ఆత్మహత్యకు పాల్పడిన నటుడు మార్క్ సాలింగ్ (ఫైల్ ఫొటో)
న్యూయార్క్ : లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికన్ నటుడు మార్క్ సాలింగ్ (35) చనిపోయాడు. తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అతడి తరుపు న్యాయవాది మైఖెల్ ప్రోక్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయాన్నే అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చె్పారు. గ్లీ వంటి టీవీ సిరీస్‌లలో మంచి నటుడిగా అతడికి పేరుంది. అయితే, 2015లో అతడిపై లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు వచ్చాయి.
దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు 2016లో చార్జిషీట్ ఫైల్ చేశారు. అతడి ల్యాప్‌టాప్‌ను స్వాధీనంలోకి తీసుకొని పరిశీలించగా అందులో దాదాపు 50 వేల చైల్డ్ పోర్నోగ్రఫిక్ ఫొటోలు, వీడియోలు లభించాయి. ఈ మేరకు వాదోపవాదాలు పరిశీలించి అతడు దోషి అని న్యాయమూర్తి నిర్దారించారు. ఈ వచ్చే మార్చి 7న అతడికి శిక్ష ఖరారు కానుంది. ఈ లోగానే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఆగస్టులో (2017)లో కూడా ఓసారి ఆత్మహత్యాయత్నానికి సాలింగ్ పాల్పడినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment