నా భర్త వద్ద ఆ పోర్న్‌ వీడియోలు ఉండేవి: ఎంపీ | Australian MP reveals husband's child porn conviction | Sakshi
Sakshi News home page

నా భర్త వద్ద ఆ పోర్న్‌ వీడియోలు ఉండేవి: ఎంపీ

Published Thu, Sep 7 2017 1:35 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

నా భర్త వద్ద ఆ పోర్న్‌ వీడియోలు ఉండేవి: ఎంపీ

నా భర్త వద్ద ఆ పోర్న్‌ వీడియోలు ఉండేవి: ఎంపీ

సాక్షి, విక్టోరియా: ఆస్ట్రేలియా మహిళా ఎంపీ ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలు కలిగి ఉండటంతో తన భర్తను జైలుకు పంపించినట్టు ఆమె తెలిపారు. గత ఏడాది తమ ఇంట్లో పెద్ద ఎత్తున చైల్డ్‌ పోర్న్‌ వీడియోల కలెక్షన్‌ను దొరికిందని, దీంతో వెంటనే తాను, తన కొడుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశామని, ఈ కేసులో భర్తకు శిక్షపడిందని చెప్పారు. విక్టోరియా రాష్ట్ర పార్లమెంటు సభ్యురాలైన రాచెల్‌ కార్లింగ్‌-జెంకిన్స్‌ ఈమేరకు గురువారం వెల్లడించిన విషయాలు ఆస్ట్రేలియా వాసులను విస్మయపరిచాయి.

పెద్దలసభలో కన్జర్వేటివ్‌ సభ్యురాలైన ఆమె మాట్లాడుతూ తమ ఇంట్లో ఆ వీడియోలు, ఫొటోలు దొరకడంతో తన జీవితం తల్లకిందులైందని తెలిపారు. 'ఆ కలెక్షన్‌లో అత్యంత బాధ కలిగించే ఫొటోలను చూశాను. అప్పుడు కలిగిన ఆక్రోశం నాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. వెంటనే నా వివాహబంధాన్ని తెంపుకున్నాను. అవి దొరికిన రోజునే అత్తవారి ఇంటిని విడిచిపెట్టాను. నా వస్తువులు తీసుకోవడానికి తప్ప మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెట్టలేదు' అని ఆమె చెప్పారు. ప్రస్తుతం విడిగా ఉంటున్న తన భర్తపై కేసు విచారణకు ఆటంకం కలుగకూడదనే ఇన్నాళ్లు ఈ విషయాలు వెల్లడించలేదని తెలిపారు. తన భర్త చైల్డ్‌ ప్రోర్నోగఫీకి బానిస అని తనకు ఎన్నడూ అనుమానం కలుగలేదని, ఒక భార్యగా, ఒక తల్లిగా ఈ దారుణమైన నేరాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు ఏమాత్రం చింతించడం లేదని ఆమె తెలిపారు.

అప్పటినుంచి భర్త విడాకుల పత్రాలపై సంతకం చేయకుండా తనను వేధిస్తున్నాడని, తనకు రావాల్సిన ఆస్తులను తనకివ్వడానికి నిరాకరిస్తున్నాడని ఆమె తెలిపారు. చైల్డ్‌ పోర్నోగ్రఫీ వల్ల నిరుపేద, నిస్సహాయ, బలహీన వర్గాల పిల్లలు ఎంతో లైంగిక హింసను, క్షోభను అనుభవిస్తున్నారని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement