chokkala ramu
-
రాజన్న సేవలు అనిర్వచనీయం
సిరిసిల్లటౌన్: పేదప్రజల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సేవలు అనిర్వచనీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము అన్నారు. శనివారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేటు వైద్యం ఉచితంగా అందించిన ఘనత ఆయనదేనన్నారు. ఆ మహానేత ఎప్పటికీ ప్రజల మదిలో చిరస్మరణీయులుగా ఉంటారన్నారు. ఆదివారం జనహృదయ నేత రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుంటుక సంపత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి అనిల్, బీసీ సెల్ అధ్యక్షుడు పల్లె రవి, జిల్లా కార్యదర్శి బిజ్జు శ్రీనివాస్, జిల్లా రైతుసెల్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దాయి శ్రీనివాస్, అజిత్, క్యాతం శ్రీనివాస్, తొర్ర రాజు, కొత్వాల రవి, క్యాతం ప్రసాద్, గుండేటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం పోరు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము సిరిసిల్ల టౌన్ : పేదవిద్యార్థుల ఉన్నత చదువుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదలలపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో పేదవిద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి పక్షాన తమ పార్టీ నిరంతర పోరాటం సాగిస్తుందని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నిర్వహించే ఫీజుపోరు దీక్షకు జిల్లా నుంచి విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు భారీసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు గుంటుకు సంపత్, మండల అధ్యక్షులు వంగరి అనిల్, బండి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.