2024–25పై ఇక్రా అంచనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3–5 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ తెలిపింది. ‘వృద్ధి వేగం పుంజుకునే వరకు ఈ రంగంలో నియామకాలు సమీప కాలంలో స్తబ్ధుగా ఉంటాయి. ఆదాయ వృద్ధిపై ఆందోళనల మధ్య కంపెనీల లాభదాయకత స్థితిస్థాపకంగా ఉంటుంది. 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ రంగానికి 2024–25లో నిర్వహణ లాభాల మార్జిన్లు 21–22 శాతానికి వస్తాయి.
2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పరిశ్రమ కేవలం 2 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. వాస్తవానికి 3–5 శాతం ఆదాయ వృద్ధి ఉంటుందని పరిశ్రమ గతంలో అంచనా వేసింది. 2022–23 ఏప్రిల్–డిసెంబర్‌లో ఇది 9.2 శాతం సాధించింది. యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో స్థిర, స్థూల ఆర్థికపర ఎదురుగాలుల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు ఐటీపై తక్కువ వ్యయం చేయడంతో 2024–25లో కూడా స్వల్ప ఆదాయ వృద్ధి అంచనాలకు దారితీసింది’ అని తెలిపింది.
సగటు అట్రిషన్ 12–13 శాతం..
‘క్లిష్ట వ్యయాలు, వ్యయ నియంత్రణ ఒప్పందాలు కొనసాగనున్నాయి. ఇది భారతీయ ఐటీ సేవల కంపెనీల వృద్ధి అవకాశాలకు కొంతవరకు మద్దతునిస్తుంది. బలమైన ఆర్డర్ బుక్స్, వివిధ దశల్లో ఉన్న డీల్స్.. స్థూల ఆర్థికపర ఎదురుగాలులు తగ్గిన తర్వాత ఊపందుకుంటాయి. కార్పొరేట్ సంస్థలకు మహమ్మారి తర్వాత మొత్తం మూలధన కేటాయింపులకు టెక్ ఖర్చులు మరింత సమగ్రంగా మారాయి. నియామక కార్యకలాపాలు స్తబ్ధుగా ఉంటాయని అంచనా వేస్తున్నప్పటికీ అట్రిషన్ స్థాయిలు సమీప కాలంలో స్థిరపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment