
ముంబై: కరోనా వైరస్ నేపథ్యంలో మెజారిటీ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే పని) వెసలుబాటు కల్పిస్తున్నాయి. అయితే కంపెనీ ప్రాంతాలలో అద్దెలు విపరీతంగా ఉండడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అని చాలా ఉద్యోగులు భావించారు. కానీ ఉద్యోగుల ఆశలకు కంపెనీలు షాక్ ఇచ్చే యోచన చేస్తున్నాయి. తాజాగా వీఎమ్‌వేర్ ఇన్ అనే ఐటీ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకునే వారికి ఉద్యోగుల వేతనాలలో కోత( 18శాతం) విధించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఐటీ దిగ్గజం డెల్ టెక్నాలజీస్(వీఎమ్‌వేర్‌లో 81శాతం వాటా) ప్రతినిధులు స్పందిస్తూ కరోనా తగ్గాక ఉద్యోగుల వేతనాలపై ఆలోచిస్తామని తెలిపారు. అయితే సోషల్ మీడియం దిగ్గజం ఫేస్‌బుక్ ప్రాంతాలను బట్టి వేతనాలలో కోతలు ఉంటాయని తెలిపింది. ఉదా: అమెరికాలోని ఖరీదైన మహా నగరాలు(శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్) వదిలి సొంత ప్రాంతాలకు వెళ్లె వారికి వేతనాల కోత ఉంటుందని ఫేస్‌బుక్ పేర్కొంది. (చదవండి: కోవిడ్-19 : పని సంస్కృతిలో సమూల మార్పులు)