
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిమితులయ్యారు. విప్‌గా గంగుల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిమితులైన విషయం తెలిసిందే. అలాగే మండలిలో టీడీపీ పక్ష నేతగా యనమల రామకృష్ణుడును ఖరారు చేస్తూ.. మండలి చైర్మన్ షరీష్ అహ్మద్ సభలో ప్రకటించారు.