
సాక్షి, శ్రీకాకుళం : ఆర్టికల్ 370 రద్దు గొప్ప చారిత్రక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇన్నాళ్లు కశ్మీర్ నిప్పుల కుంపటిలా మండిపోయిందని, ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ భారతదేశం భూభాగంలో అంతర్భాగంగా మారిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన నత్తనడకన సాగుతుందని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ తలుపులు మూసేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.