవడం వల్ల ఏర్పడే దల్దల్(బురద) ‘కమలం’ వికసించడానికే దోహదపడుతుంది’ అని మోదీ చమత్కరించారు. ‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణమేంటని ప్రశ్నిస్తే వారు బదులివ్వలేదు. కౌగిలింతతో సరిపెట్టారు’ అని రాహుల్‌నుద్దేశించి అన్నారు. ప్రధాని పీఠంపైనే కళ్లన్నీ.. పేదలు, యువతను విస్మరిస్తూ ప్రతిపక్షాలన్నీ ప్రధాని పీఠం కోసం పాకులాడుతున్నాయని మోదీ మండిపడ్డారు. ‘లోక్‌సభలో శుక్రవారం జరిగిన చర్చను చూశారా? తప్పెవరిదో తెలిసిందా? ప్రతిపక్షాలు దేశం, పేదల గురించి ఆలోచించడం లేదు. ప్రధాని కుర్చీపైనే వాళ్ల కళ్లన్నీ ఉన్నాయి. అవినీతితో పోరాడుతూ దేశం, ప్రజల కోసం పనిచేయడమేనా నా నేరం? ప్రతిపక్షాల కుతంత్రాలు నాకు తెలుసు. సైకిలు(సమాజ్‌వాదీ పార్టీ), ఏనుగు(బీఎస్పీ)తో జతకట్టినా వారిని గెలవనీయం. భారత ప్రజాస్వామ్యంలో 125 కోట్ల మంది ఓటు ద్వారా ఇచ్చిన తీర్పే శిరోధార్యమని, దానికి వ్యతిరేకంగా వెళ్తే మూల్యం చెల్లించుకోక తప్పదని వారిని హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ వారు నన్ను పదవి నుంచి తొలగించాలని ఆరాటపడుతున్నారు’ అని మోదీ మండిపడ్డారు. నాటి ప్రధాని రాజీవ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..ఆనాడు రూపాయి ప్రయోజనంలో పేదలకు కేవలం 15 పైసలే చేరాయని అన్నారు. కానీ తమ ప్రభుత్వం సాంకేతికత సాయంతో పూర్తి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే వేస్తోందని చెప్పారు. ఆ చీకట్లకు బాధ్యులెవరు.? ఎన్డీయే నాలుగేళ్ల పాలనకాలంలోని సంక్షేమ కార్యక్రమాలను పేర్కొంటూ..తాము 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినా, కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా కొన్ని గ్రామాలు చీకట్లోనే ఉన్నాయంటే దానికి కారణమెవరని ప్రశ్నించారు. రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయలేదన్న మోదీ..సాగును లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు. ఈ డిసెంబర్ నుంచి మొలాసిస్, చెరకు రసం నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు మిల్లులకు అనుమతి ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. చెరకు కనీస ధరను క్వింటాలుకు రూ.20 పెంచామని తెలిపారు. -
విద్యుదీకరణలో యూపీఏ విఫలం
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం వల్లే దేశంలో సంపూర్ణ విద్యుదీకరణ లక్ష్యాలు ఆలస్యమయ్యాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఇప్పటి వరకు విద్యుత్‌కు దూరంగా ఉన్న 2.67 కోట్ల కుటుంబాలకు కూడా ఈ ఏడాది చివరి నాటికి ఆ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 4 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకం లబ్ధిదారులతో మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. ఇటీవల చిట్టచివరగా విద్యుదీకరణ జరిగిన మణిపూర్‌లోని లీసాంగ్ గ్రామస్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ పథకాల లబ్ధిదారులతో మోదీ నిర్వహిస్తున్న వరస సమావేశాల్లో ఇది పదోది. 2009 నాటికే దేశంలోని అన్ని గృహాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢాంబికాలకు పోయారని మోదీ ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించి 2005లో ఆమె విడుదల చేసిన ఓ ప్రకటనను చదివి వినిపించారు. ఎప్పుడో పూర్తవ్వాల్సింది.. తాము అధికారంలోకి వచ్చే సరికి దేశంలో విద్యుత్ లేని గ్రామాలు 18 వేలు ఉన్నాయని మోదీ వెల్లడించారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘ప్రజలకు మంచి చేయాలనుకునే వారు గ్రామాలకు వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలి. నివేదికలు తయారుచేయాలి. పౌర సమాజాలతో మాట్లాడాలి. అలా చేస్తే 2010–11 నాటికే సంపూర్ణ విద్యుదీకరణ జరిగేది. కానీ అప్పుడు చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు లేకపోవడం వల్ల ఆ వాగ్దానాలు అలాగే మిగిలిపోయాయి. మేము ఇచ్చిన వాగ్దానాలపై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, తప్పు లు వెతకడానికి విపక్షాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. వాళ్లకు వెలుగుంటేనే ఉపాధి.. విద్యుత్ సౌకర్యం లేని ఇళ్ల గురించే ప్రతిపక్షాలు మాట్లాడటం తమను విమర్శించడం కాదని, వారిని వారే విమర్శించుకోవడమని మోదీ అన్నారు. ‘70 ఏళ్లు దేశాన్ని నడిపిన వారిదే ఈ వైఫల్యం. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. 4 కోట్ల కుటుంబాలకు వి ద్యుత్ సౌకర్యం లేదంటే.. దాని అర్థం గతంలో వారికి ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను మా ప్రభుత్వం తొలగించిందని కాదు. సున్నా నుంచి మొదలుపెట్టి విద్యుదీకరణకు మౌలిక వసతులు సమకూరుస్తున్నాం. రోజులో మొత్తం సమయా న్ని 12 గంటలకు కుదిస్తే అన్ని పనులు పూర్తవుతాయా? మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న లక్షలాది ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యే వారికి ఉపాధి దొరుకుతోంది. పగటిపూ ట వెలుగును ఆధారంగా చేసుకునే వారి పని గంటలను నిర్ణయిస్తున్నారు’ అని అన్నారు. -
గ్రామాలను చీకట్లో ఉంచింది మీరు కాదా?
సింద్రి: ధనికుల కోసమే ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చీకట్లలో మగ్గుతున్న 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, వాటిలో ధనిక ప్రజలు నివసిస్తున్నారా? అని ఘాటుగా ప్రశ్నించారు. జార్ఖండ్‌లోని సింద్రిలో శుక్రవారం ఐదు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాక మోదీ ప్రసంగించారు. ఓటుబ్యాంకు రాజకీయాల్లో పీకలదాకా మునిగిపోయిన నామ్‌దార్(వంశపారంపర్య) పార్టీకి సాధారణ కార్మికుల బాధలు పట్టడంలేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. విద్యుత్ సౌకర్యంలేని సుమారు 4 కోట్ల కుటుంబాల (ఒక్క జార్ఖండ్‌లోనే 25 లక్షలు)కు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
వీడని చీకట్లు !
- కర్ణాటకలో ఇప్పటికీ అంధకారంలో 1,450 గ్రామాలు - రాష్ర్టంలోని 24 జిల్లాలకే పరిమితమైన విద్యుత్ సౌకర్యం - రూ.15,600 కోట్ల నివేదికకు దక్కని కేంద్రం అనుమతి - 2020 వరకూ ఇదే పరిస్థితి అంటున్న అధికారులు సాక్షి, బెంగళూరు : సమాచార సాంకేతిక రంగంలో రారాజుగా వెలుగొందుతున్న కర్ణాటకలో ఇప్పటికీ వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ అంధకారంలోనే తమ జీవితాలను వెల్లదీస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం దశాబ్ధాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం కన్పించడం లే దని బాధితులు వాపోతున్నారు. రాష్ట్రంలో డిమాం డ్కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. ధర్మల్, జల, సౌర, పవన వంటి వివిధ రూపాల్లో ప్రతి రో జు 5,222 మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. ఇది కాక రోజుకు అదనంగా 850 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తు తం విద్యుత్ సౌకర్యం కలిగిన ప్రాంతాల్లోని వారికే నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతోంది. దీంతో కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దస్త్రాలు చెత్తబుట్టల్లో చేరిపోతున్నాయి. ఈ పరిస్థి తి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. రాష్ట్రం లోని 1,450 గ్రామాల్లోని 40,660 కుటుంబాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉంటున్నాయి. వీటికి తోడు రెవెన్యూ గ్రామాలుగా గుర్తించని తండా లు, గొల్లరహట్టి, హక్కిబుక్కికి చెందిన జనవాసాలు కూడా అంధకారంలో మగ్గిపోతున్నాయి. కరెంటు సౌకర్యం లేని జిల్లాల తీరును పరిశీలిస్తే 490 గ్రామాలతో ఉత్తర కన్నడ జిల్లా ఈ వరుసలో మొదటి స్థానంలో ఉంది. చివరి స్థానంలో ఉన్న కోలారు, శివమొగ్గా జిల్లాల్లో కూడా 53 చొప్పున గ్రామాలు ఉండటం గమనార్హం. మొత్తంగా 30 జిల్లాలు ఉన్న కర్ణాటకలో ఇప్పటికి వందశాతం విద్యుత్ సౌకర్యం లేని జిల్లాలు ఆరు ఉన్నట్లు రాష్ట్ర ఇంధనశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి పథకం కింద రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యంలేని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా రూపొందించిన నివేదికను కేంద్రానికి పంపి దాదాపు ఏడాది కావస్తున్నా అటువైపు నుంచి ఎలాంటి సమాధానం లేదని సాక్షాత్తు రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్ వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పథకానికి రూ.15,600 కోట్లు ఖర్చుకాగలవని ప్రాథమిక అంచనా. మరో ఐదేళ్లవరకూ ఈ పరిస్థితి?... కర్టాటకను వంద శాతం విద్యుత్ సౌకర్యం కలిగిన రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కూడ్లగి (4వేల మెగావాట్లు), కలబుర్గి (1,320 మెగావాట్లు), హాసన్ (660 మెగావాట్లు), ఘటప్రభ (1,320 మెగావాట్లు) ధర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు గ్యాస్ ఆధారిత బెళగావి-దావణగెరె (2,100 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు 2020 ఏడాదికి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. అందువల్ల అప్పుడు రాష్ట్ర డిమాండ్‌కు సరిపడ విద్యుత్‌తోపాటు మిగులు విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. తద్వారా 2020 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి వీలవుతుందని ఇంధనశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆశలపై నీళ్లు
ఇందిర జలప్రభకు గ్రహణం * నిధులున్నా ముందుకు సాగని పనులు * జిల్లాలో సాగు లక్ష్యం 85 వేల ఎకరాలు * మూడేళ్లయినా 2,500 ఎకరాలకే మోక్షం * విద్యుత్ కనెక్షన్లకు రాని అనుమతులు * రైతుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం సాక్షి, ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభ పథకం జిల్లాలో అడుగు ముందుకు కదలడం లేదు. పథకం ప్రారంభించి మూడేళ్లయినా ఇప్పటివరకు కేవలం 2500 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చినట్లు సంబంధిత అధికారులు కాగితాల్లో చూపుతున్నారు. జిల్లాలో 85 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తేవాలన్నది ఈ పథకం లక్ష్యం. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వేలాది ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం ‘ఇందిర జలప్రభ’ ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టు అమలుకు మొత్తం రూ.196.5 కోట్లుమంజూరు చేసింది. ఇందులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్) కింద రూ.124 కోట్లు, నాబార్డు ద్వారా రూ.72 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఎస్సీ, ఎస్టీలకు చెందిన 85 వేల ఎకరాలు గుర్తించారు. ఒక్కో బ్లాకులో 10 నుంచి 200 ఎకరాల వరకు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ యోచన. ఎకరానికి రూ.16 వేల చొప్పున పది ఎకరాలకు రూ.1.60 లక్షలు ఖర్చు చేస్తారు. ప్రధానంగా సాగును దృష్టిలో పెట్టుకొని పది ఎకరాలకు సరిపడా నీరందేలా బోరు వేయిస్తారు. విద్యుత్ సౌకర్యం, మోటార్ పంపు, పైపులు అన్నీ ఉచితంగానే రైతులకు అందజేయాలి. విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేని భూములకు డీజిల్ ఇంజన్లు సరఫరా చేయాలి. అవసరమైన భూముల్లో జలవనరులను అభివృద్ధి చేసేందుకు చెక్ డ్యామ్‌లు, రాక్ పిల్ డ్యామ్‌లు, చెక్ వాల్స్ నిర్మించాలి. ఈ ప్రాజెక్టు అమలుతో జిల్లాలో 30,500 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రయోజనం కలగాలి. ఎక్కువగా ఏజెన్సీ మండలాల్లోని రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. అంచనాలు తారుమారు.. ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 2,879 బ్లాకులను గుర్తించారు. ఇందులో 1,770 బ్లాకులు సర్వే చేయ గా బోర్లు వేయడానికి 778 బ్లాకులు అనుకూలమని గుర్తించారు. సర్వే చేసిన బ్లాకులకు సంబంధించి ఇప్పటివరకు జిల్లాకు 1,846 బోర్లు మంజూరయ్యా యి. ఎంపిక చేసిన బ్లాకుల్లో 1,078 బోర్లు డ్రిల్ చేస్తే 78 ఫెయిలయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, జియాలజిస్టులు సరిగా అంచనా వేయకపోవడంతో ఈ బోర్లు ఫెయిల్ అయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. వీటి కోసం సుమారు రూ. 50 లక్షలు వృథా అయ్యాయి. మిగిలిన బోర్లలోనూ నీరు అంతంత మాత్రమే. మరికొన్ని బోర్లలో నీరున్నా నేటికీ విద్యు త్ సౌకర్యం కల్పించలేదు. భూగర్భ, జలవనరుల శాఖ అధికారులు సర్వే చేయించి ఎక్కడ భూగర్భ జలం ఉందో అక్కడే బోర్లు వేయించాలి. కానీ అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేయించడంతో బోర్లు ఫెయిలయ్యాయి. దీంతో తమ భూముల్లో సిరులు పండిస్తామని భావించిన ఎస్సీ, ఎస్టీ రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సా...గుతున్న పనులు.. జిల్లాకు రూ.196.5 కోట్లు మంజూరైతే ఈ మూడేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.10.94 కోట్లే. 920 బోర్లకు విద్యుత్ సౌకర్యం అవసరం కాగా ఇప్పటి వరకు 743 బోర్లకు మాత్రమే అనుమతి వచ్చింది. ఇంకా 177 బోర్లకు విద్యుత్ అనుమతి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే అనుమతి వచ్చిన చోటా మోటర్లను బిగించడం, పైపులై ను, విద్యుత్ స్తంభాల పనులు నత్తనడకన సాగుతుండడంతో రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ సహకారంతో భూములు సాగు చేసుకుందామనుకున్న రైతుల కలలు కల్లలయ్యాయి. ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మోడల్ బ్లాక్‌లోనూ కనిపించని సాగు.. 2011 నవంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చండ్రుగొండ మండలం కొండాయిగూడెంలో జలప్రభ పథకానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని 91 ఎకరాలను బ్లాకుగా తీసుకున్నారు. ఇందులో తొలుత 50 ఎకరాలకు సంబంధించి 4 బోర్లు వేశారు. ఆశించినంత నీరు లేకున్నా అక్కడ జిల్లా యంత్రాంగం సీఎంతో హడావిడిగా శంకుస్థాపన చేయించింది. ఈ బ్లాకులో 20 ఎకరాల వరకు అప్పట్లో మామిడి, ఆరటి, మిర్చి, జామాయిల్ సాగు చేశారు. బోర్లలో నీరు, విద్యుత్ సరఫరా, బ్లాక్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో సాగుచేసిన పంటల న్నీ నెలరోజులకే ఎండిపోయాయి. ప్రస్తుతం నాలుగు బోర్లకు గాను మూడింటిలో నీరు లేదు. మిగిలిన ఒక్కదాంట్లోనూ బొటాబొటిగానే ఉన్నా యి. ఈ పరిస్థితితో మోడల్ బ్లాక్‌గా తీసుకున్న ఈ భూమి కూడా బీడుగానే మిగిలింది. -
నేనున్నానని..
టీఆర్ఆర్ : బాబు నీ పేరేంటి.. ఏం చేస్తున్నవ్? అంజిలయ్య : నేను పది వరకు చదువుకున్నా. పైచదువుకు స్థోమత లేదు. మా కాలనీలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. మంచినీళ్లు రావు. సాయంత్రమైతే పెద్దపెద్ద దోమలు.. పన్నెండేళ్లుగా ఇక్కడ నరకం అనుభవిస్తున్నాం. కాలనీలో దాదాపు రెండొందల గుడిసెలు, ఇళ్లు ఉన్నాయి. మా కష్టాలు తీర్చాలి సార్.. టీఆర్ఆర్ : అదేంటి..! ఇప్పటివరకు కరెంటు సౌకర్యం లేదా.. తాగునీళ్లు రావట్లేదా? బహద్దుర్ : అవును సార్. ఈ కాలనీలో పన్నెండేళ్లుగా ఉంటున్నా. అత్తరు వ్యాపారం చేసుకుని బతుకుతున్నా. మా కాలనీలో కరెంటు, తాగునీరు అనేది లేదు. సాయంత్రమైతే మా బతుకులు చీకట్లోనే. నాలుగు కిలోమీటర్లు నడిచెళ్లి పొలాలకాడనో.. పరిగిలనో నీళ్లు తెచ్చుకుంటం. టీఆర్ఆర్ : కరెంటు, తాగునీరు కావాలని ఇన్నాళ్లూ అధికారులను, ప్రజాప్రతినిధులను అడగలేదా? లక్ష్మి : చాలాసార్లు అడిగినం సార్.. ఇంతకుముందున్న ఎమ్మెల్యేను వందలసార్లు అడిగినం. ఎంపీడీఓ, తహసీల్ అధికార్ల కాడిని వెళ్లి అడిగినా మా గోడు పట్టించుకోలేదు. టీఆర్ఆర్ : ఏంపని చేస్తవమ్మా..? లక్ష్మి : కూలీపని సార్. ఏడాది కాలం నుంచి మాకు పని దొరుకుతలేదు. పూట గడవడమే కష్టమైతాంది.. టీఆర్ఆర్ : ఉపాధి హామీ పనికి పోవట్లేదా..? లక్ష్మి : ఏమో సార్.. ఉపాధి పని మాకు తెలియదు. చిత్తుకాగితాలు ఏరుకుని పరిగిలో అమ్ముకుంటం. లేకుంటే కూలీపనికి పోతం. ఈ పనులు తప్ప వేరే పని తెల్వదు. టీఆర్ఆర్ : నీ పేరేంటి? ఎం పని చేస్తున్నావ్?. నసీరుద్దీన్ : నాకు 35 ఏళ్లు సార్.. టీటీసీ చేసిన. పెళ్ళైంది.. ముగ్గురు పిల్లలు. డీఎస్సీ కోసం చూస్తున్నా. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామని కేసీఆర్ చెప్పిండు. కనీసం 8శాతం అమలు చేసినా బాగుంటంది. టీఆర్ఆర్ : మీ కాలనీలో చాలా సమస్యలున్నట్టున్నాయ్? నసీరుద్దీన్ : కాలనీలో కేవలం గుడిసెలు, మనుషులం మాత్రమే ఉన్నాం సర్. కానీ మా వాళ్లకు ఎలాంటి హక్కులు లేవు. కరెంటు లేదు.. నల్లాలు లేవు.. స్కూల్ లేదు.. అంగన్వాడీ కేంద్రం లేదు.. ఆస్పత్రి లేదు.. రేషన్ కార్డులు లేదు.. ఆధార్ కార్డులు లేదు. నియోజకవర్గ కేంద్రానికి దగ్గరా ఉంటున్నా.. ఏదో అడవిలో ఉన్నట్టుంటది. టీఆర్ఆర్ : మీ కాలనీలో పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నా. చాలా భయంగా ఉంది. ఈ సమస్యలపై ఇన్ని రోజులుగా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? నసీరుద్దీన్ : మా బాధలెవరూ పట్టించుకుంటారు సార్.. అధికారుల్ని అడిగీఅడిగి బేజారొచ్చింది. మా సమస్యలన్నీ పరిష్కరించాలి.. ఇక్కడ బడి, ఆంగన్వాడీ కేంద్రం, రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి. టీఆర్ఆర్ : ఏమమ్మా.. ఎలా ఉన్నవ్? పద్మ : నాకు నలుగురు కొడుకులు, ఒక కూతురు సార్. ఇక్కడ బడిలేదు. అందుకే పిల్లల్ని చదవించలేదు. అందరం చిత్తుకాగితాలే ఏరుకుని బతుకుతం. పని లేనప్పుడు పస్తులుంటం. మా బతుకులు ఎప్పుడు బాగుపడతయో ఆ భగవంతుడికే తెలవాలె. టీఆర్ఆర్ : అమ్మా.. సొంత ఇళ్లు ఉందా? బోనమ్మ : లేదుసార్.. వేరేవాళ్ల జాగాలో గుడిసె వేసుకున్నం. వాళ్లు ఖాళీ చేయమంటే రోడ్డు మీద బతకాలె. టీఆర్ఆర్ : నమస్తే పెద్దాయన.. ఏం పని చేస్తున్నవ్? అబ్డుల్ రషీద్ : చిన్న హోటల్ పెట్టుకున్నా. సాయంత్రమైతే నరకంలోకి వెళ్లినట్టే. పాములు, తేళ్లు తిరుగుతయ్. రోడ్లు లేవు, కరెంటు, నల్లాలు లేవు. వారంలో కనీసం ఒకట్రెండు పాముల్నయినా సంపుతం. క్షణం క్షణం భయం భయంగా బతుకీడుస్తున్నాం. టీఆర్ఆర్ : నమస్తే భాయ్ సాబ్.. ఎక్కడికో వెళ్లొస్తున్నరు? రషీద్ : నమస్తే సారు.. నేను శనగబఠానీలు అమ్ముకుంటా. రోజూ పరిగి వెళ్లొస్తా. పరిగి పోవాలంటే నాలుగు కిలోమీటర్లు సైకిల్‌పైన పోవాలె. అలా చుట్టూ తిరగకుండా నేరుగా పరిగి వెళ్లే మార్గం ఉంది. అయితే కాలువ దాటాలె. బ్రిడ్జి కట్టిస్తే అరకిలోమీటర్ దూరంతో పరిగి పోవొచ్చు. ఎట్ల అయిన బ్రిడ్జి కట్టియ్యాలె సార్.. టీఆర్ఆర్ : ఏం పెద్దమ్మ.. పింఛన్ వస్తుందా? సక్కుబాయ్ : వస్తలేదు సార్.. సర్వేలో పేరు కూడా రాయించిన. రేషన్ కార్డు కూడా లేదు. జర ఆదుకోండి.. టీఆర్ఆర్ : అమ్మా.. ఏం పని చేస్తున్నావ్? పద్మ : సార్ నాకు ముగ్గురు పిల్లలు. లివర్ పాడై భర్త చనిపోయాడు. పదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. సౌకర్యాలు లేని ఈ కాలనీలో బతకడమే కష్టంగా ఉంది. ఇక్కడ ప్లాట్ ఉంది. దరఖాస్తు చేసుకున్న కానీ ఇందిరమ్మ ఇళ్లు రాలేదు. టీఆర్ఆర్ : వితంతు పింఛన్ వస్తుందా? పద్మ : లేదు సార్. దరఖాస్తు చేసుకున్నా రాలేదు. కూలీ పని చేసుకుని పిల్లల్ని పోషిస్తున్నా. -
గిరిజన గ్రామాలకు సౌర విద్యుత్
బల్బులు అందింజేతకు టెరీ ఓకే హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ సౌకర్యంలేని మారుమూల గిరిజన గ్రామాలకు సోలార్ విద్యుత్ ల్యాంపులను అందించేందుకు టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(టెరీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ బల్బులు అందించేందుకు ఏమాత్రం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ సంస్థల నిధులతో సోలార్ విద్యుత్ ల్యాంపులను అందిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు సూచనల మేరకు శుక్రవారం టెరీ సంచాలకులు ఆర్కే పచౌరీతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు భేటీ అయ్యారు. పర్యావరణహితంగా ఏపీ నూతన రాజధానిని ఎలా తీర్చిదిద్దాలన్న అంశంలో ప్రభుత్వానికి ఉత్తమ పద్ధతులు, సహాయ సహకారాలు అందించేందుకు టెరీ ముందుకొచ్చింది. -
ఎబోలాపై అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి
జాతీయం రక్షణ, రైల్వేల్లో విదే శీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి రక్షణ రంగంలో 49 శాతం, రైల్వేల్లో కొన్ని విభాగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 6న అంగీకరించింది. రక్షణ రంగంలో ప్రస్తుతం 26 శాతం వరకు అనుమతి ఉంది. రైల్వేల్లో హైస్పీడ్ రైళ్ల వ్యవస్థ, సబర్బన్ కారిడార్లు, సరకు రవాణా లైన్ల వంటి విభాగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించింది. బాల నేరస్థుల విచారణపై జువెనైల్ జస్టిస్ బోర్డుకు అధికారం తీవ్రమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 16-18 ఏళ్ల మధ్య ఉన్న వారిని సంస్కరణ గృహానికి పంపాలా లేదా సాధారణ కోర్టులో విచారించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం జువెనైల్ జస్టిస్ బోర్డుకు అప్పగిస్తూ కేంద్ర కేబినెట్ ఆగస్టు 6న నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బాలనేరస్థుల చట్టం ప్రకారం మైనర్లు ఎంత తీవ్ర నేరాలకు పాల్పడినా వారిపై కోర్టులో విచారణ జరపడానికి వీలులేదు. వారికి గరిష్ట శిక్షగా మూడేళ్ల నిర్బంధం మాత్రమే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి మరణశిక్ష విధించడానికి వీలులేదు. ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార కేసులో మైనర్ కూడా నిందితుడుగా ఉన్న సంఘటనతో బాల నేరస్థుల చట్టాన్ని సవరించాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. దేశంలో విద్యుత్ సౌకర్యం లేనివారు 40 కోట్ల మంది దేశంలో మూడింట ఒక వంతు మందికి విద్యుత్ సౌకర్యం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 7న లోక్‌సభకు తెలిపారు.ప్రస్తుతం ఎనిమిది కోట్ల గృహాలకు విద్యుత్ సౌకర్యం లేదు. అంటే 40 కోట్ల మందికి విద్యుత్ అందుబాటులో లేదని ప్రకటించారు. దేశంలో విద్యుత్ లేని గ్రామాల సంఖ్య 12,468. వీటిలో అత్యధికంగా బీహార్‌లో 6,882 గ్రామాలున్నాయని మంత్రి వివరించారు. మిజోరం గవర్నర్ బేనీవాల్ తొలగింపు మిజోరం గవర్నర్ కమలా బేనీవాల్‌ను తొలగిస్తూ ఆగస్టు 6న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కమలా బేనీవాల్ ఆ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించారు. కాగా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ గోవా గవర్నర్‌గా ఆగస్ట్ 7న అదనపు బాధ్యతలు స్వీకరించారు. క్రీడలు ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక బృందానికి స్వర్ణ పతకం పోలెండ్ దేశం వ్రోక్లా నగరంలో జరుగుతున్న ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక కుమారి నేతృత్వంలోని మహిళల రికర్వ్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆగస్టు 10న జరిగిన ఫైనల్లో దీపికా కుమారి, బొంబేలా దేవీ, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు మెక్సికో జట్టుపై విజయం సాధించింది. కాగా జయంత తాలుక్దార్ సారథ్యంలోని భారత పురుషుల జట్టు రజతం సాధించింది. రద్వాన్ స్కా కు డబ్ల్యూటీఏ రోజర్స్ కప్ టైటిల్ డబ్ల్యూటీఏ రోజర్స్ కప్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రద్వాన్ స్కా (పోలెండ్) గెలుచుకుంది. టొరంటోలో ఆగస్టు 11న జరిగిన ఫైనల్లో వీనస్ విలియమ్స్ (అమెరికా)ను రద్వాన్ స్కా ఓడించింది. సోంగాకు ఏటీపీ రోజర్స్ కప్ టైటిల్ ఏటీపీ రోజర్స్ కప్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను జోవిల్ ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) కైవసం చేసుకున్నాడు. ఆగస్టు 11న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) ను సోంగా ఓడించాడు. లెడెకి మరో ప్రపంచ రికార్డు అమెరికా స్వివ్ముర్ కేటీ లెడెకి మరో సంచనలం సృష్టించింది. యుూఎస్ స్విమ్మింగ్ జాతీయ చాంపియున్‌షిప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన వుహిళల 400 మీటర్ల ఫ్రీస్టరుుల్ రేసును 17 ఏళ్ల ఈ అమ్మాయి 3ని.58.86 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఇటలీ స్వివ్ముర్ ఫెడ్రికా పెల్లెగ్రిని (3:59.15 సెకన్లు) పేరిట ఉండేది. హైటెక్ బాడీ సూట్‌ను నిషేధించిన తర్వాత పెల్లెగ్రిని ఈ రికార్డు నెలకొల్పింది. ఇదే టోర్నీలో 800 మీటర్లు. 1500 మీటర్ల ఫ్రీస్టరుుల్లోనూ కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించిన లెడెకి... జానెట్ ఇవాన్స్ (1998 నుంచి 2006 మధ్యలో) తర్వాత ఏకకాలంలో వుూడు విభాగాల్లో ప్రపంచ రికార్డులు నమోదు చేసుకున్న స్విమ్మర్‌గా గుర్తింపు పొందింది. ఎకానమీ అత్యంత విలువైన భారత బ్రాండ్ టాటా దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూపు నిలిచింది. రూ. 1,26,000 కోట్లతో టాప్ 100 భారత బ్రాండ్లలో అగ్రస్థానం సొంతం చేసుకొంది. రెండు, మూడు స్థానాల్లో ఎల్ఐసీ, ఎస్బీఐ నిలిచాయి. ఈ వివరాలను కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా తన వార్షిక సర్వేలో వెల్లడించింది. వంద కంపెనీల మొత్తం బ్రాండ్ విలువ 92.6 బిలియన్ డాలర్లు కాగా అందులో అయిదో వంతు టాటా గ్రూపుదే కావడం విశేషం. అత్యంత ధనికుల దేశాల్లో భారత్‌కు ఎనిమిదో స్థానం అత్యంత ధనవంతులున్న దేశాల్లో ప్రపంచంలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉందని న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో 14,800 మంది కుబేరులున్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం అమెరికా, చైనా, జర్మనీ దేశాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 2,700 మంది కుబేరులతో అత్యధిక ధనవంతులున్న తొలి 25 నగరాల్లో ముంబయికి చోటు దక్కింది. 15,400 మంది ధనవంతులతో హాంకాంగ్ అగ్రస్థానంలో నిలిచింది. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు ఆగస్టు 5న ప్రకటించిన పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రాధాన్యతినిస్తూ రెపోరేటును 8 శాతం, రివర్స్ రెపోరేటు 7 శాతం , సీఆర్ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో- నగదు నిల్వల నిష్పత్తి) ని 4 శాతం వద్దనే ఉంచింది. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) ని అరశాతం తగ్గించింది. దీంతో ఇది 22.5 శాతం నుంచి 22 శాతానికి చేరింది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 40 వేల కోట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును 5.5 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతానికి, 2016 నాటికి 6 శాతానికి పరిమితం చేయడం లక్ష్యంగా పేర్కొంది. సదస్సులు తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల సదస్సు తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల నాలుగో సదస్సు మయన్మార్‌లోని నేపితాలో ఆగస్టు 10న జరిగింది. సదస్సులో పాల్గొన్న భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ దక్షిణ చైనా సముద్రంలో చైనా బలప్రయోగాన్ని వ్యతిరేకించారు. ఈ విషయంలో బ్రూనై, మలేిషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్లతో చైనా పోరాడుతోంది. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం నుంచి అనుమతి పొంది భారత్ జరుపుతున్న చమురు తవ్వకాలపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులపై బేసిక్ దేశాల మంత్రుల సమావేశం బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, భారత్, చైనా (బేసిక్) దేశాల మంత్రుల స్థాయి సమావేశం న్యూఢిల్లీలో ఆగస్టు 7,8 తేదీల్లో జరిగింది. వాతావరణ మార్పులు, ఐక్యరాజ్యసమితి కార్యాచరణ అంగీకారానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సైన్స అండ్ టెక్నాలజీ తోకచుక్కను చేరిన తొలి అంతరిక్ష నౌక తోకచుక్కను చేరిన తొలి అంతరిక్ష వాహక నౌకగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రొసెట్టా అరుదైన ఘనతను సాధించనుంది. (చర్యుమోవ్- జిరాసిమెంకో) అనే పేరుగల తోక చుక్కను ఈ నౌక 10 సంవత్సరాల 5 నెలల 4 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చేరువైంది. ప్రస్తుతం ఇది తోకచుక్క ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తుంది. ఈ ఏడాది నవంబర్ నాటికి దానిపై ల్యాండ్ కానుంది. ఈ తోకచుక్కను 1969లో కనుగొన్నారు. గ్లోబల్ వార్మింగ్‌కు మానవ చర్యలే ప్రధాన కారణం: ఐపీసీసీ గ్లోబల్ వార్మింగ్ (భూతాపం)కు మానవులే ప్రధాన కారణమని ఐక్యరాజ్య సమితికి చెందిన వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ ) ఆగస్టు 6న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వాతావరణ మార్పులు మనుషుల ఆరోగ్యం, దక్షిణ ఆసియాలోని ఆవాసాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. 1950 నుంచి ఆసియాలో చల్లగా ఉండే రాత్రీపగలు రోజుల సంఖ్య తగ్గి, వేడితో కూడిన రాత్రీపగలు రోజుల సంఖ్య పెరిగాయని తెలిపింది. అంతర్జాతీయం 2020 నాటికి బీజింగ్‌లో బొగ్గు వినియోగం నిషేధం చైనా రాజధాని బీజింగ్‌లో 2020 నాటికి బొగ్గు వినియోగాన్ని నిషేధించాలని బీజింగ్ మున్సిపల్ పర్యావరణ పరిరక్షణ బ్యూరో ఆగస్ట్ 4న నిర్ణయించింది. బీజింగ్‌తోపాటు మరో ఐదు జిల్లాల్లో బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిషేధించే ప్రణాళికకు రూపకల్పన చేసింది. చైనాలోని ప్రధాన పట్టణాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. సూయజ్ కాలువ జలమార్గ నిర్మాణ పనులు ప్రారంభం 145 ఏళ్ల చరిత్ర గల సూయజ్ కాలువ జలమార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులను ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత అల్-సిసి ఆగస్టు 6న ప్రారంభించారు. దీంతో ఐరోపా, ఆసియా ఖండాల మధ్య వర్తకం మరింత విస్తరించనుంది. సూయజ్ కాలువను తొలిసారిగా 1869లో ప్రారంభించారు. ఇది ఈజిప్ట్‌లోని మెడిటేరేనియన్, ఎర్ర సముద్రాలను కలిపే కృత్రిమ జలమార్గం. దీనివల్ల వర్తకుల నౌకలు, ఓడలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టిరాకుండా నేరుగా ఐరోపాను చేరుకోవచ్చు. ఎబోలాపై అంతర్జాతీయ వైద్య ఎమర్జెన్సీ పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తున్న ఎబోలా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగస్టు 8న అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్ ప్రభావిత దేశాలకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ కోరారు. గత నాలుగు దశాబ్దాల్లో తీవ్రమైన, సంక్లిష్టమైన మహమ్మారి ఇదేనని పేర్కొన్నారు. 2009లో స్వైన్‌ఫ్లూ వ్యాపించిన సమయంలోనూ, గత మేలో పోలియో విషయంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎబోలా వ్యాప్తి గినియాలో గత మార్చిలో ఆరంభమైంది. అక్కడినుంచి సియోర్రాలియోన్, లైబీరియా, నైజీరియాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. వార్తల్లో వ్యక్తులు అర్జున అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా కపిల్‌దేవ్ భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ నిఖంజీ అర్జున అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్‌గా ఆగస్టు 7న ఎంపికయ్యారు. 2014లో దేశంలో అన్ని క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపికచేసి,అవార్డులను ప్రకటించేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. ఎడ్వెర్డ్ స్నోడెన్‌కు రష్యా మూడేళ్ల ఆశ్రయం అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ నిర్వాహకుడు ఎడ్వర్డ్ స్నోడెన్‌కు మూడేళ్లపాటు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలని రష్యా ఆగస్టు 7న నిర్ణయించింది. స్నోడెన్‌కు 2013లో ఏడాది పాటు ఆశ్రయం ఇచ్చింది. దాని కాలపరిమితి ఈ ఏడాది ఆగస్టు 1నాటికి ముగియడంతో, మరో మూడేళ్ల పాటు పొడిగించింది. ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తూ 2013లో జాతీయ భద్రత రహస్యాలను బట్టబయలు చేసినందుకు స్నోడెన్‌పై అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించింది. వీటి నుంచి తప్పించుకునేందుకు అతడు హాంకాంగ్ పారిపోయాడు. అక్కడి నుంచి మాస్కోకు చేరుకున్నాడు. అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ సస్పెన్షన్ అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ వీరేందర్ మాలిక్‌ను ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 4న సస్పెండ్ చేసింది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో లైంగిక దాడి అభియోగాల కింద అరెస్ట్ అయిన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. విచారణలో మాలిక్ దోషిగా తేలితే అన్ని జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ల నుంచి శాశ్వత బహిష్కరణకు గురవుతాడు. భారతీయ యువ రచయితకు ప్రతిష్ఠాత్మక పురస్కారం భారతీయ యువ రచయిత నిఖిల్ చంద్వానీ (20)కి ప్రతిష్ఠాత్మక అమెరికన్ లిటరరీ ఫోరం సొసైటీ పురస్కారం లభించింది. ఆయన రాసిన కోడెడ్ కాన్స్పిరసీ అనే నవలకు ఈ పురస్కారం దక్కింది. -
ఇక ఈ-పంచాయతీ
పంచాయతీల్లో పారదర్శక పౌరసేవలు అందనున్నాయి. గ్రామ సచివాలయాలు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోనున్నాయి. ప్రపంచంలోని ఏ మూలనుంచైనా జిల్లాలోని గ్రామాల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అతిత్వరలో రానుంది. పది రోజుల్లో జిల్లాలో మొదటి విడత కింద ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఈ-పంచాయతీ అమలుకానుంది. ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇక పారదర్శక పౌరసేవలు అందనున్నాయి. ఈ-పంచాయతీ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1028 పంచాయతీలు ఉన్నాయి. రెండు, మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. అలా మొత్తం పంచాయతీలను 568 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. వీటిలో బిల్లింగ్, విద్యుత్ సౌకర్యం ఉన్న పంచాయతీలను గుర్తించారు. మొదటి విడతగా 279 క్లస్టర్లలో ఈ-పంచాయతీ వ్యవస్థ అమలు చేసేందుకు కార్వే డేటా మేనేజ్మెంట్ అనే కంపెనీ అన్ని సిద్ధం చేసింది. ప్రతి క్లస్టర్‌కు ఒక కంప్యూటర్ మంజూరు చేశారు. రెండు క్లస్టర్లకు కలిపి ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించారు. ప్రతి మండల అభివృద్ధి కార్యాలయంలో ఒక కంప్యూటర్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని మూడు డివిజన్లకు మూడు కంప్యూటర్లను డీఎల్పీఓల పరిధిలో ఏర్పాటయ్యాయి. జిల్లా పరిషత్తు సీఈఓ పరిధిలో మరో రెండు కంప్యూటర్లు, జిల్లా పంచాయతీ అధికారికి రెండు కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. 143 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు ఈ-పంచాయతీపై ఏప్రిల్ 12, 13, 14 తేదీల్లో ఒంగోలు సమీపంలోని ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ ఇచ్చినట్లు కార్వే డేటా కంపెనీ జిల్లా కో-ఆర్డినేటర్ పి.బ్రహ్మంరాజు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ ఒక క్లస్టర్ పరిధిలో మూడు రోజులు, ఇంకొక క్లస్టర్ పరిధిలో మరో మూడు రోజులు పనిచేస్తారని వివరించారు. క్షేత్ర స్థాయిలో కంప్యూటర్లకు ఆన్లైన్ సమస్యలు వస్తే పరిష్కరించడానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌గా టి.జ్యోతి, ఏడీపీఎంగా ఎస్కే ఫరూక్‌ను కార్వే కంపెనీ నియమించింది. ఈ-పంచాయతీ ద్వారా ఏమి చేస్తారంటే.. ఈ-పంచాయతీ ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు అన్ని సేవలు అందనున్నాయి. జనన ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. గ్రామ జనాభా వివరాలు తెలుస్తాయి. పురుషులు, స్త్రీలు ఎంతమందో వివరంగా పొందుపరుస్తారు. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు, వాటి ఖర్చు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. గ్రామ సభల వివరాలు, పన్నుల వివరాలు అన్ని పొందుపరుస్తారు. గ్రామానికి సంబంధించిన వివరాలు అన్నీ ఆన్లైన్లో ప్రత్యక్షమవుతాయి. ఎక్కడినుంచైనా ఆన్లైన్ ద్వారా ఆయా పంచాయతీల సమాచారం తెలుసుకోవచ్చు. మొదటి విడత అనంతరం రెండో విడత ప్రక్రియను అమలు చేస్తారని జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీదేవి తెలిపారు. మొత్తం వ్యవహారాన్ని కార్వే కంపెనీ చూస్తోందని పేర్కొన్నారు. ఈ-పంచాయతీ ఏర్పాటు పూర్తయిన తరువాత వీటిపై మా పర్యవేక్షణ ఉంటుందని ఆమె వివరించారు. పదిరోజుల్లో పూర్తి స్థాయిలో ఎంపిక చేసిన పంచాయతీల్లో ఈ-పంచాయతీ అమలుకానుంది. -
పల్లె క‘న్నీరు’
గుక్కెడు నీటి కోసం పల్లె కన్నీరుపెడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో కిలోమీటర్ల కొద్దీ వెళ్లి పల్లె ప్రజలు నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎడ్లబండ్లు, సైకిళ్లు, కాలినడకన నీటి కోసం పాట్లు పడుతున్నారు. మైదానం, అటవీప్రాంతం అనే తేడాలేకుండా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. నీళ్లు లేనిచోట లేకపోగా..ఉన్నచోట నిర్లక్ష్యం వెంటాడుతోంది. చేతిపంపులు, ట్యాంకులు, పైపులైన్లకు మరమ్మతులు చేయించడంలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పంపు ఆపరేటర్ల అలసత్వం..విద్యుత్ సక్రమంగా లేకపోవడంతో మైదాన ప్రజల నోళ్లు ఎండుతున్నాయి. పక్కనే గోదావరి ఉన్నా చెలమల నీళ్లే అడవి బిడ్డలకు దిక్కయ్యాయి. వెరసి పల్లె క‘న్నీటి’ గోడు ఎవరికీ పట్టడంలేదనేందుకు ఈ కథనాలే నిదర్శనం... వేలేరుపాడు, న్యూస్‌లైన్: దాహం దాహం అంటూ గుక్కెడు నీటికోసం పల్లె ప్రజలు అల్లాడుతున్నారు. మండు వేసవిలో గొంతు తడుపుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. మండలంలోని ఎర్రతోగు, రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్, పాతరెడ్డిగూడెం, ఒంటిబండ, బోళ్లపల్లి, మేడేపల్లి, బుర్రెడ్డిగూడెం, చింతలపాడు తదితర గ్రామాల్లో ఉన్న తాగునీటి పథకాలు, చేతి పంపులు చెడిపోయి నెలలు దాటుతుతోంది. కొన్ని చోట్ల చేతిపంపులు కూడా లేకపోవడంతో వాగులు, కాల్వలు, చెలమల నీరుతాగాల్సి వస్తోంది. ఎర్రతోగు గ్రామంలో ఉన్న ఏకైక చేతిపంపు చెడిపోయి నాలుగునెలలు కావస్తున్నా మరమ్మత్తులు చేపట్టడం లేదు. ఇక్కడ మొత్తం 55 కొండరెడ్ల కుటుంబాలున్నాయి. ఈ గ్రామస్తులు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా అరకిలోమీటరు దూరంలోని ఎర్రకాల్వ వద్ద చెలమల నీరు తెచ్చుకొని తాగుతున్నారు. ఈ కలుషిత నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. 80 కుటుంబాలున్న బోళ్ళపల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం చెడిపోయి ఏడునెలలు అవుతుంది. గ్రామంలో ఉన్న ఏకైక చేతిపంపే దిక్కైంది. పాతరెడ్డిగూడెం గ్రామంలో మంచినీటి పథకం చెడిపోయి పదిరోజులకు పైగా అవుతుంది. ఈ గ్రామస్తులు అరకిలోమీటరు దూరంలోని పెదవాగు నుంచి నీళ్లు తెచ్చుకుని వాడుకుంటున్నారు. ఒంటిబండ గ్రామంలోనూ పథకం మరమ్మతులకు గురై వారం దాటుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మేడేపల్లిలో తాగునీటి పథకం సక్రమంగా పనిచేయడం లేదు. పైప్‌లైన్ నీరు ట్యాంక్ ఉన్న ప్రాంతంలోని కొన్ని ఇళ్ళకు మాత్రమే అందుతున్నాయి. పాఠశాల ఉన్న గుంపునకు అసలు నీళ్ళురావడం లేదు. ఈ ప్రాంత గిరిజనులు చేతిపంపును ఆశ్రయిస్తున్నారు. మరికొందరు పెదవాగు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్ గ్రామాల్లో చేతిపంపులు పనిచేయకపోవడంతో పెదవాగు, లోతువాగు చెలమల నీరు తాగుతున్నారు. అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో మంచినీటి పథకాలకు మరమ్మతులు చేయించి సక్రమంగా నీరందేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. మణుగూరు,న్యూస్‌లైన్: మండలంలోని సమితిసింగారం పంచాయతీలో సర్వయ్యగుంపు వలస గిరిజనులకు తోగునీరే తాగునీరవుతోంది. ఐదేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన సుమారు 32 కుటుంబాల వలస గిరిజనులు రేగలగండి చెరువు సమీపంలో నివాసం ఉంటున్నారు. జనావాసాలకు దూరంగా ఉంటున్న ఈ గిరిజనులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. వీరికి కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. వీరి నివాసప్రాంతానికి సమీపంలోని రేగులగండి చెరువుకు వెళ్లే తోగునీటినే తాగునీరుగా వాడుతున్నారు. గ్రామానికి కిలోమీటర్ దూరంలోని తోగులో నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అత్యంత మురికిగా ఉన్న ఆ నీటిని తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రామంలో ఓ చేతిపంపును నిర్మించాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని గుంపువాసులు కోరుతున్నారు. తిరుమలాయపాలెం, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. కొన్ని గ్రామాలలో నీటి వసతి లేక, మరికొన్ని గ్రామాలలో నీరున్నా విద్యుత్ కొరత, పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని తిరుమలాయపాలెం, పాతర్లపాడు, మేకలతండా, జింకలగూడెం, మహ్మదాపురం శివారు బోడా తండా తదితర గ్రామాలలో తాగునీటి సమస్య వేధిస్తోంది. పాతర్లపాడు తదితర గ్రామాలలో తాగునీటి వనరులు ఉన్నప్పటికీ సకాలంలో నీరు సరఫరా కావడం లేదు. పంచాయతీ సిబ్బందని ప్రశ్నిస్తే విద్యుత్ కొరతతో సరఫరా చేయలేకపోతున్నామని సాకులు చెపుతున్నారు. తమ గ్రామంలో రెండురోజులకు ఒకసారి నీరు సరఫరా చేసేవారని, ఇటీవలి కాలంలో అది కూడా సక్రమంగా రావడం లేదని స్థానికులు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ఎన్నికల కసరత్తు షురూ
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రాబోయే సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ ముగియగా డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియ, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ నెల 21వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను వెల్లడించాలని మొదట్లో నిర్ణయించినా కొంత ఆల స్యంగా ఈ నెల 31వ తేదీన వెల్లడించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలలోని మౌలిక సదుపాయాలను సంబంధిత తహసీల్దార్లు, ఎస్ఐలు, బూత్ లెవల్ అధికారులు పరిశీలి స్తున్నారు. పోలింగ్ బూత్‌లలో మంచినీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సౌకర్యాలు ఉన్నాయో లేవో చూస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలలోని పోలింగ్ బూత్‌లను కూడా గుర్తించి ముందస్తుగానే ఎన్నికల అధికారులకు నివేదిక అందించేందుకు పరిశీలనలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3020 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2009 సాధారణ ఎన్నికలు, ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను గుర్తిస్తున్నారు. దీంతో పాటు ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండలాల వారీగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ నెల 24న రాష్ర్టస్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. 31న తుది జాబితా ప్రకటన నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార యంత్రాంగం తుది జాబితాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనుంది. నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2013 నవంబర్ 18వ తేదీ నుంచి 2013 డిసెంబర్ 23వ తేదీ వరకు చేపట్టారు. కాగా ప్రస్తుతం డబుల్ ఓట్ల తొలగింపు కార్యక్రమంతో పాటు తుది జాబితా ప్రకటనకు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన ఆర్డీఓ, తహసీల్దార్లు అన్ని పోలింగ్ స్టేషన్లలో తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. నియోజకవర్గానికి ఓ అధికారి ఓటర్ల నమోదుతో పాటు ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను చేపట్టడానికి నియోజకర్గానికి ఒక అధికారిని నియమించారు. గతంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నింటికీ ఆర్డీఓ ఎన్నికల అధికారిగా ఉండే వారు. కానీ ప్రస్తుతం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించారు. ఓటర్ల జాబితాలను సిద్ధం చేసే ప్రక్రియను వీరే చేపడుతున్నారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 12మంది డిప్యూటీ తహసీల్దార్లను నియోజకవర్గ ఎన్నికల అధికారులుగా నియమించారు. జిల్లాలో 3020 పోలింగ్ కేంద్రాలు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 3020 పోలింగ్ కేంద్రాలున్నాయి. 2013 నవంబర్ నాటికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో 25,19,559 ఓటర్లు ఉన్నారు. కాగా కొత్తగా ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తికావడం వల్ల తుది జాబితా పూర్తయ్యే వరకు 2 నుంచి 4 శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉంది. -
16నుంచి నర్సింగ్ తరగతులు
=పేర్ని నాని చొరవతో కళాశాల మంజూరు = ఆస్పత్రికి 24 గంటల విద్యుత్ సౌకర్యం =జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా ప్రభుత్వాస్పత్రికి నూతనంగా బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ జీ సోమసుందరరావు తెలిపారు. గురువారం ఆయన ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 16వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నామన్నారు. కళాశాలలో 30 మంది విద్యార్థులుంటారని, అయితే ఇప్పటి వరకూ 27 మంది కౌన్సెలింగ్ ద్వారా ఎంపికయ్యారని తెలిపారు. బీ పద్మను కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం నియమించిందని ఆమె ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ముఖ్యమంత్రిని ఈ కళాశాల ఏర్పాటు చేయాలని కోరడంతో కళాశాల మంజూరయిందని తెలిపారు. అలాగే ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యసేవలందించేందుకు తమ వైద్య సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని, సరైన చికిత్స అందని రోగులు తనకు ఫిర్యాదు చేస్తే మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రసవం నిమిత్తంవచ్చిన గర్భిణిలను ఇక్కడి వైద్యులు ఎక్కువగా విజయవాడకు రిఫర్ చేస్తున్నారనే వాదనలున్నాయని విలేకరులు ప్రశ్నించగా...ఇలాంటి కేసులను ఎందుకు రిఫర్ చేయాల్సివస్తుందో ముందుగానే తనకు సమాచారం ఇవ్వాలని వైద్యులకు ఆదేశాలిస్తానన్నారు. ఆస్పత్రిలో గత ఏఫ్రిల్ నెల నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు 1916 ప్రసవాలు మాత్రమే జరగాలని టార్గెట్ ఉండగా 2884 జరిగాయని తెలిపారు. ఆస్పత్రిలో 24గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేందుకు గానూ ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 9.50లక్షలను విద్యుత్ శాఖకు చెల్లించామన్నారు. దీంతో 7వ తేదీ నుంచి ఆస్పత్రికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సర ఫరా కనెక్షన్ ఇచ్చారన్నారు. ఎంబీబీఎస్ పీజీ చేసిన ట్రైనీ వైద్యులు తప్పని సరిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనే నిబంధన వచ్చాక, ఆస్పత్రికి ఇద్దరు నూతన వైద్యులు వచ్చారన్నారు. ఆస్పత్రిలో నాలుగు సీనియర్ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మూడు డెప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 7 అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. బీఎస్సీ నర్సింగ్ కశాళాల ప్రిన్సిపాల్ బీ పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 12 కళాశాలలను ప్రభుత్వం మంజూరు చే యగా, వీటిలో తొలి విడతగా 6 కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. రెండో విడతలో మచిలీపట్నంతో పాటు గుంటూరు, శ్రీకాకుళం, జగిత్యాల, హైదరాబాద్‌లోని గాంధీనగర్ కు ఐదు కళాశాలలను మంజూరు చేసిందని తెలిపారు. కళాశాలలో ముగ్గురు అధ్యాపకులను నియమించారన్నారు. 13, 14 తేదీల్లో అవగాహనా తరగతులను నిర్వహించి సోమవరం నుంచి తరగతులను ప్రారంభి స్తున్నామన్నారు. -
అన్నీ అడ్డంకులే..
=‘ఇందిర జలప్రభ’కు బాలారిష్టాలు =మోటార్లకు ధర నిర్ణయంలో జిల్లా పర్చేజింగ్ కమిటీ తాత్సారం =ఎస్సీ,ఎస్టీల భూములకు అందని సాగునీరు సాక్షి, విశాఖపట్నం: ఎస్సీ,ఎస్టీ భూములను సాగులోకి తెచ్చేందుకు చేపట్టిన ఇందిర జలప్రభ పథకం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ ముహూర్తాన దీనికి శ్రీకారం చుట్టారో గానీ అన్నీ అడ్డంకులే. ప్రభుత్వ అలక్ష్యానికి అధికారులు చిన్నచూపు తోడయింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఈ పథకం పరిస్థితి తయారైంది. గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో బోర్లు తవ్వకాలకు రిగ్ యజమానులు కొంతకాలం ముందుకు రావడంలేదు. పథకం ప్రవేశపెట్టిన రెండేళ్ల అనంతరం కొందరు ఆసక్తి చూపడంతో జిల్లా వ్యాప్తంగా 155 బోర్లు వేశారు. కానీ విద్యుత్ సౌకర్యం, పంపు సెట్లు అమర్చడంలో అధికారులు విఫలమయ్యారు. ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం కల్పించినా సరైన ధర ఇవ్వలేదంటూ పంపు సెట్లు ఏర్పాటుకు కంపెనీలు ముఖం చాటేశాయి. దీంతో ఏళ్ల క్రితం డ్రిల్లింగ్ చేసిన బోర్లు నిరుపయోగమయ్యాయి. ధర విషయంలో కాస్తా వెసులుబాటు కల్పిస్తూ ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మరోసారి అధికారులు టెండర్లు పిలిచారు. కానీ ప్రభుత్వ స్థాయిలో ఏమైందో.. గడువు ముగియకుండానే వాటిని మధ్యలోనే రద్దు చేశారు. వివిధ శాఖల అధికారులు సభ్యులగా ఉన్న జిల్లా పర్చేజింగ్ కమిటీ నిర్ణయించిన ధరకు పంపు సెట్లు కొనుగోలు చేసి అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడా కమిటీ పంపుసెట్ల ధర నిర్ణయంలో తాత్సారం చేస్తోంది. రేటు నిర్ణయించకుండా వాటిని కొనుగోలు చేసే అధికారం సంబంధిత అధికారులకు లేదు. దీంతో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న డ్వామా అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుతం 28 బోర్లు విద్యుత్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నా పంపుసెట్లు లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీల భూములకు సాగునీరందించలేని దుస్థితి. పంపుసెట్లు అమరిస్తే మరో127 బోర్లుకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ట్రాన్స్‌కో అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా జిల్లా పర్చేజింగ్ కమిటీ తాత్సారంతో ఇప్పుడు ఇందిర జల ప్రభ అక్కరకు రాకుండాపోయింది.