నిందితుడు అలెగ్జాండర్ హిల్లెల్ ట్రెయిస్‌మన్(19)
వాషింగ్టన్: మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో శనివారం కోర్టు రికార్డులు షాకింగ్ న్యూస్‌ని వెల్లడించాయి. 19 ఏళ్ల యువకుడు ఒకరు డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బైడెన్‌ని హత్య చేయాలని భావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి బైడెన్ ఇంటి చుట్టూ తిరగడమే కాక ఆయుధాలు కూడా కొనుగోలు చేశాడు. ఇంతలో పేలుడు పదార్థాలు తీసుకెళ్తూ చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. వివరాలు.. ఈ ఏడాది మే 28న, నార్త్ కరోలినాలోని కన్నపోలిస్లో పోలీసులు, బ్యాంకింగ్ పార్కింగ్ ప్లేస్ నుంచి మిస్సయిన వ్యాన్‌ను అలెగ్జాండర్ హిల్లెల్ ట్రెయిస్‌మన్(19) తీసుకెళ్లడం గమనించారు. దాని కిటికీలోంచి ఏఆర్-15 స్టైల్ రైఫిల్, ఒక .380-క్యాలిబర్ హ్యాండ్‌గన్, ఒక పెట్టె గమనించారు. (చదవండి: ఈసారి వైట్‌హౌస్ ఎవరి సొంతం?)
వ్యాన్‌ని అడ్డుకుని సర్చ్ చేయడంతో దానిలో 509,000 డాలర్ల డబ్బు, పుస్తకాలు (మనుగడ, బాంబు తయారీ, మెరుగైన ఆయుధాలు ఇస్లాంకు సంబంధించినవి), స్వస్తికా డ్రాయింగ్స్, భవనాల్లో కూలిపోతున్న విమానాలకు సంబంధించిన ఫోటోలు, సిగ్ సావర్ ఏఆర్ రైఫిల్, 9 మిమీ లుగర్, ఒక కెల్-టెక్ సబ్ -2000, ఒక .22-క్యాలిబర్ రైఫిల్ వంటి వాటిని గుర్తించారు. ఆ మరుసటి రోజు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అతడి మొబైల్, ఇతర 15 ఎలాక్ట్రానిక్ పరికరాల్లో ఆన్‌లైన్ సర్చ్ హిస్టరీలో వేలాది చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు.. 1200లకు పైగా చైల్డ్ పోర్న్ వీడియోలను గుర్తించారు. దాంతో అతడి మీద కేసు నమోదు చేసి సెప్టెంబర్‌లో అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల విచారణలో ట్రెయిస్‌మన్ విస్తుపోయే అంశాలు తెలిపాడు. ఉగ్రవాద సంఘటనలు, సామూహిక కాల్పులపై తనకు ఆసక్తి ఉందన్నాడు. అతను ద్వేషించేవారిని అంతం చేయడం.. మాస్ షూటింగ్ చేయాలనే కోరిక ఉన్నట్లు వెల్లడించాడు. (అమెరికా ఎన్నికలు: జో బైడెన్ వార్నింగ్)
అలానే జో బైడెన్‌ని చంపాలని భావించానన్నాడు ట్రెయిస్‌మన్. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు అతడు జో బైడెన్ ఇంటి అడ్రెస్, స్టేట్ గన్ చట్టాలు, రైఫిల్ పార్ట్స్, నైట్ విజన్ గాగుల్స్ గురించి సర్చ్ చేశానన్నాడు. అలానే మే నెలలో డెలావేర్‌లోని బైడెన్ ఇంటికి నాలుగు మైళ్ల దూరంలో సంచరించినట్లు తెలిపాడు. రికార్డులు ఇది నిజమని నిర్థారించాయి. వీటితో పాటు ఈ ఏడాది ఏప్రిల్ 15న ఐ ఫన్నీ అనే ప్లాట్‌ఫామ్‌లో నేను జో బైడెన్‌ని చంపుతానా అనే మిమ్‌ని కూడా షేర్ చేశాడు. న్యూ హాంప్‌షైర్‌లో ట్రెయిస్‌మాన్ ఒక ఏఆర్-15 రైఫిల్‌ను కొనుగోలు చేసి, "ఎగ్జిక్యూట్" అనే పదంతో ముగిసే చెక్‌లిస్ట్ నోట్‌ను కూడా రాసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఓ నెలలోపు చైల్డ్ పోర్నోగ్రఫి ఆరోపణ కింద అరెస్ట్ అయ్యాడు. మేజిస్ట్రేట్ న్యాయమూర్తి బెయిల్ లేకుండా ట్రెయిస్‌మన్ నిర్భందాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక గతేడాది అక్టోబర్‌లో క్రిస్టమస్ లేదా బ్లాక్ ఫ్రైడే నాడు మాస్ షూటింగ్ చేయాలని రాసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment