అనాథలైన అక్షయ, ఐశ్వర్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : అనారోగ్యం ఆ కుటుం బాన్ని వెంటాడింది. కూలీ పనులు చేస్తేనే పూటగడిచే కడు పేదరికం అనుభవిస్తున్న ఆ కుటుం బంలో భార్యభర్తలు అనారోగ్యంతో తనువు చా లించడంతో వారి ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యా రు. ఈ విషాద సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్‌లో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..తిమ్మాపూర్‌కు చెందిన కొలకాని సుజాత–లక్ష్మయ్య దంపతులు కూలీ పనులు చేస్తూ కూతుళ్లు అక్షయ(10), ఐశ్వర్య(5)ను పోషించుకుంటున్నారు.
రెండేళ్ల క్రితం లక్ష్మయ్య అనారోగ్యానికి గురయ్యాడు. స్థానిక ఆస్పత్రుల్లో చూపించుకున్నా వ్యాధి నయం కాలేదు. హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఖరీదైన వైద్యం అందించాలని వైద్యులు సూచించగా.. అం దకపోవడంతో లక్ష్మయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి సుజాత కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లల ను పోషించుకుంటుంది. ఆమె కూడా అనారోగ్యానికి గురై ఆదివారం మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలై తల్లి శవం వద్ద విలపించడం అందరినీ కలచివేసింది. మృతురాలి కుటుంబాన్ని ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్ పరామర్శించి ఇద్దరు ఆడ పిల్లలను మంత్రి కేటీఆర్ సాయంతో గురుకుల విద్యాలయంలో చేర్పించి ప్రయోజకులుగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల్లో నాయకులు అనిల్, సీత్యానాయక్, రవి పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment