హామీలు తప్ప.. ఆచరణ ఏదీ?
- ఇళ్లలోకి చేరుతున్న వరదనీరు
- 13వ వార్డులో అన్నీ సమస్యలే
- ఐదేళ్లుగా వరుస ముంపునకు గురవుతున్న ఇళ్లు ఇబ్బందుల్లో ప్రజలు
- ఏళ్లు గడిచినా అమలుకు నోచుకోని వైనం
సంగారెడ్డి మున్సిపాలిటీః సమస్యలపై నాయకులు హామీలిచ్చినా.. ఏండ్లు గడుస్తున్న అమలుకు నోచుకోవడంలేదు. వర్షాకాలం వస్తే చాలు రాత్రి వేళల్లో జాగారాం చేయాల్సి వస్తోంది. సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. నిత్యం సమస్యలపై అధికారులకు తెలిపినా వారు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. పట్టణంలోని 13వ వార్డులో ప్రధానంగా బొబ్బిలికుంట నుంచి వచ్చే వరద నీటితో ఈ వార్డులోని ఇండ్లలోకి నీరు వచ్చిచేరుతోంది. ఇందు కు ఇండ్ల మధ్య ఉన్న ప్రధాన వరద కాల్వ ఉండటమే. కాగా ఐదేళ్లుగా ప్రతి సారి వరద నీటితో ఈ ప్రాంతంలోని ఇండ్లు ముంపునకు గురవుతున్నాయన్నారు.
అందుకోసం శాశ్వత సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అప్పట్లో మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన జేసీ.డా.శరత్ రెవెన్యూ పరమైన సమస్యలుంటే తనదృష్టి కి తీసుకొస్తే పరిష్కరిస్తానని తెలిపారు. అందు కు ఇరిగేషన్ శాఖ అధికారులు రాజం పేట నుంచి బొబ్బిలికుంట మీదుగా మహబూబ్‌సాగర్ కాల్వ వరకు ఫీడర్ చానల్ కాల్వ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. అందుకు అవరమైన రూ. 5 కోట్లు మంజూరు చేయిస్తానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో హామీ ఇచ్చారు.
ముంపు బాధితులకు శాశ్వత సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో అందుకు ప్రణాళి కలు తయారు చేశారు. ఇంతలోనే ప్రభుత్వం మారింది, వారి సమస్య మళ్లీ మొదటికి వచ్చిం ది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట య్యాక గత ఏడాది కురిసిన వర్షం కారణంగా ఇండ్లలోకి నీరు వచ్చింది. ఎమ్మెల్యే చింతాప్రభాకర్ బాధితులను పరామర్శించారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఆ సమస్యను అలాగే వదిలేశారు. తిరిగి వర్షా లు కురుస్తుండటంతో వార్డు ప్రజలు ఆందోళనకు గురైతున్నారు.
రూ.4 కోట్లతో ప్రతిపాదనలు
వార్డులో నెలకొన్న సమస్యల్లో ప్రధానమైంది బొబ్బిలి కుంట వరద కాలువ. దీని నిర్మాణానికి రూ. 4 కోట్లకు ప్రతిపాదనలు పంపాం. ఈ కాల్వ నిర్మాణం పైనే దృష్టి సారించా. నిధులు మంజూరికి కృషి చేస్తు న్నా. రూ.48 లక్షలతో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. మరికొన్ని నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తాం.
-వార్డు కౌన్సిలర్, మహ్మద్ నజీం (హజ్జు)
అభివృద్ధిలో ముందున్నాం..
పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కంటే తాము ముందంజలో ఉన్నాం. 13 వార్డు లో ప్రధానంగా వరద కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దానికి ప్రతిపాదనలు పంపించాం. వార్డులో సుమారు ఇప్పటికే 65 లక్ష పనులు చేశాం, మరో రూ.20 లక్షల నుంచి రూ. 35 లక్షల విలువ చేసే పనులు మంజూరై టెండర్ దశలో ఉన్నాయి.
- మున్సిపల్ చైర్‌పర్సన్, విజయలక్ష్మి