ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం | YSRCP Candidate Pothula Sunitha Unanimously Elected As MLC | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

Published Tue, Jan 19 2021 6:57 PM | Last Updated on Tue, Jan 19 2021 7:29 PM

YSRCP Candidate Pothula Sunitha Unanimously Elected As MLC - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది.

కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న సునీత ఆయనకు ధన్యవాదాలు తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, ఆదిమూలపు, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల అధికారికి సోమవారం నామినేషన్‌ పత్రాన్ని సమర్పించగా.. నేడు ఆమోదం లభించింది.(చదవండి: 'బలహీన వర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement