సింద్రి: ధనికుల కోసమే ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చీకట్లలో మగ్గుతున్న 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, వాటిలో ధనిక ప్రజలు నివసిస్తున్నారా? అని ఘాటుగా ప్రశ్నించారు. జార్ఖండ్‌లోని సింద్రిలో శుక్రవారం ఐదు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాక మోదీ ప్రసంగించారు. ఓటుబ్యాంకు రాజకీయాల్లో పీకలదాకా మునిగిపోయిన నామ్‌దార్(వంశపారంపర్య) పార్టీకి సాధారణ కార్మికుల బాధలు పట్టడంలేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. విద్యుత్ సౌకర్యంలేని సుమారు 4 కోట్ల కుటుంబాల (ఒక్క జార్ఖండ్‌లోనే 25 లక్షలు)కు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment