కన్నా లక్ష్మీనారాయణకు అవమానం | Kanna Lakshminarayana Faces Bitter Experience In Gannavaram airport | Sakshi
Sakshi News home page

కన్నా లక్ష్మీనారాయణకు అవమానం

Published Sun, Feb 10 2019 10:18 AM | Last Updated on Sun, Feb 10 2019 1:13 PM

 Kanna Lakshminarayana Faces Bitter Experience In Gannavaram airport - Sakshi

విజయవాడ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. జాబితాలో ఆయన పేరు లేదంటూ.. కన్నా లక్ష్మీనారాయణను విమానాశ్రయం లోనికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోనికి అనుమతించకపోవడంతో సాధారణ ప్రయాణికులు వేచి ఉండే ఎయిర్‌పోర్టు లాంజ్​లో కన్నా లక్ష్మీనారాయణ కూర్చున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టింది. నల్ల జెండాలు, బెలూన్లు, ఖాళీ కుండలతో నిరసన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement