చైల్డ్ పోర్నోగ్రఫి కేసులో నటుడు!
లాస్ ఎంజిల్స్: బాలల అశ్లీల చిత్రాలు, ఫోటోలు కలిగివున్నాడన్న ఆరోపనలతో అరెస్టైన అమెరికన్ నటుడు మార్క్ సాలింగ్(33) కేసు విచారణ ఫెడరల్ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తుల బృందం సాలింగ్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. బాలలపై జరిగే నేరాలను అదుపు చేసే ఇంటర్నెట్ క్రైమ్స్ ఎగయినెస్ట్ చిల్రన్స్ టాస్క్ఫోర్స్ ఇటీవల నిర్వహించిన దాడుల్లో బాలలకు సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫోటోలు దొరకడంతో సాలింగ్ అరెస్టయిన విషయం తెలిసిందే.
బాలలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు షేర్ చేయడం, అంతర్జాలం నుంచి డౌన్లోడ్ చేయడం లాంటి చర్యలు బాలలను బాధితులుగా మార్చడాన్ని ప్రేరేపిస్తుందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో సాలింగ్కు ఐదు నుంచి గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.