
సాక్షి, గుంటూరు : తనకు ఎంతో అనుభవం ఉందని, తానైతేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అవినీతి పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
2018 వరకూ మోదీ మంచివాడన్న చంద్రబాబు.. తరువాత చెడ్డవాడు అని ఎలా అయ్యాడో చెప్పాని డిమాండ్ చేశారు. చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని అందుకే కశ్మీర్‌లోని అరాచక వాదులతో ఏపీలో ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఓటు వేసినట్లేనన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అత్యంత అవినీతిపరుడని, నియోజకవర్గంలో నీరు, మట్టి, క్వారీలు, ఇసుకను అక్రమంగా తరలించి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment