సంక్షేమానికి మారుపేరు వైఎస్సార్‌ | YSR Anniversary Birthday Celebration At Lotus Pond | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 9 2018 1:30 AM | Last Updated on Mon, Aug 20 2018 6:10 PM

YSR Anniversary Birthday Celebration At Lotus Pond - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలోనే సంక్షేమానికి మారుపేరుగా పేరొందిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వైఎస్‌ 69వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. అప్పట్లో రాష్ట్రంలో ఏదైనా పథకం ప్రారంభిస్తే అది చిరస్థాయిగా నిలిచే విధంగా వైఎస్సార్‌ ఆలోచనా విధానం ఉండేదన్నారు. మహానేత హయాంలో చేపట్టిన పథకాలు ఆయన మరణించాక కూడా పాలక ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని ఉదహరించారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతుల కళ్లలో సంతోషం చూసిన ఏకైక సీఎం ఒక్క వైఎస్సార్‌ మాత్రమేనని కొనియాడారు.  

పేదవాడు కష్టాలు మర్చిపోయి హాయిగా నిద్రపోయే రోజులు మళ్లీ రావాలంటే అది వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని బొత్స అన్నారు. వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా యావన్మంది ప్రజలు వైఎస్సార్‌ను తలచుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌ మొదలు పెట్టిన యజ్ఞాన్ని ఆయన వారసుడు జగన్‌ త్వరలో పూర్తిచేస్తారని చెప్పారు. ఆయన పాదయాత్రతో ఏపీకి మళ్లీ మంచిరోజులు వస్తాయన్న విశ్వాసం ప్రజల్లో పెరుగుతోందన్నారు. 2019లో రాజన్న పాలన వస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మహానేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు.  

అంతకుముందు పార్టీ నేతలు వైఎస్‌ విగ్రహానికి నివాళులర్పించి భారీ కేక్‌ కట్‌ చేశారు. పార్టీ నేత డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి ఏర్పాటుచేసిన చీరలను మహిళలకు, అంధులకు స్టిక్స్, బ్యాగులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జాతీ య కార్యదర్శి రెహమాన్, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, విజయచందర్, ప్రపుల్లారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ వెంకట్‌ మేడపాటి, బొడ్డు సాయినాథ్‌ రెడ్డి, నాగదేశి రవికుమార్, బి. మోహన్‌కుమార్, వెల్లాల రామ్మోహన్, బండారు వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, కె. ప్రభాకర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి  పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement