న్యూఢిల్లీ: వాట్సప్ మెసేంజర్‌లో చైల్డ్‌పోర్నోగ్రఫీకి స్థానం లేదని, అలాంటి సమాచారంపై చర్యలు చేపడుతూ ఎప్పటికప్పుడు వాటికి కారణమైన ఖాతాలను నిషేధిస్తున్నట్లు శుక్రవారం ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇలాంటి నేరాలకు సంబంధించి దర్యాప్తు నిమిత్తం చట్టబద్ధ సంస్థలు పంపిన లీగల్ రిక్వెస్ట్‌లపై స్పందిస్తూ.. ‘వినియోగదారులు షేర్ చేసిన సమాచారాన్ని మేం చూడలేం. వినియోగదారుడు ఇచ్చే ఫిర్యాదు నివేదికను బట్టే చర్యలు తీసుకోగలం లేదా ఆ ఖాతాలను నిషేధించగలం’ అని వాట్సప్ తెలిపింది. చైల్డ్‌పోర్నోగ్రఫీ వంటి అనుచిత సమాచారం తొలగించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment