'కన్నా ఎంపీగా పోటీ చేస్తే ... సపోర్ట్ చేస్తా' | If kanna lakshminarayana contest in MP, i will support, says rayapati sambhasivarao | Sakshi
Sakshi News home page

'కన్నా ఎంపీగా పోటీ చేస్తే ... సపోర్ట్ చేస్తా'

Published Mon, Feb 3 2014 3:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'కన్నా ఎంపీగా పోటీ చేస్తే ... సపోర్ట్ చేస్తా' - Sakshi

'కన్నా ఎంపీగా పోటీ చేస్తే ... సపోర్ట్ చేస్తా'

వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ పోటీ చేస్తే తనకేమీ అభ్యంతరం లేదని గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు.

గుంటూరు : వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ పోటీ చేస్తే తనకేమీ అభ్యంతరం లేదని గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తాను పోటీ నుంచి తప్పుకుని కన్నాకు మద్దతు పలుకుతానని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా మళ్లీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తామని  రాయపాటి తెలిపారు.

ఈసారి 100-150మంది ఎంపీల మద్దతు ఉంటుందని చెప్పారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టే అవకాశమే లేదని, బీజేపీ కూడా తన  వైఖరికి మార్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు.. ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలంతా రాష్ట్రపతిని కలిసి బిల్లును ఆమోదించవద్దని కోరతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement