legislative counsil
-
3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: శాసనసభ సోమవారం మూడు బిల్లులను ఆమోదించింది. కార్పొరేట్, ఇతర పెద్ద కంపెనీలు రాష్ట్రంలో తమ ఫ్రాంచైజీలు, డీలర్లకు లైసెన్సు ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన భారత (ఏపీ) స్టాంపు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంలో ఏకరూపత ఉండేలా సంబంధిత కమిటీల్లో ఉన్నత విద్య, ఆర్థిక శాఖాధికారులను నియమించేందుకు ఉద్దేశించిన ఏపీ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును, క్యాంపస్‌ల వారీగా ఉన్న నియామక ప్రక్రియ, రోస్టర్ నిర్ణయాన్ని యూనివర్సిటీ ప్రాతిపదికగా చేసే అధికారాన్ని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి దఖలుపరిచే సవరణ బిల్లును సభ ఆమోదించింది. కాగా, మరో ఐదు బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఏపీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఏపీ సర్వే, సరిహద్దుల చట్ట సవరణ బిల్లు, ఏపీ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల చట్ట సవరణ బిల్లు, ఏపీ కౌలుదారీ (ఆంధ్ర ప్రాంత) రద్దు చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీల చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం అసెంబ్లీలో ఆమోదించిన నాలుగు బిల్లులను శాసన మండలిలో సభ్యులు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ సివిల్ సరీ్వసెస్ (డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్) (రద్దు) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ (వ్యవసాయ ఉత్పత్తి, పశువుల) మార్కెట్లు (సవరణ) బిల్లు–2022లను మండలి ఆమోదించింది. ఇదీ చదవండి: ఏపీ అసెంబ్లీకి ఫోన్ ట్యాపింగ్ హౌస్ కమిటీ నివేదిక -
ఎమ్మెల్సీగా పోతుల సునీత ఎన్నిక
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి తన కార్యాలయంలో ధువ్రీకరణ పత్రాన్ని పోతుల సునీతకు గురువారం అందజేశారు. శాసన సభ్యుల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో పోతుల సునీత ఒక్కరే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి ప్రకటించి, ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. -
ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న సునీత ఆయనకు ధన్యవాదాలు తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, ఆదిమూలపు, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల అధికారికి సోమవారం నామినేషన్ పత్రాన్ని సమర్పించగా.. నేడు ఆమోదం లభించింది.(చదవండి: 'బలహీన వర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు') -
ఎమ్మెల్సీ అభ్యర్థిగా సునీత నామినేషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, ఆదిమూలపు, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇంతకుముందుసీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న సునీత ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
కోవిడ్‌పై త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాం
సాక్షి, అమరావతి : నిర్ధారణ పరీక్షలు చేస్తేనే కరోనా వైరస్‌ను కట్టడి చేయగలమని భావించామని, టెస్టులు నిర్వహించటంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. కోవిడ్‌పై త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్లామని చెప్పారు. కరోనా ప్రారంభంలో రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ కూడా లేదని, 8 నెలల్లోనే 150 నిర్ధారణ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి.. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై శాసనమండలిలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో 6 దశల్లో ప్రతి ఇంటిని ఆరుసార్లు సర్వే చేశాం. హోం ఐసోలేషన్‌లో ఉన్న 5 లక్షల 50 వేల మందికి హోం కిట్లను అందచేశాం. కరోనా నేపథ్యంలో వైద్యం కోసం 22 వేల మందిని తాత్కాలికంగా నియమించాం. వారిలో ఇప్పటివరకు ఏ ఒక్కరిని కూడా తొలగించలేదు. ( లాభాల్లో బోనస్ మహిళలకే: సీఎం జగన్) తాత్కాలిక సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు 232 కోట్ల రూపాయలు విడుదల చేశాం. త్వరలో మరో 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం. కోవిడ్ ట్రీట్మెంట్కు అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకున్నాం. దేశంలోనే కోవిడ్ ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలోకి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆగస్టు నెలలో కరోనా పాజిటివ్ రేటు 17.2 ఉంటే ప్రస్తుతం 8.63 రేటుకు తగ్గించాం. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 93.68 ఉంటే మన రాష్ట్రంలో 97.86గా ఉంది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.46 ఉంటే మన రాష్ట్రంలో 0.81గా ఉంద’’ని తెలిపారు. -
మండలిలో బాబు ‘మనసులో మాట’ వివాదం
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో తెలియని వ్యక్తని, ఆయన ఎక్కడ ఏ పంట పండుతుందో చెబితే తాను తలదించుకుని కూర్చుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నివర్ తుఫాను పంట నష్టం, ప్రభుత్వ చర్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స.. లోకేష్‌పై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ..‘‘ ట్రాక్టర్ ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు. రైతుల ట్రాక్టర్‌ను బురద గుంటలోకి పోనివ్వటం తప్ప లోకేష్‌కు ఏం తెలుసు?. ( నటించడం మా సీఎంకు రాదు: కన్నబాబు ) ట్రాక్టర్‌ను బురదలో దింపడమే కాకుండా దాన్ని రైతులతో బయటికి తీయించుకున్న వ్యక్తి లోకేష్. చంద్రబాబు నాయుడు మనసులో మాట అనే పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాశారు. ఆ పుస్తకం తెస్తే చంద్రబాబు వ్యవసాయం గురించి ఏం మాట్లాడారో చూపిస్తాం. చైర్మన్ అవకాశమిస్తే టీవీలో కూడా వేసి చూపిస్తాం’’అని అన్నారు. ఆ పుస్తకం ఆన్లైన్లో కూడా తొలగించారు : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు తన అభిప్రాయాలతో వెలువరించిన 'మనసులో మాట' అనే పుస్తకంలో వ్యవసాయం దండగ అంటూ రాసుకున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందంటూ గతంలో ఎద్దేవా చేశారు. ఇప్పుడే నెట్లో కొట్టి చూశా.. మనసులో మాట పుస్తకం ఆన్లైన్లో కూడా తొలగించారు. మనసులో మాట పుస్తకం ఇంట్లో ఉంటే లోకేష్ దాన్ని తీసుకువస్తే.. చంద్రబాబు అన్న మాటలు చూపిస్తాం. వ్యవసాయంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందునే మనసులో మాట పుస్తకాన్ని మార్కెట్లో దొరకకుండా చేశారు’’ -
చట్టసభలోకి బాలీవుడ్ బ్యూటీ.!
సాక్షి, ముంబై : బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ త్వరలో చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు. మహారాష్ట్ర శాసనమండలికి జరుగనున్న ఎన్నికల్లో అధికార శివసేన నుంచి ఆమెను ఎగువసభకు ఎన్నికకానున్నారు. మండలిలో ఖాళీ కానున్న 12 స్థానాలకు గవర్నర్ కోటాలో ఊర్మిళను నామినేట్ చేస్తారని శివసేన వర్గాల ద్వారా తెలిసింది. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు శుక్రవారం సమావేశమైన మహా వికాస్ ఆఘాడీ నేతలు ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా వస్తున్న వార్తలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఊర్మిళను మండలికి నామినేట్ చేస్తున్నారనే వార్తలు వాస్తమేనన్నారు. అయితే దీనిపై మూడు పార్టీల నేతలు మరోసారి చర్చించి.. అనంతరం అభ్యర్థులు జాబితాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపుతామన్నారు. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని రౌత్ స్పష్టం చేశారు. ఈ జాబితాలో మరాఠీ నటుడు ఆదేష్ బండేకర్, సింగర్ ఆనంద్ షిండేతో పాటు సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకు రాజీనామా చేసిన ఖడ్సే ఇటీవల ఎన్సీపీలో చేరారు. దీంతో ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఊర్మిళ మటోండ్కర్ అయిదు నెలలు తిరక్కముందే కాంగ్రెస్‌ను వీడారు. (డ్రామాలాడుతున్న కంగనా : ఉర్మిళ) పార్టీలో అంతర్గత రాజకీయాలే తన రాజీనామాకు దారి తీశాయని, పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. స్థానిక నాయకుల మధ్య సమన్వయ లేమి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడగట్టడం, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు నిధులు అందించడం వంటివి సరిగా చేయలేదని నిందించారు. గత మార్చిలో కాంగ్రెస్ గూటికి చేరిన ఆమె ముంబై ఉత్తరం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో 4.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం కొంతకాలానికే శివసేన గూటికి చేరారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల ముంబైపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఊర్మిళ మరోసారి వార్తల్లో నిలిచారు. -
రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి, కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్వో వ్యవస్థ రద్దు చేశామని తెలిపారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమే అని పేర్కొన్నారు. దీంతో పీటముడి పడిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని వివరించారు. పలు చట్టాల సమాహారంగా రెవెన్యూ చట్టం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. సోమవారం ఆరో రోజు తెలంగాణ వర్షాకాల శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలకు గంట సమయం కేటాయించారు. దీంతో మండలిలో కొత్త రెవెన్యూ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ బిల్లుపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి ఒక్కటే కాదు, మిగిలిన చట్టాలు కూడా ఉంటాయని వెల్లడించారు. దశాబ్దాలుగా జరుగుతున్న తప్పులను ఒక్కరోజులో సరిదిద్దడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. సమగ్ర సర్వేనే అన్ని సమస్యలకు పరిష్కారమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ధరను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్‌కు మాత్రమే ఎమ్మార్వోకు ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు. ధరణి ఒక్కటే కాదని.. మిగిలిన చట్టాలు కూడా ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, కార్మికుల ఇన్‌కమ్‌ట్యాక్స్‌ను రద్దు చేయాలని ప్రధానిని కోరామని చెప్పారు. కారుణ్య నియామకాల్లో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. అర్హులుంటే వెంటనే ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. -
క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ
సాక్షి, హైదరాబాద్ : కార్మిక శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం శాసన మండలిలో క్షమాపణలు చెప్పారు. ఆర్టీసీ అధికారులు... ప్రజా ప్రతినిధుల ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, వారికి సమాచారం అందివ్వకపోవడం తప్పేనని ఆయన అంగీకరించారు. మండలిలో ఆర్టీసీపై మంత్రి పువ్వాడ మాట్లాడుతూ...ఆర్టీసీ పార్సిల్ సర్వీసుల ద్వారా సంవత్సరానికి రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. నెలాఖరుకు 100 కార్గో బస్సులు సిద్ధం చేస్తామని అన్నారు. ఆర్టీసీకి రోజుకు కోటిన్నర లాభం వస్తోందని, మంత్రి పేర్కొన్నారు. గతంలో రూ. 11 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 12.50కోట్ల ఆదాయం వస్తుందన్నారు. గత రెండు నెలల నుంచి ఆర్టీసీ ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఆర్టీసీ సమ్మె కాలపు జీతాలు రూ. 235 కోట్లు చెల్లించడంపై ఆర్టీసీ జెఏసీ నాయకులే కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీసీఎస్ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం రూ. 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగాలని అధికారులకు సూచించామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించామని, జూలై నాటికి రూ. 20 కోట్లతో ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన బస్టాండ్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. కాగా ఎమ్మెల్సీల సీడీసీ నిధుల కోసం అందరూ సభ్యులకు లేఖలు రాయాలని మంత్రికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. వరంగల్‌ను టూరిస్ట్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ‘త్వరలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధిలో నిర్లక్ష్యం లేదు. రామప్ప ఐలాండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాము. తెలంగాణలోని అనేక ప్రాంతాలను పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తోంది. బోగత, మేడారం, తాడ్వాయి, సోమశిల, నాగార్జున సాగర్ వద్ద కాటేజ్‌ల నిర్మాణం, బోటింగ్ సౌకర్యం కల్పించాం. భద్రాచలం రాముని కల్యాణం సందర్భంగా హెలికాప్టర్ సేవలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాము’. అని పేర్కొన్నారు -
నిరుద్యోగ భృతి లేదు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కూడా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తామిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఐదేళ్ల సమయం ఉందని, వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతి ఏడాది చూస్తామన్నారు. ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సాధ్యం కాదన్నారు. శనివారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సీఎం సమాధానమిస్తూ.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం రాష్ట్రంలో కూడా 10% ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. భైంసాలో అల్లర్లలో నిజమైన బాధితుల వివరాలు అందజేస్తే సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 70 శాతానికి పైగా బలహీనవర్గాల వారు ఉన్నందున రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంతో పోరాడతామని, కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామని చెప్పారు. పీఆర్సీ కమిటీ గడువు ముగిసినా కొనసాగిస్తామని, సర్వీసు బుక్స్, ఇతర అంశాలను పూర్తిస్థాయి లో ప్రక్షాళన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వేతన సవరణ కోసం పీఆర్సీ ఆగలేదని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామన్నారు. గతం లో ఏపీ సీఎం కక్ష పూరితంగా వ్యవహరించారని, తాము మహారాష్ట్ర సీఎంతో ఏడుసార్లు భేటీఅయి ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. సంక్షేమ రంగంలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఐకేపీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 57 ఏళ్ల వయసు దాటిని వారికి వృద్ధాప్య పింఛన్లు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. నిరుద్యోగం ఉంటుందని, అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ ఉద్యోగ అవకాశాలు పొందేలా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు స్టడీసర్కిళ్ల ద్వారా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, ఐకేపీ కింద ఉన్న మూడు, నాలుగు వందల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. త్వరలో కోటి ఎకరాలకు నీరు.. ఏడాదిన్నర రెండేళ్లలోనే పూర్తిస్థాయిలో పాలమూరు, సీతారామ, దేవాదుల, కాళేశ్వరం పూర్తిస్థాయిలో పూర్తయితే కోటి ఎకరాలకు నీటిని అందిస్తామన్నారు. రైతు బీమా గొప్ప పథకమని, ఏ రైతు ఏ కారణంతో చనిపోయినా బీమా కల్పిస్తామని, ఈ పథకానికి ప్రీమియం మొత్తం రూ.600 కోట్ల నుంచి రూ.1,300 కోట్లకు పెరిగిందని, రైతుల సంఖ్య ఇంకా పెరిగినా ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. రైతు మరణించిన 10 రోజుల్లోగా అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. బతికున్నంత కాలం ఉచిత కరెంట్ కేసీఆర్ బతికున్నంత కాలం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని, రైతుబంధు, రైతుబీమా, కోటిఎకరాలకు నీరందించేలా నీటిపారుదల ప్రాజెక్టులు చేపడతామన్నారు. కల్తీలేని ఎరువులు,విత్తనాలు అందించేందుకు కఠినచర్యలు తీసుకుంటామని, కల్తీకి పాల్పడే దుర్మార్గులపై పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపుతామని తెలిపారు. మహిళల ఆత్మగౌరవానికి చిహ్నమైన డబుల్ బెడ్రూం ఇళ్లను 2.76 లక్షల మేర నిర్మాణం పూర్తిచేసి అందజేస్తామన్నారు. -
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కారును అనుసరించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చంద్రశేఖరరావు చెప్పారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంగ్లిష్ మీడియంలో తన కొడుకును చదివించడానికి ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్న విషయాన్ని ఓ మహిళా కూలీ చెప్పడాన్ని టీవీలో చూశానన్నారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ వచ్చి ఉండాలని అందరూ కోరుకుంటున్నారని, దీన్ని అమలు చేసేందుకు విద్యావేత్తలు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సమావేశాల తరువాత దీనిపై ఓ సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. ఆ సమావేశానికి తాను కూడా హాజరవుతానని, ఆ మీటింగ్‌లో వ్యక్తమైన సలహాలు, సూచనల్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా జీవిత ఖైదీలను కొందరిని విడుదల చేయాలన్న విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. -
ఆదాయం తగ్గుదలపై బుగ్గన వివరణ
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆదాయం తగ్గుదలపై శాసన మండలిలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష టీడీపీ చెప్పినట్లు రాష్ట్ర ఆదాయం 40 శాతం తగ్గలేదని.. కేవలం 8 శాతం మాత్రమే తగ్గిందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదాయం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయమేకాదు.. దేశ ఆదాయం కూడా తగ్గిందని బుగ్గన అన్నారు. ‘ఏ ప్రభుత్వమైనా ఐదారు కోట్లు బిల్లులు చెల్లించకుండా వెళ్ళడం పరిపాటే.. కానీ గత ప్రభుత్వం ఏకంగా 40 వేల కోట్లకుపైగా బిల్లులు చెల్లించలేదు. ఆరు నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన 20 వేల కోట్లు అప్పులు చెల్లించాం. 15 వ ఆర్ధిక సంఘం కింద నిధులను పెంచి ఇవ్వమని కేంద్రాన్ని అడుతున్నాం. గత సంవత్సరం జూలై, నుంచి డిసెంబర్ మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం 24 రోజులు ఓడీలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం జూలై నుంచి డిసెంబర్ మధ్యలో రెండు రోజులు మాత్రమే ఓడీలో ఉంది’ అని అన్నారు. అవినీతి రహిత పాలన కోసం చర్యలు: కన్నబాబు ఏసీబీ డీజీగా ఠాగూర్ పనిచేసిన సమయంలో అధికారులను ఉద్దేశ్యపూర్వకంగా వేధించారని తమకు ఫిర్యాదులు అందాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ‘ఈ వ్యవహారంపై ఉన్నత స్ధాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఠాకూర్ హైద్రాబాద్‌లో ఇళ్ళు, పార్కు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఏసీబీతో ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేయించారా లేక ఇతర కోణాల్లో చేశారా అన్న ఆరోపణలపై కూడా విచారిస్తున్నాం. అవినీతి రహిత పాలన కోసం సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
మండలిలో రాజేంద్రప్రసాద్ అసభ్య వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో గ్రామ సచివాలయాలపై వాడీవేడి చర్చ సాగింది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కొమ్ములొచ్చాయని అన్నారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్‌ది టీవీ చర్చల్లో అరే.. ఒరే అని బూతులు తిట్టించుకునే సంస్కృతి అని ఎద్దేవా చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రులు డిమాండ్ చేశారు. అనంతరం మండలిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా 4లక్షల 50వేల పైగా ఉద్యోగాలు ఇవ్వడం దేశంలో ఇదే ప్రథమం అని అన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత భారీస్థాయిలో ఉద్యోగాలు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. గ్రామ సచివాలయాలను ఎప్పుడో ఏర్పాటు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. మరి సచివాలయ వ్యవస్థను ఎందుకు అమలు చెయ్యలేదు. గ్రామ సచివాలయాల వ్యవస్థల వల్ల సర్పంచ్ల అధికారాలు దెబ్బతింటాయని టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీల అధికారాలను జన్మభూమి కమిటీలు హరిస్తే ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు. హజ్ భవన్ స్థలం కోసం అన్వేషణ: డిప్యూటీ సీఎం మండలిలో డిపప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఇమాంలు, మౌజన్లకు 2020 మార్చిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ‘ 9వేలమంది ఇమాంలు, 9వేల మంది మౌజన్ లు ఉన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులను తీసుకుంటున్నాం. విజయవాడలో హజ్ భవన్ పేరుతో చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. తర్వాత పట్టించుకోలేదు. చంద్రబాబు శంఖుస్థాపన చేసిన హజ్ భవన్ కు రెండు వైపులా శ్మశానాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హజ్ భవన్ కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం 5వేలమంది ఇమాంలు, మౌజన్ లకే గౌరవ వేతనం అందించారు. మేము అర్హులైన అందరికీ గౌరవ వేతనం ఇస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం’ అని అన్నారు. -
కాల్‌మనీ కేసుల్లో రూ.700 కోట్ల వ్యాపారం
సాక్షి, అమరావతి: కాల్‌మనీ కేసుల్లో మొత్తం రూ. 700 కోట్ల వ్యాపారం జరిగిందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శాసన మండలిలో కాల్ మనీ కేసులకు సంబంధించిన అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం సమాధానమిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 కాల్ మనీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. విజయవాడలో 14, పశ్చిమ గోదావరిలో మూడు, కడపలో ఒక కేసు నమోదైనట్టు వివరించారు. విజయవాడలో ఈ కేసులకు సంబంధించి మొత్తం 30 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో ఏడుగురిపై రౌడీషీటు ఓపెన్ చేసినట్టు తెలిపారు. కాల్ మనీ వ్యవహారానికి వ్యతిరేకంగా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం కాల్ మనీ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. బీసీల కోసం 139 కార్పొరేషన్లు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం మొత్తం 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా వెనుకబడిన కులాలకు సంబంధించిన అనేక మంది తమ సమస్యలు తెలుసుకున్నారని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసన మండలి సభ్యులు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. -
మండలి చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిమితులయ్యారు. విప్‌గా గంగుల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిమితులైన విషయం తెలిసిందే. అలాగే మండలిలో టీడీపీ పక్ష నేతగా యనమల రామకృష్ణుడును ఖరారు చేస్తూ.. మండలి చైర్మన్ షరీష్ అహ్మద్ సభలో ప్రకటించారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: పట్టుభద్రుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఎంపిక చేసినట్లు టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకర్గం నుంచి జీవన్ రెడ్డిని బరిలో నిలుపుతున్నట్ల ఉత్తమ్ తెలిపారు. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి జీవన్ రెడ్డి పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్నా.. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆయనను పోటీలో నిలపాలని డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ ఆయనను బరిలో నిలిపింది. ఈ స్థానం కోసం కాంగ్రెస్ నుంచి చాలామంది పోటీపడగా.. అధిష్టానం జీవన్ రెడ్డికే మెగ్గుచూపింది. కాంగ్రెస్‌తో సీనియర్ నేతైన జీవన్ రెడ్డి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల స్థానం నుంచి పోటీచేసి అనూహ్యంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా రేపు జీవన్‌రెడ్డిని అధికారికంగా ప్రకటిస్తామని ఉత్తమ్ తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఒక స్థానం కోసం అభ్యర్థిని ఈరోజు రాత్రి నిర్ణయిస్తామని వెల్లడించారు. పార్లమెంట్ అభ్యర్థులపై టీపీసీసీ ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తయ్యిందనీ, డీసీసీలు పంపిన జాబితాపై చర్చించి షార్ట్ లిస్ట్‌ను తయారుచేశామని ఉత్తమ్ పేర్కొన్నారు. -
మేమూ ఎమ్మెల్సీకి పోటీ చేస్తాం: భట్టి
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకూ సంఖ్యా బలం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సంఖ్యా బలం లేకున్నా ఐదుగురిని నిలబెడుతామని సీఎం కేసీఆర్ ఎలా చెబుతా రని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. పార్టీ నేతలతో మాట్లాడి 3 రోజుల్లో తమ అభ్యర్థిని ఖరారు చేస్తామని భట్టి తెలిపారు. స్పీకర్ పోస్టుకు పోటీకి తమకు సరైన బలం లేదు కాబట్టే ఏకగ్రీవానికి సహకరించామన్నారు. బడ్జెట్ తీరు చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేనట్లు అనిపిస్తోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలను ఎక్కు వ రోజులు నిర్వహిస్తే ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందని, నిరుద్యోగ సమస్యపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై సభలో తమ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతారని భట్టి తెలిపారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఐదు స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీ చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంలకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాలు, లోక్‌సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉండే లంబాడీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అలాగే సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్‌సభ స్థానాల్లో అధిక సంఖ్యలో ఉండే కురుమ వర్గానికి చెందిన ఎగ్గే మల్లేశంను ఎంపిక చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న శేరి సుభాష్‌రెడ్డి ప్రస్తుతం ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీగా ఆయనకు సీఎం అకాశం కల్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మార్చి 12న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. కాంగ్రెస్ సైతం అభ్యర్థిని నిలిపితే పోలింగ్ జరుగుతుంది. -
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఐదు శాసనమండలి స్థానాలకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మంత్రి ఎండీ మహమూద్ అలీకి మరోసారి టీఆర్ఎస్ అధినేత అవకాశం కల్పించారు. రాష్ట్ర కురమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పేర్లను సీఎం శుక్రవారం ప్రకటించారు. మరోసీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాగా ముందుగా ఊహించినట్లుగానే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్ వీరి పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందుకు వారు కేసీఆర్‌ను ధన్యవాదులు తెలిపారు. -
నామినేషన్ వేసిన మంత్రి నారాయణ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ సోమవారం ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఈరోజు ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి సత్యనారాయణకు అందచేశారు. కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈనెల 21న ఎన్నిక జరగనుంది. 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణ ఉంది. ఇక అసెంబ్లీలో టీడీపీ మెజారిటీ ఉండటంతో నారాయణ ఎన్నిక ఖాయం కానుంది. కాగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారాయణను తన మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఉభయ సభల్లో వేటిలోనూ సభ్యుడు కారు. మంత్రిగా నియమితులైన వాళ్లు ఏదో ఒక సభలో ఆరు నెలల్లోగా సభ్యులు కావాలన్న నిబంధన ఉంది. -
పెద్దల సభకు నారాయణ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి త్వరలో జరిగే ఉప ఎన్నికలలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణను నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఒక స్థానానికి ఆగస్టు 21వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారాయణను తన మంత్రివర్గంలోకి జూన్ 8వ తేదీన తీసుకున్నారు. అయితే ఆయన ఉభయ సభల్లో వేటిలోనూ సభ్యుడు కారు. మంత్రిగా నియమితులైన వాళ్లు ఏదో ఒక సభలో ఆరు నెలల్లోగా సభ్యులు కావాలన్న నిబంధన ఉంది. మరోవైపు, శాసన మండలికి మే 21వ తేదీన కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేశారు. దాంతో అప్పటినుంచి ఆ సీటు ఖాళీగా ఉంది. ఆ స్థానానికి నారాయణనే నిలబెట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఈ ఉప ఎన్నికకు ఆగస్టు నాలుగో తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. ఆగస్టు 11వ తేదీలోగా నామినేషన్లు దాఖలుచేయాలి. ఉపసంహరణకు తుదిగడువు ఆగస్టు 14. అవసరమైతే 21వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. అసెంబ్లీలో తమకు మెజారిటీ ఉండటంతో నారాయణ ఎన్నిక ఖాయమని టీడీపీ భావిస్తోంది.