కాంగ్రెస్, బీజేపీ దోబూచులాట | Congress, BJP match fixing on Telangana Bill, Opposition Allegation | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీ దోబూచులాట

Published Thu, Feb 20 2014 1:08 PM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM

కాంగ్రెస్, బీజేపీ దోబూచులాట - Sakshi

కాంగ్రెస్, బీజేపీ దోబూచులాట

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ దోబూచులాట ఆడుతున్నాయని విపక్షాలు ఆరోపించాయి. లోక్సభలో పెట్టిన విభజన బిల్లును యధాతథంగా రాజ్యసభలో ఆమోదించేందుకు బీజేపీ అంగీకరించడాన్ని తప్పుబట్టాయి. కేంద్రం నోటి మాటగా ఇచ్చిన హామీలను నమ్మి బిల్లుకు మద్దతు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించడం శోచనీయమని పేర్కొన్నాయి.

సవరణలపై పెద్దల సభలో ప్రధాని ప్రకటన చేస్తారనగానే బీజేపీ మెత్తబడడంతో.. రెండు పార్టీలు దొందూదొందే నంటూ విపక్షాలు ఆక్షేపించాయి. రెండు పార్టీలు భాయ్‌భాయ్‌ అంటూ ముందుకు సాగుతున్నాయని ఆరోపించాయి. బిల్లు ఆమోదం కోసం దుష్ట సంప్రదాయాలకు నాంది పలికాయని సమాజ్వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) విమర్శించాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement