బోలెడన్ని డబ్బులు పోసి మనసుకు నచ్చిన స్మార్ట్ ఫోన్, ల్యాప్‌ట్యాప్ వంటి డిజిటల్ వస్తువులు కొనుక్కుంటాం. కానీ, వాటిలో నచ్చినవన్నీ చూసేస్తాం అనుకోవడానికి లేదు. పిల్లల అశ్లీల వీడియోలు చూసినా, వాటిని షేర్ చేసినా, స్టోర్ చేసుకున్నా ..జైలుకెళ్ళాల్సిందే అంటోంది సుప్రీం కోర్టు. అందుకని ఇకపైన నా ఫోన్ నా ఇష్టం అంటే విషయం ఎక్కడకు వరకు వెళుతుందో. ఇంటి కోర్టులోనే డిజిటల్‌లో గుడ్ వాచ్.. బ్యాడ్ వాచ్ గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం అంటున్నారు నిపుణులు.
డిజిటల్‌లో అశ్లీల వీడియోలు కుప్పలు తెప్పలుగా చాపకింద నీరులా చేరుతుంటాయి. మీ డివైజ్‌లో పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు, అశ్లీల సమాచారం ఉన్నా, వాటిని ఎవరైనా షేర్ చేసినా ఇక నుంచి క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది. ఈ విషయాన్ని ఇటీవల భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం చట్టంగా తీసుకొచ్చి, కొరడా ఝలిపించింది. నేరాన్ని ప్రేరేపించే చర్యలను కట్టడి చేయడానికి న్యాయశాస్త్రంలో ‘ఇంకోట్ క్రైమ్’ సిద్ధాంతం ప్రాముఖ్యతను సుప్రీం కోర్టు నొక్కి చెప్పింది.
నేరాన్ని ప్రేరేపించేవే!
పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు, చిత్రాలు, కంటెంట్ ఎవరి దగ్గర ఉన్నా దాని వెనుక గల చెడు ఉద్దేశ్యం ఒకటే. ప్రేరేపిత నేరాలు తదుపరి నేరానికి సిద్ధమయ్యే క్రిమినల్ చర్యలుగా కోర్టు దీనిని నిర్వచించింది. కంటెంట్ అసలు ప్రసారం అయ్యిందా, లేదా అనే దానితో కూడా సంబంధం లేకుండా శిక్షార్హులే అని కోర్టు స్పష్టం చేసింది.
కఠిన శిక్షలు తప్పవు
పిల్లల అశ్లీల వీడియోలు, చిత్రాలు వంటివి తమ డివైజ్‌లో ఏవి స్టోర్ చేసుకున్నా వాటిని స్వాధీనం చేసుకోవడంతో ΄ాటు లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే పోక్సోలోని సెక్షన్ 15 కింద జరిమానా లేదా శిక్ష లేదా రెండూ విధించాలని నిర్ణయించింది. ఉపవిభాగాలు (1), (2), (3)లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వివిధ నేరాలకు శిక్షలు, నేరం స్వభావాన్ని బట్టి జరిమానాల నుండి జైలు శిక్ష వరకు ఏ విధంగా ఉంటాయో వివరించింది.
వివిధ రకాల శిక్షలు
⇒పిల్లల పోర్న్‌కు సంబంధించిన డిజిటల్ స్టోరేజ్ స్వాధీనం చేసుకుంటే సెక్షన్ 15 (1) కింద కనీసం రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు జరిమానా ఉంటుంది.
⇒పిల్లల అశ్లీల విషయాలను వ్యాప్తి చేస్తే సెక్షన్ 15 (2) ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి.
⇒వాణిజ్య లాభాల కోసం పిల్లల పోర్న్ కంటెంట్‌ను ఉపయోగిస్తే సెక్షన్ 15 (3) కింద మొదటిసారి నేరం చేసిన వారికి మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి.
⇒పునరావృతం చేసే నేరాలకు జరిమానాతో ΄ాటు ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
డిజిటల్ అక్షరాస్యత అవసరం
అన్ని వయసుల వారూ ఫోన్‌ని ఉపయోగించే వెసులుబాటు మన దగ్గర ఉంది. కానీ, ఆన్‌లైన్‌లో ‘ఏం చూస్తున్నాం, జాగ్రత్తగా ఎలా ఉండాలి’ అనే అవగాహన లేదు. పక్కనవాళ్లు చూస్తున్నారు కదా అని మనం కూడా ‘పియర్ క్యూరియాసిటీ’తో వీడియోలను షేర్ చేసుకొని మరీ చూస్తుంటారు. స్వీయ వినోదం కోసం చెత్తను పోగేసుకుంటూ ఉంటారు. దీనికి కారణం డిజిటల్ అక్షరాస్యత లేకపోవడమే. ఆఫ్‌లైన్‌లో అంటే సమాజంలో ఎలాంటి మర్యాదలు ΄ాటిస్తున్నారో, ఆన్‌లైన్‌లో కూడా అంతే మర్యాదగా ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పోస్ట్ చేసే కంటెంట్ విషయంలోనూ కంట్రోల్ లేకపోవడం, వెరిఫికేషన్ చెక్ చేసుకకోపోతే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే.
వయసుల వారీగా అవగాహన
పిల్లలు, యువత డిజిటల్‌లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారో పెద్దలు తప్పక తెలుసుకోవాలి. చట్టపరంగా వచ్చిన మార్పుల గురించీ వారికి అవగాహన కల్పిస్తూ ఉండాలి. పిల్లలు డిజిటల్‌ను వాడుతుంటే వారి వయసును బట్టి పేరెంటల్ కంట్రోల్స్ కీ లను ఉపయోగించాలి. బ్రౌజింగ్, యాప్స్... వంటివన్నీ సేఫ్ మెథడ్స్‌లో ఉంచాలి. సాధారణంగా పిల్లలకు గుడ్‌టచ్–బ్యాడ్ టచ్ ఏ విధంగా చెబుతుంటారో డిజిటల్ పరంగా గుడ్ వాచ్–బ్యాడ్ వాచ్ గురించి కూడా తెలియజేయాలి. పిల్లలు ఏదైనా షేర్ చేస్తుంటే వారు పోస్ట్ చేసే కంటెంట్‌పైన మానిటరింగ్ ఉండాలి. స్కూళ్లలోనూ వయసు పరంగా అవగాహన తరగుతలను నిర్వహించాలి. టీనేజ్ స్థాయి నుంచి వయసులవారీగా మెంటల్ హెల్త్ ద్వారా కౌన్సెలింగ్స్ ఇస్తూ నివారణో΄ాయాలు సూచించాలి. ఎవరి దగ్గరైనా చైల్డ్ పోర్న్ ఉన్నా, షేర్ చేస్తున్నా .. వారి గురించి పోలీసులకు లేదంటే జ్టి్టpట://ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn లో కంప్లైంట్ చేయచ్చు.
– అనీల్ రాచమల్ల,
సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment