సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు రాష్ట్రప్రభుత్వం వన్‌టైం సహాయం కింద రూ. 5వేల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లలో జమచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్‌ను నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కన్నా ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారో చెప్పాలి. గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేసినందుకు మీరు నిరాహార దీక్ష చేస్తున్నారా..? టీటీడీ ఆస్తుల పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నా నూజివీడులో వెంకటాచలం భూములు 18 ఎకరాలు కబ్జా గురించి కొద్దీ రోజుల్లో బయట పెడతాం. మా ప్రభుత్వాన్ని కించపరచాలని చూస్తే ఊరుకునేది లేదు.’ అని మండిపడ్డారు. చదవండి: ‘ఆలయాలను కూల్చిన నీచుడు చంద్రబాబు’
అన్ని మతాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం మాది: మల్లాది విష్ణు
‘‘నూజివీడులో నీ కబ్జా కోరు నిజస్వరూపం త్వరలోనే బయటకు తెస్తాం. హిందూ మతం వ్యతిరేకం అంటూ మా పై దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని మతాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం మాది అంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ధ్వజమెత్తారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్‌డౌన్ కారణంగా మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు 5000 నగదు ఇవాళ అకౌంట్ లో పడింది. సీఎం వైఎస్ జగన్ ఎవరికి ఇబ్బంది వచ్చిన సాయానికి ముందుకు వచ్చారు.
కానీ ఇవేమీ పట్టని కన్నా ఏసీలో కూర్చొని దీక్షలు చేస్తూ ప్రజలు తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో భూముల అమ్మకం నిర్ణయం చేస్తే దాన్ని మా సీఎం రద్దు చేశారు. ఎటువంటి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే హిందూ మతం వ్యతిరేకం అంటూ మా పై దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, మీరు కలిసి చేసిన పాపానికి ప్రాయచ్చిత్తంగా మీరు దీక్షలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక్కడి పరిస్థితి తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు ఈ విషయాలపై అప్పటి మీ మంత్రి మాణిక్యాలరావును ప్రశ్నించండి’’ అని మల్లాది విష్ణు హితువు పలికారు.
చదవండి: లాక్‌డౌన్ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్
Comments
Please login to add a commentAdd a comment