ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
ద్రోహానికి ఒడిగట్టిన వారిని ఎదిరిద్దాం
ఏపీ విద్యార్థి జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
యూనివర్సిటీ : సమైక్య ఉద్యమానికి పురిటిగడ్డ అయిన ఎస్కేయూ వేదికగా మరో సమరానికి సన్నద్ధమవుదామని వక్తలు పిలుపునిచ్చారు. ఏపీ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం ఎస్కేయూలోని బోధనేతర సంఘం కార్యాలయంలో ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించా రు. రాష్ట్ర ప్రజల్లోని మంచితనం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీలు ద్రోహానికి ఒడిగడుతున్నాయని వక్తలు మండిపడ్డారు. కళ్ల ముందు జరుగుతున్న ఈ దారుణాన్ని చూస్తూ మౌనం గా ఉంటే భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ కార్యాచరణను రూపొందించారు.
ఏపీకి ఏ లోటూ రానీయమన్నారు
రాష్ట్ర విభజనకు ముందు ఏపీకి ఏ లోటూ రానీయమంటూ కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా అలివిగాని వాగ్దానాలు ఇచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేశారు. దశాబ్దం పాటు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు రాజ్యసభ సాక్షిగా ప్రకటించారన్నారు. రాయలసీమతో పాటు ఉత్తరాం ధ్రలో ప్రతిష్టాత్మక విద్య, వైద్య సంస్థలు నెలకొల్పుతామని ఇచ్చిన హామీలనూ నెరవేర్చడం లేదన్నారు. తామేమీ గొంతె మ్మ కోర్కెలు కోరడం లేదని, ఆనాడు పార్లమెంటులో చెప్పిన ప్రకారం హామీ లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని యువకులు, విద్యావంతులు సహకారంతో చేస్తేనే ఫలితం ఉంటుందన్నారు.
రాజ్యాంగ సవరణ అక్కర్లేదు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను బేరీజు వేసుకుంటూ రాష్ట్రానికి మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. 11 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రత్యేక హోదాను ఏపీ దగ్గరికొచ్చేసరికి సాంకేతిక సమస్య పేరిట పక్కనపెట్టడం నీతిమాలిన చర్య అన్నారు.
ప్రత్యేక హోదా ఉద్యమం చరిత్రలో నిలిచిపోవాలి
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి చేకూరుతుందో సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా వివరించాల్సిన అ వసరముందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయపాల్ యా దవ్ అన్నారు. ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు. ఇప్పుడు ఆ బిడ్డను కూడా చం పాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంద’ని మండిపడ్డారు. మొదట వర్సిటీ స్థాయిలో కమిటీలను వేసి అన్ని వర్సిటీలను సమన్వయం చేసి.. ఉద్యమాన్ని విస్తరించాల్సిన అవసరముందన్నారు.
రాజకీయ పార్టీలది కప్పదాటు వైఖరి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వైఖరి.. అధికారంలో ఉన్నప్పుడు మరో వైఖరితో రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొంటున్నాయని ఎస్కేయూ జేఏసీ కన్వీనర్ డాక్టర్ ఎన్‌ఆర్ సదాశివారెడ్డి మండిపడ్డారు. ఓట్ల రాజకీయాలను పక్కనబెట్టి ప్రత్యేక హోదా కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా ఉన్న ఖ్యాతిని తిరిగి నిలబెట్టాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, పార్టీ నాయకుడు వేమయ్య యాద వ్, సీపీఐ (ఎంఎల్) నాయకులు పెద్దన్న, నారాయణస్వామి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు రషీద్, ఏపీ విద్యార్థి జేఏసీ కన్వీనర్ కృష్ణయాదవ్, ఆచార్య డి.ఆంజనేయులు, ఎస్కేయూ విద్యార్థి నాయకులు పులిరాజు, క్రాంతికిరణ్, సురేష నాయు డు, చిన్నశంకర్ నాయక్, సుబ్బరాయు డు, నరేష్, జగదీష్ , అక్కులప్ప, మధు, గంగార్జున తదితరులు పాల్గొన్నారు.
మరో సమరానికి సన్నద్ధం
Published Fri, Jun 5 2015 4:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement