
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, అమరావతి : తెలుగు దేశం పార్టీ అవినీతిని ప్రశ్నిస్తే నాలుకలు కోస్తారా అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల కోసం వారం రోజుల రిలే నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. ఏపీలో అవినీతి పాలన జరుగుతోందని విమర్శించారు. ఏపీకి ద్రోహాం చేసిన కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవటం హాస్యాస్పదమన్నారు.
హాయ్ లాండ్ కాజేసేందుకు చంద్రబాబు ఏకంగా అగ్రిగోల్డ్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పోలీసు భద్రత లేకుండా టీడీపీ నేతలు ప్రజల్లో తిరగలేరని ఎద్దేవా చేశారు. మరోసారి టీడీపీకి అధికారం కట్టబెడితే ఏపీని చంద్రబాబు అమ్మేస్తారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment