ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా ఐటీ ప్రాజెక్టులు అధికంగా లభించే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో వైరస్ విజృంభణ పతాక స్థాయికి చేరడంతో కొత్త ప్రాజెక్టులు లేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్, డైటా సైన్స్ లాంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ తదితర కోర్సులను జాబ్ కన్సెల్టెన్సీలు ఆఫర్ చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలకు శిక్షణ ఇచ్చే జిగ్సా అకాడమీ సీఈఓ వోహ్రా స్పందిస్తూ.. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కూడా వైవిధ్యమైన కోర్సుల్లో నైపుణ్యం పొందిన వారికి ఉద్యోగాలలో డోకా ఉండదని తెలిపారు.
మరోవైపు టెక్నాలజీలకు పేరు పొందిన యుడెమీ సీఈఓ ఇర్విన్ ఆనంద్ స్పందిస్తూ.. వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్ కోర్సులలో 60శాతంనుంచి 58శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. కాగా లాక్‌డౌన్ వల్ల వీడియా లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యత పెరిగిందని స్ప్రింగ్ సీఈఓ రవి కాక్లసరి తెలిపారు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) తదితర కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందని సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ డీ.డీ మిశ్రా అభిప్రాయపడ్డారు.(చదవండి: కంపెనీ పెట్టండి..రాయితీ పట్టండి)
Comments
Please login to add a commentAdd a comment