sirisella
-
KTR: కాంగ్రెస్ సర్కార్ చార్జీలు పెంచితే
-
నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్..
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి కేటీ ఆర్ రాజీనామా చేసి నల్లగొండ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. తాను సైతం నల్ల గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. నల్లగొండలో కేటీఆర్ ఓటమి ఖాయమని, ఇక కారు షెడ్డు మూసుకోక తప్పదన్నారు. కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని మూసివేస్తాం అని కేసీఆర్ ప్రకట న చేస్తారా? అని సవాల్ విసిరారు. తాను సిరిసి ల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన ని స్పష్టం చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం సచివాల యంలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లా డారు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదని కానీ రూ. లక్షల కోట్లు ఉన్నాయని, తనకు క్యారెక్టర్ ఉందని కానీ డబ్బులు లేవన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో రూ.200 కోట్లు ఖర్చు చేసి 30 వేల ఓట్లతో గెలిచాడని, తానై తే అలా గెలిస్తే రాజీనామా చేసేవాడినన్నారు. మాకు ప్రత్యర్థి బీజేపీనే... లోక్‌సభ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదని, బీజేపీనే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోటీలో లేదని, బీజేపీకి రెండు, మూడు సీట్లు వస్తాయో లేదో తెలియదన్నా రు. బీజేపీ ఎంపీ డి.అర్వింద్‌ను ప్రజలు ఎప్పు డో మరిచిపోయారని కోమటిరెడ్డి చెప్పారు. రాజకీ యాల వల్ల ఆస్తులు పోగొట్టుకున్నామని, తనతో పాటు ఉత్తమ్ ఆస్తులు తగ్గాయన్నారు. తన పేరు మీద ఆస్తులుంటే అర్వింద్‌కు ఇచ్చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరిలలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని రాహుల్ గాంధీకి ప్రతిపాదించామని తెలిపారు. -
రాజన్న సేవలు అనిర్వచనీయం
సిరిసిల్లటౌన్: పేదప్రజల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సేవలు అనిర్వచనీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము అన్నారు. శనివారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేటు వైద్యం ఉచితంగా అందించిన ఘనత ఆయనదేనన్నారు. ఆ మహానేత ఎప్పటికీ ప్రజల మదిలో చిరస్మరణీయులుగా ఉంటారన్నారు. ఆదివారం జనహృదయ నేత రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుంటుక సంపత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి అనిల్, బీసీ సెల్ అధ్యక్షుడు పల్లె రవి, జిల్లా కార్యదర్శి బిజ్జు శ్రీనివాస్, జిల్లా రైతుసెల్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దాయి శ్రీనివాస్, అజిత్, క్యాతం శ్రీనివాస్, తొర్ర రాజు, కొత్వాల రవి, క్యాతం ప్రసాద్, గుండేటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు తండ్రి.. నేడు తల్లి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : అనారోగ్యం ఆ కుటుం బాన్ని వెంటాడింది. కూలీ పనులు చేస్తేనే పూటగడిచే కడు పేదరికం అనుభవిస్తున్న ఆ కుటుం బంలో భార్యభర్తలు అనారోగ్యంతో తనువు చా లించడంతో వారి ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యా రు. ఈ విషాద సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్‌లో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..తిమ్మాపూర్‌కు చెందిన కొలకాని సుజాత–లక్ష్మయ్య దంపతులు కూలీ పనులు చేస్తూ కూతుళ్లు అక్షయ(10), ఐశ్వర్య(5)ను పోషించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం లక్ష్మయ్య అనారోగ్యానికి గురయ్యాడు. స్థానిక ఆస్పత్రుల్లో చూపించుకున్నా వ్యాధి నయం కాలేదు. హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఖరీదైన వైద్యం అందించాలని వైద్యులు సూచించగా.. అం దకపోవడంతో లక్ష్మయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి సుజాత కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లల ను పోషించుకుంటుంది. ఆమె కూడా అనారోగ్యానికి గురై ఆదివారం మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలై తల్లి శవం వద్ద విలపించడం అందరినీ కలచివేసింది. మృతురాలి కుటుంబాన్ని ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్ పరామర్శించి ఇద్దరు ఆడ పిల్లలను మంత్రి కేటీఆర్ సాయంతో గురుకుల విద్యాలయంలో చేర్పించి ప్రయోజకులుగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల్లో నాయకులు అనిల్, సీత్యానాయక్, రవి పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఎన్నాళ్లీ ఇన్చార్జీల పాలన
ఎల్లారెడ్డిపేట : కొత్త మండల కేంద్రంగా ఏర్పాడిన వీర్నపల్లిలో ఇంకా ఇన్చార్జీల పాలనే కొనసాగుతోంది. మండల కేం ద్రం ఏర్పాటుతో తమ కష్టాలు తీరుతాయని భావించిన మండలవాసుల ఆశలు అడియాసలయ్యాయి. ప్రతి పనికి గతంలో లాగే ఎల్లారెడ్డిపేటకు వెళ్లక తప్పడం లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర్నపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేసి అన్ని శాఖల కార్యాలయాలను ప్రారంభించారు. ప్రారంభం నాటి నుంచి కొన్ని కార్యాలయాలు తాళం తీయకుండానే దర్శనమిస్తున్నాయి. ప్రజలకు అతి కీలకమైన పంచాయతీ రాజ్ శాఖకు అధికారులను కేటాయించకపోవడంతో అందుబాటులో అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏడు గ్రామాలు.. ముగ్గురు అధికారులు వీర్నపల్లి మండలంలో అడవిపదిర, రంగంపేట, గర్జనపల్లి, వన్‌పల్లి, మద్దిమల్ల, కంచర్ల, వీర్నపల్లి గ్రామాలన్నాయి. ప్రస్తుతం ఆ మండల పరిధిలో తహసీల్దార్, ఎస్సై, ఐకేపీ ఏపీఎం మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలను విభజించకపోవడం గమనార్హం. పంచాయతీరాజ్, నీటి పారుదల, విద్య, వైద్యం, వ్యవసాయ శాఖకు ఇన్చార్జీ అధికారులే కొనసాగుతున్నారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ పథకాలకు దూరం ఆయా శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేక.. ఇన్చార్జీలు అందుబాటులో ఉండక సంక్షేమ పథకాలకు మండల ప్రజలు దూరమవుతున్నారు. మండలంలో ఏడు గ్రామపంచాయతీలతో పాటు 28గిరిజన తండాలుండగా వీరంతా ప్రతి పనికి ఎల్లారెడ్డిపేటకు రావాల్సి వస్తుండడంతో వ్యయప్రయాసాలకు లోనవుతున్నారు. వెంటనే అన్ని శాఖలను విభజించి, పూర్తిస్థాయి అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వీర్నపల్లి మండలంలో అధికారుల నియామకం ప్రభుత్వ నిర్ణయం. కేవలం మూడు శాఖల అధి కారులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. కొన్ని శాఖలు ఇప్పటికీ బైఫర్గేషన్ కాలేదు. శాఖలను విడదీసి అక్కడ పూర్తిస్థాయి అధికారులను నియమించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. – చిరంజీవి, ఎంపీడీవో, ఎల్లారెడ్డిపేట -
ప్రేమ ఎంత మధురం..!
సిరిసిల్ల / కోల్‌సిటీ (రామగుండం) : ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోనా ఎన్నెన్నో కలలూ... ఎన్నెన్నో కథలూ...’ అంటూ ఓ సినీకవి ప్రేమ మాధుర్యంలోని అర్థాన్ని పాట రూపంలో ‘ప్రేమలేఖ’ను రాశాడు. అనుభవించే వారికి మాత్రమే ప్రేమలో ఉన్న మాధుర్యం అర్థమవుతుంది. ఫిబ్రవరి 14 ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల ప్రేమాలయంగా వర్ధిల్లుతోంది. దశాబ్దకాలంగా 30 జంటలు ఒక్కటయ్యాయి. వరకట్నాలు లేకుండా.. ఆదర్శ పెళ్లిళ్లు చేసుకున్నారు. అక్కడ కొట్లాటలు.. గొడవలు.. ‘పరువు’ హత్యలు కనిపించవు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం... మాది ఖమ్మం జిల్లా ఇల్లందు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 2006లో లావణ్యకు, నాకు సీటు వచ్చింది. కాలేజీలోనే ఒకరికొరం పరిచయమయ్యాం. మా పరిచయం ప్రేమగా మారింది. మా ప్రేమను సిన్సియర్‌గా మా పేరెంట్స్‌కు చెప్పాం. ఇద్దరం డాక్టర్లమయ్యాక.. 2012 నవంబర్ 29న పెద్దల సమక్షమంలో పెళ్లి చేసుకున్నాం. నాలుగేళ్ల క్రితం మాకు బాబు గౌతంచంద్ర పుట్టడంతో రెండు కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నాయి. – డాక్టర్ మహేందర్, డాక్టర్ లావణ్య, గోదావరిఖని మనసుపడ్డాం.. ఏకమయ్యాం మాది కులాంతర వివాహం. తెలియకుండా ప్రేమలో పడ్డాం. మాటలు కలిసి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను నిలబెట్టుకునేందుకు పెళ్లి చేసుకున్నాం. తొలుత ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పినా.. వారి మనసు మార్చి ఏకమయ్యాం. – ముచ్చర్ల శ్రీనివాస్– అనిత దంపతులు ఒకరినొకరం అర్థం చేసుకున్నాం.. మామధ్య పరిచయం ప్రేమగా మారింది. ప్రేమపెళ్లి చేసుకుని ఏకమయ్యాం. పరస్పర అవగాహనతో జీవిస్తున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం సంతోషాన్నిచ్చింది. స్థిరపడి పెళ్లి చేసుకోవాలి. – కుమ్మరి దిలీప్– శైలజ దంపతులు పెద్దలు ఆమోదిస్తేనే.. సంతోషం ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల ఆమోదం పొందితేనే బాగుంటుంది. ఇల్లు విడిచిపోవడం.. కష్టపడి ఇంటికి చేరడం బాగుండదు. అయిన వారి మధ్య ఆప్యాయంగా జీవించాలన్నదే మా లక్ష్యం. ఇన్నేళ్ల జీవితంలో పొరపొచ్చలు వచ్చినా.. కలిసి జీవించడం ఆనందంగా ఉంది. – వెల్గం నవీన్– సంధ్య దంపతులు ప్రేమ కానుకలు కరీంనగర్‌ఎడ్యుకేషన్: ప్రేమికుల రోజున ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇచ్చి పుచ్చుకునేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. జువెల్లరి ఐటమ్స్ పట్ల మక్కువ చూపిస్తున్నారు. లాకెట్, చేతి ఉంగరాలు, లవ్ ఆకారంలో ఉండే వెండి వస్తువులపై దృష్టి సారించి వాటిని అందజేస్తూ తమ ప్రేమను చాటుతున్నారు. – విజయేందర్రాజు, షాప్ నిర్వాహకుడు, కరీంనగర్ -
ముస్తాబాద్‌లో ఉద్రిక్తత
సిరిసిల్ల: జిల్లాలోని ముస్తాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇసుక లారీలను నిలిపివేయాలని, రోడ్డు ప్రమాదానికి సంబంధించి అధికార పార్టే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన గన్నె శంకరయ్య కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా కాంగ్రెస్ పార్టీ చెల్లించాలంటూ రాస్తారోకో నిర్వహించారు. పోటా పోటీ ధర్నాలతో ముస్తాబాద్ అట్టుడుకుతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వడదెబ్బతో వృద్ధుడు మృతి
సిరిసిల్ల: తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించాడు. అప్పుడే వడ దెబ్బతో మృతిచెందుతున్న సంఘటనలు షురూ అయ్యాయి. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పసుల బాణయ్య(60) వడదెబ్బతో మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురువారం పొద్దంతా పొలంలో పనిచేసి రావడంతో వడదెబ్బ తగిలి రాత్రి మృతిచెందాడని స్థానికులు చెబుతున్నారు.