సాక్షి, తిరువనంతపురం : లాక్‌డౌన్ కాలంలో ఆన్‌లైన్‌తోపాటు సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత రోజులో అధిక సమయం ఆన్‌లైన్‌లోనే వెచ్చిస్తున్నారు. దీని వల్ల జరిగే మంచిని పక్కకు పెడితే చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. ఈ క్రమంలో చిన్న పిల్లల ఆశ్లీల వీడియోలు, ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసినందుకు కేరళలో 41 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, వివిధ ఉద్యోగాల్లో పనిచేసేవారు ఉండటం గమనార్హం. చదవండి: పోర్నోగ్రఫీ చూసినా... కటకటాల్లోకే!
కోవిడ్ -19 కాలంలో పిల్లలపై లైంగిక దోపిడీ పెరిగిందనే ఫిర్యాదుల అందిన నేపథ్యంలో కేరళ సైబర్ సెల్ వీటిపై నిఘా పెంచింది. కేరళ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్‌డోమ్ సహాయంతో ఆపరేషన్ పి హంట్ 20.2లో ఆదివారం నిర్వహించిన హైటెక్ దర్యాప్తులో ఈ అరెస్టు కొనసాగింది. అరెస్టైన నిందితులు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కరోనా లైఫ్, ఇతర పేరు పెట్టి చైల్డ్ పోగ్నోగ్రఫీ చిత్రాలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. రాష్ట్రంలో మొత్తం 362 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో మొత్తం 268 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఆపరేషన్‌లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు,హార్డ్ డిస్క్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్.. ఇద్దరు అరెస్ట్
ఈ నేపథ్యంలో డార్క్‌నెట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి పోర్నోగ్రఫీ చిత్రాలను చూడటం, షేర్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం వంటి ఆరోపణలపై నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరానికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ .10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ నేరం వెనుక ఉన్నత వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసుల బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment