
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు 31 మంది సభ్యులతో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కమిటీని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీకి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పేర్కొంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, రాజన్నదొర, అంజద్ బాషా, పుష్పవాణి, ఆదిమూలపు సురేష్, దువ్వూరి కృష్ణ, సాంబశివారెడ్డి, కురసాల కన్నబాబు, ఇక్బాల్, వెలంపల్లి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్, నాగిరెడ్డి, సంజీవ్‌కుమార్, రంగయ్య, కిష్టప్ప, సుచరిత, నందిగం సురేష్, జంగా కృష్ణమూర్తి, తమ్మినేని సీతారాం, సజ్జల రామకృష్ణారెడ్డి మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా కొనసాగుతారని పార్టీ పేర్కొంది. ఈ కమిటీ 26వ తేదీన విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమవుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment