AP Minister Gudivada Amarnath Key Comments Executive Capital Vizag - Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో పరిపాలన రాజధానిగా విశాఖ.. టార్గెట్‌ ఐటీ హబ్‌: మంత్రి గుడివాడ

Published Sat, Jan 21 2023 3:13 PM | Last Updated on Sat, Jan 21 2023 5:41 PM

AP Minister Gudivada Amarnath Key Comments executive capital Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్నం గురించి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతోందని, ఏదేమైనా ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మరోసారి ఉద్ఘాటించారు.

విశాఖలో శనివారం రెండో రోజు ఇన్ఫినిటి వైజాగ్‌ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఇన్ఫోసిస్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ‘‘దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదవ స్థానంలో ఉంది. త్వరలో అదాని డేటా సెంటర్‌ను ప్రారంభిస్తాం. విశాఖను ఐటీ హబ్‌ చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన ప్రకటించారు. ఈ సదస్సులో మంత్రి అమర్నాథ్‌తో పాటు పలువురు ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement