
మాట్లాడుతున్న చొక్కాల రాము
సిరిసిల్లటౌన్: పేదప్రజల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సేవలు అనిర్వచనీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము అన్నారు. శనివారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేటు వైద్యం ఉచితంగా అందించిన ఘనత ఆయనదేనన్నారు. ఆ మహానేత ఎప్పటికీ ప్రజల మదిలో చిరస్మరణీయులుగా ఉంటారన్నారు. ఆదివారం జనహృదయ నేత రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుంటుక సంపత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి అనిల్, బీసీ సెల్ అధ్యక్షుడు పల్లె రవి, జిల్లా కార్యదర్శి బిజ్జు శ్రీనివాస్, జిల్లా రైతుసెల్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దాయి శ్రీనివాస్, అజిత్, క్యాతం శ్రీనివాస్, తొర్ర రాజు, కొత్వాల రవి, క్యాతం ప్రసాద్, గుండేటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment