pothula sunitha
-
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: పోతుల సునీత
-
మీ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయి: పోతుల సునీత
-
వాళ్ళకి ఆ అర్హతే లేదు..! చంద్రబాబు,లోకేష్ కి
-
టీడీపీ నాయకులకు మహిళలంటే చిన్నచూపు: MLC పోతుల సునీత
-
సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది: ఎమ్మెల్సీ పోతుల సునీత
-
బాలకృష్ణకు పోతుల సునీత కొట్టినట్టు కౌంటర్ ఇచ్చింది
-
‘బాలకృష్ణా.. అప్పుడేమైంది నీ పౌరుషం?’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై అసెంబ్లీలో ఇవాళ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నాడంటూ ఏపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు స్కిల్ స్కామ్ అవినీతిలో కూరుకుపోయారు. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో యువతను చంద్రబాబు దోచుకున్నారు. అవినీతి చేయలేదని సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు అని అన్నారామె. ఇక ఇవాళ్టి సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యల పై చర్చించాడా?. కక్ష సాధింపుగానే చేయాలంటే.. ఈ నాలుగేళ్లలో ఎప్పుడో చంద్రబాబును అరెస్ట్ అయ్యేవాళ్లు కదా. మీ నాన్నను(దివంగత ఎన్టీఆర్) చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు నీ పౌరుషం ఏమైంది?.. మీ నాన్న పై చెప్పులు వేయించినపుడు ఎక్కడికి పోయింది పౌరుషం అంటూ బాలకృష్ణకు చురకలంటించారామె. టీడీపీ నేతలకు దమ్ముంటే.. టీడీపీ నేతలు రచ్చకోసమే అసెంబ్లీకి వస్తున్నారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి టీడీపీ నేతలు పారిపోతున్నారు. టీడీపీ నేతలు చర్చకు మాత్రమే సభకు రావాలి కానీ..రచ్చ కోసం మాత్రం వద్దు. టీడీపీ నేతలకు ఇదే నా సవాల్. రేపు సభలో స్కిల్ డెవలప్ మెంట్ పైన చర్చిస్తున్నాం. 26 న ఫైబర్ నెట్, 27 ఇన్నర్ రింగ్ రోడ్డు పై చర్చ ఉంది. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ నేతలు చర్చకు రావాలి. సభలో ఈరోజు బాలకృష్ణ నిజమైన సైకోలా కనిపించాడు :::ప్రభుత్వ విప్,కాపు రామచంద్రారెడ్డి కోటంరెడ్డి ఓవరాక్షన్ సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారు. స్పీకర్ ఛైర్ కు విలువ ఇవ్వకుండా సభాపతి పట్ల అమర్యాదగా నడుచుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పక్షాన చేరి ఓవరాక్షన్ చేశాడు. చంద్రబాబు ప్రజాధనం ఏవిధంగా లూటీ చేశారో కోర్టుకు అందించాం. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ వాదించినా కేసులో ఆధారాలున్నాయి కాబట్టే న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బాలకృష్ణ తొడలు కొడుతూ,మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించడం దురదృష్టకరం. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజాస్పందన వస్తుందని ఊహించి భంగపడ్డారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ను తెచ్చుకున్నారు. సభలో ప్రజల హక్కులను కాలరాసేలా టీడీపీ నేతలు వ్యవహరించారు. సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ నేతలు సభా మర్యాదలను పాటించలేదు. పయ్యావుల కేశవులు సెల్ ఫోన్ తో చిత్రీరించాలని చూశారు. సభ నుంచి బయటికి వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నం. టీడీపీ నేతలు మీసాలు తిప్పినా ..తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు. చర్చకు రమ్మని కోరితే వచ్చేందుకు టీడీపీ నేతలకు ధైర్యం లేదు. చర్చించేందుకు టీడీపీ నేతల దగ్గర విషయం లేదు. అందుకే సభలో అల్లరి చేస్ బయటికి పోవాలనే గందరగోళం సృష్టించారు. నేటి టీడీపీ నేతల తీరు శాసన సభ చరిత్రలోనే దురదృష్టకరం. :::మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ -
పవన్ పార్టీ జనసేన కాదు.. చంద్రసేన: ఎమ్మెల్సీ పోతుల సునీత
సాక్షి, గుంటూరు: మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. మంగళవారం ఆమె తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నాడని, ఆయనను ప్యాకేజీ నాయకుడిగానే ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘జగన్ ప్రభుత్వంలో మహిళలే మహరాణులుగా ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్‌కి ఇవేమీ కనపడవు. పవన్ వ్యక్తిగత జీవితం చూస్తేనే మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నాడో తెలుస్తుంది. నీ తల్లిని అవమానించిన వారితో ప్యాకేజీ బంధం ఏర్పాటు చేసుకున్నారు. నీ తల్లినే అవమానించావ్’’ అంటూ పోతుల సునీత దుమ్మెత్తి పోశారు. చదవండి: ఏపీ శ్రీలంక అయిపోతుందన్నావ్.. మరి ఇప్పుడేమో.. ఇదేంటి చంద్రబాబూ..? ‘‘పవన్‌కి బ్రెయిన్ లేదు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటం తప్ప మరేమీ తెలియవు. చంద్రబాబు జెండా, ఎజెండా పట్టుకుని తిరుగుతున్నావ్. పవన్‌ని దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్‌గా మాత్రమే జనం చూస్తున్నారు. మహిళల పుట్టుకనే అవమానం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి వత్తాసు పలుకుతున్నాడంటే ఎంత దిగజారుడు రాజకీయమో తెలుస్తోంది’’ అని దుయ్యబట్టారు. -
ఆ నీచ చరిత్ర చంద్రబాబుది: ఎమ్మెల్సీ సునీత
సాక్షి, అమరావతి: సీఎం జగన్ పేద, బడుగు వర్గాల వారి కోసం అను నిత్యం కష్టపడి పని చేస్తున్నారని, దీన్ని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు, ఆ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనితకు మా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే నీచ చరిత్ర చంద్రబాబుది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణే లేదు. అనిత అన్నం తింటుందా? గట్టి తింటుందా?. ఎందుకిలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు?. మహిళలే అనితకు, టీడీపీకి బుద్ది చెప్తారు. అనిత పచ్చకామెర్లతో బాధ పడుతోంది. అందుకే ఎన్సీఆర్బీ రిపోర్టుని కూడా కూడా పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. దిశ యాప్‌తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. సచివాలయాలలో మహిళా పోలీసులను కూడా జగన్ నియమించారు. పదవుల్లో సైతం మహిళకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. హోంమంత్రి, మండలి వైస్ ఛైర్మన్ లాంటి ముఖ్యమైన పదవుల్లో సైతం మహిళలే ఉన్నారు’’ అని పోతుల సునీత పేర్కొన్నారు. చదవండి: లెక్కలు తేలాలి.. పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు ‘‘పవన్, చంద్రబాబు, లోకేష్ వలంటీర్ల మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో తోక ముడిచారు. టీడీపీ మొదటి నుంచీ మహిళలను కించపరిచే పార్టీ. మహిళల పుట్టుక గురించే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. కానీ జగన్ మహిళలకు అండగా నిలిచారు. విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నడిపిన వారికి చంద్రబాబు పదవులు ఇచ్చారు. రిషితేశ్వరి ఘటనను కప్పి పుచ్చే ప్రయత్నం చేసిన నీచ చరిత్ర చంద్రబాబుది. డ్వాక్రా మహిళకు రుణాలు మాఫీ అని చెప్పి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే మహిళలకే రక్షణ లేదు’’ అంటూ సునీత దుయ్యబట్టారు. బీసీల తోక కట్ చేస్తా, తోలు తీస్తా అన్న చంద్రబాబు బీసీలకు ఇంకేం న్యాయం చేస్తారు?. మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌లకు లేదు. మీ మోసాలను చూసే 23 సీట్లకు పరిమితం చేశారు. టీడీపీకి మహిళలే మళ్ళీ బుద్ది చెప్పే టైం దగ్గర పడింది. చంద్రబాబు, లోకేష్‌లవి సినిమా ట్రిక్ రాజకీయాలు. వారిమీద ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయింది. కేవలం గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకునే టీడీపీ రాజకీయాలు చేస్తోంది. చివరికి మహిళా కమిషన్‌పై సైతం విమర్శలు చేయటం దారుణం. మహిళల మిస్సింగులు ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ. కానీ సీఎం జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు పవన్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు’’ అని పోతుల సునీత ధ్వజమెత్తారు. చదవండి: మొసలికన్నీరు సంగతి సరే.. మరి ఈనాడుకు ఆ దమ్ముందా? -
పవన్‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం డీజీపీ రాజేంద్రనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. పవన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని వారు కోరారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రతినిధులు ఉన్నారు. అనంతరం, ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు హేయమైనవి. చంద్రబాబు, నారా లోకేశ్‌లకు రాజకీయాలు చేసే దమ్ములేక పవన్‌ను అడ్డుపెట్టుకుంటున్నారు. పవన్ వారి కోసమే రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు, లోకేశ్‌ల జేబు సంస్థగా పవన్ పనిచేస్తున్నాడు. పవన్‌కు మహిళలంటే గౌరవం లేదు. వ్యక్తిగత జీవితంలో మహిళలను మోసం చేసిన మోసగాడు పవన్. అందుకే వాలంటీర్ల పట్ల పవన్ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. పవన్‌ను రెండు చెప్పులతో కొట్టడానికి వాలంటీర్లంతా సిద్ధంగా ఉన్నారు. పవన్‌కు ఇదే మా హెచ్చరిక. మేం చాటలు, చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో పవన్. మహిళలు, వాలంటీర్లకు పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. పవన్.. చంద్రబాబేనా నీ కేంద్ర నిఘా సంస్థ. చంద్రబాబు నీ చెవిలో ఊదితేనే ఇవన్నీ మాట్లాడుతున్నావ్. పవన్ వంటి వ్యక్తులు రాష్ట్రంలో యాత్రలు చేయడానికి లేదు. పవన్‌ను అరెస్ట్ చేయమని డీజీపీని కోరాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంతకు దిగజారుతారా.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారా?: పేర్ని నాని ఫైర్ -
పోతుల సునీత హ్యాట్రిక్
చీరాల: ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత ఎంపికయ్యారు. దీంతో ఆమె వరుసగా మూడోసారి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోనున్నారు. బీసీ (పద్మశాలి) సామాజికవర్గానికి చెందిన పోతుల సునీత బాపట్ల జిల్లా చీరాలలో నివాసముంటున్నారు. 2017లో సునీత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పదవీకాలం మరో మూడేళ్లు ఉండగానే ఆమె పదవికి రాజీనామా చేశారు. 2021 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా స్థానం కలి ్పంచారు. ప్రస్తుతం 2023 మార్చితో ఆమె ఎమ్మెల్సీ గడువు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే కోటా నుంచి ఆమెకు ఎమ్మెల్సీ స్థానం కలి ్పంచారు. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన పోతుల సునీతను వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమించి ఆమెకు మరిన్ని బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ అభ్యరి్థగా ఎంపికైన సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారన్నారు. స్థానిక సంస్థల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వంగా నిరూపించారన్నారు. బీసీలకు అందించిన సామాజిక న్యాయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ రోజు ఇంతమందికి పదవులు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. బీసీలకు చేసిన న్యాయాన్ని అందరూ గుర్తించాలన్నారు. బీసీలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనను సీఎం చేతల్లో చూపిస్తున్నారని, అందుకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి అఖండ మెజారీటీని కట్టబెట్టి ముఖ్యమంత్రి స్థానంలో మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉంచేలా అందరూ కృషి చేయాలన్నారు. -
చంద్రబాబు పై ఎమ్మెల్సీ పోతుల సునీత ఆగ్రహం
-
చంద్రబాబుకు గత ఎన్నికల్లో బుద్ది చెప్పినా సిగ్గు లేదు : ఎమ్మెల్సీ పోతుల సునీత
-
చంద్రబాబుది గోబెల్స్ ప్రచారం
చీరాల టౌన్: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, దానిని తట్టుకోలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేయడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఏనాడూ పేదలు, మహిళల ఆర్థికాభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం సొంత సామాజికవర్గ అభివృద్ధి కోసం మాత్రమే చంద్రబాబు పనిచేశారన్నారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూ అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని, ఓటుతోనే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు పెద్దపీట వేయడంతోపాటు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని, అందుకే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టారని చెప్పారు. శాసనసభ, శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని అన్నారు. -
ఈ లిక్కర్ బ్రాండ్లు టీడీపీవి కావా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లన్నీ బాబు, భువనేశ్వరి, బ్రహ్మణి (బీ–3) బ్రాండ్లేనని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, ఎస్సీ (మాల) కార్పొరేషన్ చైర్ పర్సన్ పి.అమ్మాజీ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి ఆధ్వర్యంలోనే లిక్కర్ డీల్స్ జరిగాయని పేర్కొన్నారు. హెరిటేజ్ పేరుతో వారు పాల వ్యాపారం చేస్తున్నట్లు కనిపించినా తెర వెనక జరిగింది లిక్కర్ బేరమేనని వెల్లడించారు. మద్యం తయారీకి అనుమతులు ఇప్పించటాన్ని చంద్రబాబు, భువనేశ్వరి దశాబ్దాలుగా కుటీర పరిశ్రమగా మార్చుకున్నారని చెప్పారు. మద్యం సేవించటంలో స్వయంగా అత్తా కోడళ్లు పోటీ పడతారని.. ఇలా తాగి ఇటీవల కొట్టుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయని చెప్పారు. టోటల్‌గా బాబు కుటుంబమే తాగుబోతు ఫ్యామిలీ అని వ్యాఖ్యానించారు. ఒకవంక మగువ, మరోవంక మద్యం.. ఇదే పప్పు బ్రాండ్ అని లోకేష్‌పై ధ్వజమెత్తారు. ఇంట్లో అన్నింటికీ లైసెన్స్.. అది తమకు సాధారణమే అన్నట్లుగా నారా కుటుంబం వ్యవహార శైలి ఉందన్నారు. చుక్క లేకపోతే తండ్రీ కొడుకులు ఒక్క ముక్క కూడా మాట్లాడలేరని చెప్పారు. ఆదివారం అనంతపురం, విశాఖపట్నం, తాడేపల్లిలో వారు వేర్వురుగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► చంద్రబాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హేంగర్ లాంటి 254 బ్రాండ్లకు అనుమతులిచ్చారు. ఇలాంటి బ్రాండ్ల పేరుతో దత్త పుత్రుడి రుణం, వియ్యంకుడి రుణం తీర్చుకున్నారు. ► మద్యం కంపెనీలన్నీ టీడీపీ నేతలవే. ఎస్పీవై బ్రాండ్ ఎవరిది? ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు? ఆయన టీడీపీ నాయకుడు కాదా? ► విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. అది టీడీపీ నేతఅయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ. దాన్ని గత ఏడాది అమ్మేశానని ఆయన చెబుతున్నారు. అంటే ఏడాది క్రితం వరకు అది అయ్యన్నదే కదా? ఎన్నికల ముందు ఆ కంపెనీకి చంద్రబాబు అనుమతి ఇచ్చారా? లేదా? ► పీఎంకే డిస్టిలరీ యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది కాదా? శ్రీకృష్ణా డిస్టిలరీ ఆదికేశవులునాయుడిది కాదా? లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబు.. బ్రాండ్లకు అనుమతి ఇచ్చినది ఆయన హయాంలోనే. లిక్కర్ విక్రయాలను ఆకాశానికి పెంచింది చంద్రబాబే. ఈ అనుమతులన్నీ బీ–3 వల్లే వచ్చాయి. టీడీపీ నేతలు ఈ అనుమతుల కోసం లంచాలు ఎవరికి ఇస్తారు? మద్యం వినియోగం తగ్గింది.. ► లిక్కర్ సేల్స్ పెంచితే కమీషన్లు వస్తాయి గానీ తగ్గిస్తే ఎవరైనా ఇస్తారా? బెల్ట్ షాపుల్ని రద్దు చేసి, బార్ లైసెన్సుల్ని 33 శాతం తగ్గించి, పర్మిట్ రూముల్ని మూసి వేయించి, ప్రభుత్వ దుకాణాల ద్వారా ఇప్పుడు పరిమితంగా లిక్కర్ అమ్ముతున్నారు. ఇలా విక్రయాలు గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితుల్లో ఎవరైనా కమీషన్లు ఇస్తారా? ► రాష్ట్రంలో మద్యం వినియోగం ఎంతగా తగ్గిందో అందరికీ తెలుసు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.31 లక్షల కేసులు ఉంటే 2021–22లో ఏకంగా 278.5 లక్షల కేసులకు తగ్గాయి. ఇదే సమయంలో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసుల నుంచి గణనీయంగా 82.6 లక్షల కేసులకు తగ్గిపోయాయి. ► 2018–19లో మద్యం విక్రయాల ఆదాయం రూ.20,128 కోట్లు కాగా 2021–22లో ఆదాయం రూ. 25,023 కోట్లు ఉంది. ► 43 వేలకు పైగా బెల్టుషాపులను రద్దు చేశాం. పర్మిట్ రూమ్‌లన్నీ రద్దు చేశాం. 4,380 నుంచి 2,934కి వైన్ షాప్‌లను తగ్గించాం. ► ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో షాపులుంటే విచ్చలవిడిగా మద్యం విక్రయించి బెల్టుషాపులు కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రభుత్వమే పరిమితంగా నిర్ణీత వేళల్లో విక్రయాలు చేపట్టింది. ► నాటు సారా తయారీ, అమ్మకాలపై గట్టి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఎస్ఈబీ ద్వారా ఎక్కడిక్కడ దాడులు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నాం. డిస్టిలరీల ఓనర్లు పచ్చబాబులే ► భవిష్యత్తులో ఏర్పడే మద్యం డిమాండ్‌కు అనుగుణంగా అంటూ చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా లైసెన్స్‌లు ఇచ్చారు. అదీ దిగిపోయే ముందు! లిక్కర్ తయారీదార్లు, డిస్టిలరీ ఓనర్లు పచ్చబాబులే. ► 2019 తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిస్టిలరీకి కానీ, ఒక్క బ్రూవరీకి కానీ అనుమతి ఇచ్చిందే లేదు. ► రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉండగా వాటికి అనుమతులు ఎప్పుడు వచ్చాయో గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదు డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14. చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు కు అనుమతి ఇచ్చారు. ఐదేళ్లలో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు. ► సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్నికలు రాగానే మళ్లీ దండలు వేస్తుంటారు. అలాగే గతంలో తాను అనుమతి ఇచ్చిన బ్రాండ్లు, డిస్టీలరీలపై మళ్లీ ఆయనే ఇవెక్కడివంటూ విమర్శలు చేస్తుంటారు. ఆ దోపిడీ.. బీ–3 కుంభకోణాలే ► ఇసుక అమ్మకాల్లో ఇప్పుడు రూ.4,000 కోట్లు వస్తుంటే... గత ప్రభుత్వంలో ఈ డబ్బంతా ఏమయిందన్న ప్రశ్నకు సమాధానం బీ–3 కుంభకోణం. ► మైనింగ్ దోపిడీ ఎలా జరిగిందన్న ప్రశ్నకు సమాధానం బీ–3 కుంభకోణాలు. ► దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అన్నదే టీడీపీ విధానం. దుష్ట చతుష్టయంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్త పుత్రుడికి ఎప్పటికప్పుడు వాటాలు. ► టీడీపీ అంటేనే డీపీటీ. లంచాలకు ప్రతిఫలంగానే అనుకూల పత్రికలు, టీవీల్లో ఎల్లో ప్రచారాలు. ఈ కుంభకోణంపై న్యాయ విచారణ చేయాలి. -
ఫేక్ రిపోర్ట్.. ఫేక్ పార్టీ.. ఫేక్ లీడర్
సాక్షి, అమరావతి: టీడీపీ సిగ్గు, ఎగ్గు లేకుండా ఫేక్ వీడియోలు, ఫేక్ సర్టిఫికెట్లతో అనైతిక రాజకీయం చేస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఫేక్ అని, దాని అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఫేక్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పాలన చూసి కడుపు మంటతో టీడీపీ దుష్ట రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ మాధవ్‌పై ఫేక్ వీడియో రూపొందించి, దుష్ప్రచారం చేసిన, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులు అనిత, పట్టాభి.. ఫేక్ వీడియోలను పదేపదే ప్రసారం చేసిన ఎల్లోమీడియా చానళ్లు, పత్రికలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తించాలన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. మనుగడ కోసం టీడీపీ నీచ రాజకీయం ► ఇలాంటి ఫేక్ వీడియోలతో రాజకీయాలు సాధ్యం కాదని టీడీపీ ఇప్పటికైనా గుర్తించాలి. సీఎం జగన్ ఏపీని దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆదరణ కోల్పోయిన టీడీపీ.. మనుగడ కోసం ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలతో నీచ రాజకీయం చేస్తోంది. ► టీడీపీ వారే ఫేక్ వీడియో సృష్టించి, దాన్ని లండన్‌కు పంపి, టీడీపీకి చెందిన ఐ టీడీపీ గ్రూప్ ద్వారా దాన్ని అప్లోడ్ చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆ వీడియోను అమెరికాలోని ఒక ల్యాబ్‌కు పంపామని, ఆ వీడియో వాస్తవమని నివేదిక వచ్చిందని రచ్చ చేశారు. తీరా ఆ నివేదిక తాము ఇవ్వలేదని సదరు ల్యాబ్ వారు స్పష్టం చేయడంతో టీడీపీ బండారం బయట పడింది. ► తద్వారా రాష్ట్రంలో టీడీపీ ఏ స్థాయిలో దుర్మార్గమైన రీతిలో రాజకీయం చేస్తోందన్నది అందరికీ అర్థమైంది. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే. ఎప్పుడూ ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నాడు. ► రాష్ట్రంలో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా, ఒక బీసీ నేత, స్వయంగా ఎంపీపైనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా సీఎం జగన్‌పై నిందలు మోపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడిన అనిత, పట్టాభిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. -
బీసీలంటే ఎందుకంత చులకన?
ఒంగోలు: తెలుగుదేశం పార్టీకి, వారికి వంతపాడుతున్న పచ్చమీడియాకు బీసీలంటే ఎందుకంత చులకన అని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఇదే పంథా కొనసాగిస్తే సరైన గుణపాఠం చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బీసీలపట్ల చులకనగా వ్యవహరిస్తూ.. బీసీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై మార్ఫింగ్ వీడియో రూపొందించి ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 వంటి పచ్చ మీడియా చానళ్లలో అడ్డగోలుగా మాట్లాడడం చూస్తుంటే రాష్ట్రంలో టీడీపీ తప్ప మరో పార్టీ అధికారంలో ఉండడాన్ని వారు జీర్ణించుకోలేనట్లుగా ఉందన్నారు. ఇప్పటివరకు బాధితురాలిని నేనే అని ఒక్క మహిళ కూడా ముందుకు రాలేదని, దీని ని బట్టే అది మార్ఫింగ్ వీడియో అని స్పష్టమవుతోందని అన్నారు. కిరాయి కోసం మీడియా ముందు మాట్లాడే పట్టాభి, పెయిడ్ ఆర్టిస్ట్ మా దిరిగా అనిత పచ్చమీడియా ముందు మాట్లాడుతున్న మాటల్ని ఏ మహిళా హర్షించదన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది సీఎం జగన్‌కు ఆపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబుకు, తెలుగుదేశానికి సరైన గుణపాఠం తప్పదన్నారు. ఇక చంద్రబాబు బీజేపీ కాళ్లు పట్టుకుని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారే తప్ప జగన్మోహన్రెడ్డిలా ఏనాడైనా ధైర్యంగా ఎన్నికలకు ఒంటరిగా వెళ్లారా అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకుడు పోతుల సురేష్ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు, తాగుబోతులు మద్య నిషేధం గురించి డిమాండ్ చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. -
అనిత వ్యాఖ్యలు చంద్రబాబు స్క్రిప్టే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. టీడీపీ నేత అనితకు కనీస అవగాహనలేదని విమర్శించారు. అలాంటి ఆమె సీఎం సతీమణి భారతి గురించి మాట్లాడుతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజం చెప్పాలంటే అవన్నీ చంద్రబాబు మాట్లాడిస్తున్నవేనన్నారు. చంద్రబాబు చేసే నీతిమాలిన రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. అందుకే టీడీపీ వారికి నిజాలు రాసే ‘సాక్షి’ని చూస్తే భయం పట్టుకుందన్నారు. వారు తప్పులు, కుట్ర రాజకీయాలు చేశారు కాబట్టే వైఎస్ భారతిని చూస్తే భయమని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పోతుల సునీత మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కుటుంబసభ్యుల గురించి చంద్రబాబు ఇష్టానుసారంగా తన చెంచాలతో మాట్లాడించవచ్చు కానీ, అదే మేం భువనేశ్వరి గురించి మాట్లాడితే వెక్కివెక్కి ఏడుస్తారని ఎద్దేవా చేశారు. మహిళలను మోసంచేయడం, వారిని వంచించడమే టీడీపీ నైజమని ఆమె ఎండగట్టారు. అది చంద్రబాబు నేర్పించిన విద్యే అని, అలా చాలామందిని అణిచివేసి, హింసించారన్నారు. డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ఆమె ప్రశ్నించారు. సీఎంపై దుష్టచతుష్టయం విషం ఇక సీఎం జగన్ మంచి పాలన అందిస్తున్నారని, అందుకే దుష్టచతుష్టయం చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5 అదే పనిగా ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వంపైనా విషం చిమ్ముతున్నారని పోతుల సునీత ధ్వజమెత్తారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకంగా రూ.1.65 లక్షల కోట్లను నేరుగా పేద ప్రజల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమచేశారని ఆమె గుర్తుచేశారు. చంద్రబాబు ఇకనైనా తన పద్ధతి మార్చుకోకపోతే, ప్రజలు తగిన బుద్ధిచెబుతారని ఆమె హెచ్చరించారు. మహిళలను ఎంతో గౌరవించి, ఆదరించే సీఎం జగన్ సతీమణిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె చెప్పారు. మరోసారి వైఎస్ భారతిపై నోరుజారితే సహించేదిలేదని పోతుల సునీత హెచ్చరించారు. 2024లో కూడా మళ్లీ టీడీపీ ఓటమి ఖాయమని, సీఎం జగన్ తిరిగి సీఎం కావడం తథ్యమని ఆమె చెప్పారు. -
విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్
ఒంగోలు: ‘విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్మోహన్రెడ్డి అయితే వెన్నుపోట్లకు పెట్టింది పేరు చంద్రబాబు’ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మ అంటూ జగన్మోహన్రెడ్డి పిలిచే పిలుపులోనే ఆప్యాయత, అనురాగాలు ఉట్టిపడతాయన్నారు. కానీ చంద్రబాబుకు మహిళల పట్ల గౌరవంగా ఉండాలన్న కనీస జ్ఞానం కూడా లేని వ్యక్తని ధ్వజమెత్తారు. 2014లో డ్వాక్రా సంఘాల అప్పులు మొత్తం తీరుస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... గద్దెనెక్కాక రూ.14 వేల కోట్ల అప్పును తీర్చకుండా సంఘాలను రుణాల రొంపిలోకి నెట్టి డిఫాల్ట్ అయ్యేలా చేశాడని మండిపడ్డారు. కానీ సీఎం జగన్మోహన్రెడ్డి హామీ మేరకు రెండు విడతలుగా డ్వాక్రా సంఘాల రుణాలను తిరిగి వారికి చెల్లించడంతో పాటు ఏటా సున్నా వడ్డీ కూడా అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టిస్తూ వారందరినీ లక్షాధికారులను చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాజ్యోతిరావు ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఆయన చేస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. ఈ ఆశయాలే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 175కు 175 స్థానాలు కట్టబెడతాయన్నారు. రెండేళ్లు కరోనా వెంటాడినా రూ.లక్షల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేసి సీఎం జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారన్నారు. అందుకే జగన్‌ను చూస్తే నమ్మకం, చంద్రబాబును చూస్తే వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకి ప్రజలు విచ్చేసి జగన్మహన్రెడ్డి పట్ల కనబరిచిన విశ్వాసం దేశచరిత్రలోనే ప్రత్యేక రికార్డు అన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు పోతుల సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు మాట్లాడితే సామాజిక న్యాయానికి పేటెంట్ అని చెప్పుకుంటారని, కానీ ఆయన భావజాలమే ప్రజా వ్యతిరేకమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటించారన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామంటూ హెచ్చరించిన ఘటనలు, దళితులపై చేసిన వ్యాఖ్యలు, చివరకు అమరావతిలో 55వేల మంది అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కోర్టుల కేసులు వేయించిన చంద్రబాబుకు సామాజిక న్యాయంపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే, ప్రజల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పోతుల సునీతకు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చింతగుంట్ల సువర్ణ, పోతంశెట్టి వెంకటరత్నం తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. (క్లిక్: బాబుకు మైండే కాదు.. చెవులూ పోయాయి) -
ఇదే ఉత్సాహంతో 2024లో కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం
-
పవన్ దగ్గరే మహిళలకు రక్షణ లేదు
సాక్షి, అమరావతి: ‘సినిమాకు ఓ హీరోయిన్‌తో రెండు పాటల్లో పిచ్చి గెంతులేసినట్లు.. నిజ జీవితంలో కూడా మహిళలను వాడుకుని వదిలేసే నీచ సంస్కృతి పవన్ కళ్యాణ్‌ది. ముగ్గురిని పెళ్లి చేసుకుని, వదిలేసి, వారి జీవితాలతో చెలగాటమాడారు’ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. వ్యక్తిగత జీవితంలో మహిళలను గౌరవించని నీకు.. మహిళల భద్రత, రక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సునీత మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే మహిళలకు ఆయన ఏమాత్రం గౌరవం ఇస్తారో అర్థమవుతుందన్నారు. ఒకరు లోకల్, మరొకరు నేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్.. ఇప్పుడు ఇంకొకరితో పెళ్లికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది అని చెప్పారు. దుశ్శాసనుడు, కీచకుడు మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో.. మహిళల రక్షణ గురించి పవన్‌కళ్యాణ్ మాట్లాడితే అలాగే ఉంటుందని అన్నారు. నిజానికి పవన్‌కళ్యాణ్ దగ్గరే మహిళలకు రక్షణ లేదని చెప్పారు. హోం మంత్రి మాటలను వక్రీకరిస్తారా? ‘రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని.. పిల్లలకు బ్యాడ్ టచ్ గురించి తల్లిదండ్రులు, టీచర్లు అవగాహన కల్పించాలని హోం మంత్రి అన్న మాటలను పవన్ కళ్యాణ్ వక్రీకరిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. అప్పుడు కాల్‌మనీ సెక్స్ రాకెట్, ఎమ్మార్వో వనజాక్షిపై దాడి వంటి ఎన్నో అమానవీయ సంఘటనలు జరిగినా ఎందుకు ప్రశ్నించలేదు’ అని నిలదీశారు. మహిళా పక్షపాతి సీఎం వైఎస్ జగన్ ‘పొరుగు రాష్ట్రంలో ఒక యువతి దారుణ హత్యకు గురైతే, ఆమె పేరుతో ఇక్కడ మహిళల రక్షణ కోసం సీఎం జగన్ ప్రత్యేకంగా దిశ యాప్ రూపొందించారు. దిశ చట్టాన్ని రూపొందించారు. యాప్‌ను దాదాపు 1.50 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. అది వారికి ఎంతో రక్షణ కల్పిస్తోంది. సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతి. ఈ మూడేళ్లలో మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా ఎంతో కృషి చేశారు. మహిళ అభివృద్ధి చెందితేనే ఆ ఇల్లు, ఊరు, రాష్ట్రం బాగుంటాయని నమ్మారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు వారిని మోసం చేస్తే, జగన్ వారిని ఆదుకుంటున్నారు. వారి రుణాలు చెల్లించడంతో పాటు, సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, చేయూత వంటి పథకాలతో పాటు, బాలికల కోసం కూడా స్వేచ్ఛ పథకం అమలు చేస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. సచివాలయాల్లో 55 శాతం మహిళా ఉద్యోగులే ఉన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా వారికి 50 శాతం ఇస్తున్నారు’ అని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికార దర్పంతో వ్యవహరిస్తోందని పవన్ ఆరోపించడం విడ్డూరమన్నారు. వైఎస్ జగన్ పభుత్వం పూర్తి సేవాభావంతో పని చేస్తోందని చెప్పారు. పవన్‌కళ్యాణ్ ఇలాగే మాట్లాడుతూ పోతే 2024 ఎన్నికల్లో మహిళలే ఆయనకు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఈసారి ఆ 23 సీట్లు కూడా రావు: ఎమ్మెల్సీ పోతుల సునీత
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు.. మహిళలకు ఏం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 30 నెలలలో జగన్ ఎన్నో సంక్షేమ పనులు చేశారని.. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు అన్యాయం చేస్తే జగన్ న్యాయం చేశారన్నారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను జగన్ తీర్చారు. అలాంటి వ్యక్తి జగన్‌పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. ఎన్నో పథకాలు సీఎం జగన్ ప్రవేశపెడుతున్నారని చంద్రబాబుకు కడుపుమంట అని సునీత దుయ్యబట్టారు. చదవండి: సీఎం వైఎస్ జగన్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు ‘‘సీఎం జగన్.. లక్షా 36 వేల మందికి సచివాలయాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ఎంతో మంది మహిళల తాళిబొట్లు తెగాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్‌తో వారి జీవితాలను నాశనం చేశారు. కానీ జగన్ ఇప్పుడు మహిళలకు ఎంతో చేస్తుంటే చంద్రబాబుకు కనిపించటం లేదు. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుని ఆయన వ్యవహరిస్తున్నారు. ఇలాగే ఉంటే ఈసారి ఆ 23 సీట్లు కూడా రావని’’ ఎమ్మెల్సీ పోతుల సునీత ఎద్దేవా చేశారు. -
వినోద్ జైన్‌కు ఉరిశిక్ష విధించాలి
సాక్షి, అమరావతి: టీడీపీ కీచక నేత వినోద్‌జైన్‌కు ఉరిశిక్ష విధించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రభుత్వాన్ని కోరారు. వినోద్ జైన్ వ్యవహారం రాష్ట్రం మొత్తం తలదించుకునేలా ఉందన్నారు. మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించి.. ఆమె ప్రాణాన్ని హరించాడని మండిపడ్డారు. తక్షణమే ఈ ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత సోమవారం మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి.. ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేయడం దారుణమన్నారు. వినోద్ జైన్‌ను సంఘం నుంచి వెలివేయాలన్నారు. నారీ సంకల్ప దీక్షలంటే ఎవరు నమ్ముతారు? దుర్యోధనుడు, దుశ్శాసనుడికి మహిళల మీద ఎంత గౌరవం ఉందో.. చంద్రబాబు, లోకేష్‌లకూ అంతే గౌరవం ఉందని సునీత ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు మహిళల్ని వేధించి, వంచించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు నారీ సంకల్ప దీక్షలంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. టీడీపీది దుస్సంకల్ప దీక్ష అని విమర్శించారు. నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో నమోదైన లైంగిక వేధింపుల కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేసినవి 60 రోజుల్లో కేవలం 14.5 శాతం మాత్రమే అన్నారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా 93.6 శాతం మేర కేసులను దర్యాప్తు చేశారని తెలిపారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమేనని చెప్పారు. దీన్ని బట్టి సీఎం వైఎస్ జగన్‌కు మహిళల భద్రత పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మహిళలను మోసం చేయడమే బాబు నైజం 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా మహిళలను మోసం చేయడం, దగా చేయడమేనని సునీల దుయ్యబట్టారు. మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నవారిలో సీఎం వైఎస్ జగన్ దేశంలోనే బెస్ట్ సీఎంగా ఉన్నారని కొనియాడారు. చంద్రబాబు దుర్యోధనుడిగా డైరెక్షన్ ఇస్తుంటే, లోకేష్ ఉత్తర కుమారుడిలాగా మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. గతంలో లోకేష్ బాగోతాలు, స్మిమ్మింగ్‌ఫూల్ ఫొటోలను వాళ్లే బయట పెట్టుకున్నారని తెలిపారు. మహిళల పట్ల వాళ్ల నీచ సంస్కృతి ప్రజలకు తెలిసిపోతుందనే భయంతోనే నారీ సంకల్ప దీక్ష పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని దుస్థితిలో బాబు ఉన్నారన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాల్లాంటివి ఒక్కటైనా చంద్రబాబు అమలు చేశారా? 31 లక్షల ఇళ్లు ఇచ్చారా? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. -
ఎమ్మెల్సీగా పోతుల సునీత ఎన్నిక
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి తన కార్యాలయంలో ధువ్రీకరణ పత్రాన్ని పోతుల సునీతకు గురువారం అందజేశారు. శాసన సభ్యుల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో పోతుల సునీత ఒక్కరే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి ప్రకటించి, ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. -
ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న సునీత ఆయనకు ధన్యవాదాలు తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, ఆదిమూలపు, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల అధికారికి సోమవారం నామినేషన్ పత్రాన్ని సమర్పించగా.. నేడు ఆమోదం లభించింది.(చదవండి: 'బలహీన వర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు') -
ఎమ్మెల్సీ అభ్యర్థిగా సునీత నామినేషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, ఆదిమూలపు, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇంతకుముందుసీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న సునీత ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీపీకి షాక్: ఎమ్మెల్సీ పదవికి సునీత రాజీనామా
సాక్షి, ప్రకాశం : జిల్లా టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. టీడీపీ గత కొద్దిరోజులుగా ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందన్నారు. చదవండి : ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు -
'20 ఏళ్లలో ఎన్నో అవమానాలు'
సాక్షి, ప్రకాశం: సంవత్సరాలుగా పోరాడిన బీసీలకు దక్కని రాజ్యాధికారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమైందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేయడం, 56 మందిని చైర్మన్లుగా, 728 మందిని డైరెక్టర్లుగా ఎంపిక చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలోని బీసీలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేశారు. చీరాలలోని గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి, జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. 'బీసీ మహిళగా ఉన్న తనను 20 ఏళ్లపాటు చంద్రబాబు ఎన్నో అవమానాల పాలు చేశాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. 'పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ఏడాదిన్నర కాలంలోనే అన్ని వర్గాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేరువ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది' అని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అమృతపాణి, మాజీమంత్రి పాలేటి రామారావు, బీసీ కమిషన్ మెంబర్ ముసలయ్య పాల్గొన్నారు. -
‘నిమ్మలకు ఇది తెలియకపోవడం సిగ్గుచేటు’
సాక్షి, విజయవాడ : టీడీపీ నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పపై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. నేతన్నలకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎవ్వరు సరిలేరని తెలిపారు. ఏడాది కాలంలో చేనేత రంగంపై సీఎం వైఎస్ జగన్ 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో చేనేతలకు మొండి చేయి చూపించారని విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో చేనేతలకు 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. చేనేత రంగానికి ఎవరు ఎంత సహాయం చేశారనే అంశంపై చర్చకు సిద్ధమని సునీత సవాలు విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హ్యాంక్ యార్న్‌పై సబ్సిడీ ప్రవేశపెట్టారని.. దానిని సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీగా పనిచేసిన నిమ్మల కిష్టప్పకు ఇది కూడా తెలియకపోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. -
సీఎం జగన్ ప్రజలకు అండగా ఉన్నారు
-
2 లక్షల కోట్లకు పైమాటే: ఎమ్మెల్సీ సునీత
-
నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తారా..?
సాక్షి, అమరావతి: లోకేష్ అహంకారం, అహంభావంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపించాలని.. లేకపోతే లోకేష్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ స్వార్థ రాజకీయాలు కారణంగానే శాసనమండలి రద్దు కాబోతుందని ఆమె పేర్కొన్నారు. (చదవండి: బాబు తప్పులకు రిపేర్లు చేస్తున్నాం : సీఎం జగన్) -
మండలిలో దుర్మార్గంగా వ్యవహారించారు
-
‘ఛీకొట్టినా బాబులో మార్పు రాలేదు’
సాక్షి, విజయవాడ : శాసనమండలిని టీడీపీ రాజకీయ వేదికగా మార్చేసిందని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. మండలిలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్యాలరీకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు ఛీకొట్టినా ఆయనలో మార్పు రాలేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. చంద్రబాబు మండలికి వచ్చి చైర్మన్ షరీఫ్‌ను ప్రభావితం చేశారని చెప్పారు. శుక్రవారం విజయవాడలో సునీత మీడియాతో మాట్లాడుతూ.. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టు పట్టించారని తెలిపారు. బాబు ట్రాప్‌లో పడకుండా టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని కోరారు. నిబంధనలు పాటించకుండా చైర్మన్ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై చైర్మన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. మండలి రద్దుపై శాసనసభ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానులను అందరు స్వాగతించాలన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని అన్నారు. రాజధాని రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాలు పక్కనపెట్టి పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు తెలపాలన్నారు. -
‘అధ్యక్ష’ నియామకాలపై టీడీపీలో అసంతృప్తి
సాక్షి, అమరావతి : పార్టీ అనుబంధ శాఖలకు కొత్తగా నియమించిన అధ్యక్షులపై టీడీపీలో అసంతృప్తి రగులుతోంది. కీలకమైన తెలుగు యువత, తెలుగు మహిళ అధ్యక్షులుగా నియమితులైన వారిపై పార్టీలోని ఇతర నేతల్లో ఆగ్రహం కనిపిస్తోంది. త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో పది అనుబంధ సంఘాలకు పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల అధ్యక్షులను నియమించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ నియామకంపై పార్టీ సీనియర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న వారిని విస్మరించి వేరే పార్టీ నుంచి కొంతకాలం క్రితం వచ్చిన అవినాష్‌కు పదవి ఇవ్వడం సరికాదంటున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన అవినాష్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా నిర్వహించారు. ఆ పదవిలో ఉండగానే కొద్ది కాలం క్రితం టీడీపీలో చేరారు. వాస్తవానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కుతుందని పార్టీ నేతలు భావించారు. గతంలో నెల్లూరుకు చెందిన బీద రవిచంద్ర యాదవ్ ఈ పదవి నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పదవి చేపట్టారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఈ పదవిలో ఎవరినీ నియమించలేదు. పలువురు నుంచి అభ్యర్థనలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు దేవినేని అవినాష్‌కు ఆ పదవి ఇవ్వడంతో టీడీపీ బీసీ నేతలు కంగుతిన్నారు. ఇప్పటికే అవినాష్ సమీప బంధువు దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. అవినాష్ సోదరుడు చంద్రశేఖర్ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా ఉన్నారు. ఇలా పార్టీలోని ముఖ్య పదవులన్నీ ఒకే వర్గానికి ఇవ్వడం ఏమిటని బీసీ నేతలు మండిపడుతున్నారు. మహిళ అధ్యక్షురాలినియామకంపైనా అసంతృప్తి తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ పోతుల సునీత నియామకంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ ఆ పదవిని ఉత్తరాంధ్రకు చెందిన శోభా హైమావతి నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవిలో ఉన్నా ఆమెకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. కొద్దిరోజుల క్రితం ఆమెకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఇప్పుడు హైమావతి స్థానంలో సునీతను నియమించడంపై కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అయిన సునీత పార్టీలో కీలక నేత కాదని, ఆమె మహిళ అధ్యక్షురాలిగా రాణించలేరని చెబుతున్నారు. బీసీ సెల్ అధ్యక్షునిగా గుంటూరుకు చెందిన బోనబోయిన శ్రీనివాసరావును నియమించడంతో ఆ పదవిని ఆశించిన మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
నువ్వా.. నేనా !
♦ పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆమంచికి షాక్ ♦ ఆమంచి జీర్ణించుకుంటారా? ♦ ఇప్పటికే రెండు వర్గాల మధ్య నిత్యం గొడవలే ♦ పార్టీ క్యాడర్, అధికారులకు ఇబ్బందే ♦ సునీత ఇక దూకుడు పెంచడం ఖాయం ♦ చీరాలలో ఇక రెండు అధికార కేంద్రాలు చీరాల టీడీపీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుంపటి రాజేశారు. ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి నాయకులు నిత్యం తన్నుకుని తలకు పోసుకుంటున్నారు. ఉప్పు..నిప్పులా ఉన్న రెండు వార్గాల నాయకులు ఎవరికి వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ నాయకురాలు పోతుల సునీతకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు పార్టీ అధిష్టానం షాకిచ్చినట్లయింది. నాయకుల సంగతి అంటుంచితే ఈ పరిణామం పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్, అధికారులకు తలనొప్పి కావడం ఖాయం. మున్ముందు ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. ప్రకాశం జిల్లా : చీరాల తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలు నిత్యం భగ్గుమంటుంటాయి. అధికార పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా రగడే. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నుంచి.. నాలుగు విడతులుగా జరిగిన జన్మభూమి గ్రామసభలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల వరకూ ఆ పార్టీ నేతలు ప్రజలకు మేలు చేసిందేమీ లేదు. తరుచూ నేతల మధ్య ఘర్షణలతో చీరాల నడిరోడ్డులో టీడీపీ పరువు బజారున పడింది. ఇప్పటి వరకూ పోతుల సునీత ముందుకు రాకుండానే వెనుకుండి మాజీ మంత్రి పాలేటి రామారావు సహకారంతో తమ వర్గానికి అండగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఊహించని రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చీరాల నియోజకవర్గ నాయకురాలు పోతుల సునీతకు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సునీత నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. 2016 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు, సహకారం కోసం ఆమంచిని సీఎం టీడీపీలోకి చేర్చుకున్నారు. అంతే వేగంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి సునీతను తప్పించారు. ఆమెను జన్మభూమి కమిటీ సభ్యురాలిగా మాత్రమే కొనసాగించారు. అప్పటి వరకూ సునీత వెంట ఉన్న మున్సిపల్ చైర్మన్ ఎం.రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే వర్గంలోకి జంప్ అయ్యారు. ఈ పరిస్థితిల్లో ఆమెతో ఉన్న కొందరు నాయకులతో పాటు, పాలేటి వర్గంలో ఉన్న మరికొందరిని కలుపుకుని ఆమంచికి వ్యతిరేకంగా టీడీపీ రెండో వర్గం నడుపుతూ వచ్చారు. బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి కూడా పోతులకే మద్దతు తెలిపారు. ఇటీవల తన ఎంపీ నిధులను కూడా పోతుల వర్గీయులకే కట్టబెట్టారు. టీడీపీ రెండు వర్గాల బలాబలాలు ఎలా ఉన్నా వర్గపోరుకు మాత్రం కొదువ లేదు. విభేదాలకు అంతే లేదు.. పార్టీ ఒక్కటైనా ఆ రెండు వర్గాల మధ్య విభేదాలకు అంతేలేదు. ఇప్పటి వరకూ సునీతకు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టి నియోజకవర్గం నుంచి దూరం చేస్తారని అటు పార్టీ నాయకులు, ఇటు ప్రజల్లో ప్రచారం జరిగింది. సునీత కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కోసం సునీత కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు నియోజకవర్గంలో వారం నుంచి ప్రచారం జరిగింది. ఊహించని విధంగా ఆదివారం రాత్రి పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించినట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్యే ఆమంచి వర్గాని గట్టిషాక్ తగిలినట్లయింది. ఆమంచికి ఎదురు దెబ్బే నియోజకవర్గంలో రెండో నాయకత్వాన్ని సహించలేని ఎమ్మెల్యే ఆమంచికి ఇది ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. పోతులకు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో నియోజకవర్గంలో ఆమె రెండో అధికార కేంద్రం అవుతుందనే విషయంలో సందేహం లేదు. చేతిలో అధికారం ఉండటంతో సునీత తన వర్గాన్ని బలోపేతం చేయడంతో పాటు అబివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, అధికారుల విషయంలో, లబ్ధిదారుల ఎంపికలో ఆమె జోక్యం ఉండటం ఖాయం. ప్రొటోకాల్ ప్రకారం అన్నీ అధికార కార్యక్రమాల్లో సునీత తన వర్గంతో కలిసి పాల్గొంటారు. దీన్ని ఎమ్మెల్యే ఆమంచి అంగీకరించే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా సునీతతో కలిసి ఆమంచి పనిచేసే అవకాశం లేదన్న ప్రచారం కూడా సాగుతోంది. చీరాల టీడీపీలో ఇక రోజూ రచ్చే. ఎవరూ ఊహించని విధంగా సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఆమంచి దూకుడుకు చెక్ పెట్టడానికేనా.. అని నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. తన ప్రత్యర్థిగా ఉన్న సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆమంచి ఏ విధంగా అర్థం చేసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి. -
తెలుగు మహిళ అ'బలైంది'
ఇన్చార్జి బాధ్యతల నుంచి పక్కకి ఎన్నికలు ముగిశాక మారిన బాబు వైఖరి మహిళా నేతలకు మొండిచెయ్యి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికల ముందు జిల్లాలో రెండు సీట్లను మహిళలకు కేటాయించామని గొప్పలు చెప్పిన చంద్రబాబునాయుడు ఎన్నికలు ముగిసిన తరువాత ఆ ఇద్దరు మహిళలకూ మొండిచెయ్యి చూపించారు. ఇద్దరు మహిళా నేతలను పదవుల నుంచి తప్పించి వేరేవారికి అప్పగించడం ద్వారా తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. యర్రగొండపాలెం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన అజితారావు, చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పోతుల సునీతలను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించారు. మహిళా నాయకులను పక్కన పెట్టడం, ఇటీవలే ఇసుక రవాణా నుంచి కూడా డ్వాక్రా మహిళలను తప్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహిళలకు పెద్ద పీట వేస్తున్నానని వేదికలపై చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయట మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మహిళా నేతలు మండిపడుతున్నారు. 2014 ఎన్నికల ముందు యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను బూదాల అజితారావుకు అప్పగించారు. ఎన్నికల్లో సీటు కూడా ఆమెకే ఇచ్చారు. ఎన్నికల్లో అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజు విజయం సాధించారు. ఆ తర్వాత క్రమంగా అజితారావును పక్కన పెడుతూ వచ్చారు. చివరికి అమెకు చెప్పకుండానే ఇన్చార్జి పదవి నుంచి తొలగించి అక్కడ త్రిమెన్ కమిటీ వేశారు. ఆఖరికి పార్టీ నుంచి కూడా పంపించేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గత వారంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అజితారావు వర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులను కూడా అరెస్టు చేశారు. వారు ముఖ్యమంత్రి సభలో నిలదీసే అవకాశం ఉందన్న భయంతో సొంతపార్టీ వారిని కూడా అరెస్టు చేశారు. పార్టీ కోసం పని చేస్తున్నా తమని నమ్మని పరిస్థితుల్లో పార్టీలో ఎందుకు ఉండాలని అజితారావు వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. చీరాల విషయం కూడా దీనికి భిన్నంగా లేదు. ఎన్నికలకు ఏడాది ముందుగానే అనంతపురం పరిటాల రవి వర్గానికి చెందిన పోతుల సురేష్ భార్య పోతుల సునీతను చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు నాయుడు నియమించారు. అప్పటి నుంచి చీరాలకు మకాం మార్చిన సునీత 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో రగడ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీ సభ్యురాలిగా జన్మభూమి సభలకు సునీత హాజరవడం, దీన్ని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యతిరేకించడంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నవోదయం పార్టీ తరఫున గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలోకి తీసుకున్నారు. ఆమంచి చేరికను సునీత వర్గం గట్టిగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మూడోవిడత జన్మభూమికి ముందు పాత జన్మభూమి కమిటీలను రద్దు చేసి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన వర్గం వారితో కమిటీలు ఏర్పాటు చేశారు. దీన్ని నిరసిస్తూ సునీత వర్గం ఒంగోలులో పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగడంతో జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ పాత కమిటీనే ఉంటుందని నచ్చజెప్పారు. రెండు రోజుల్లోనే సీను మారింది. కొత్త కమిటీలను ఆమోదించకపోతే జన్మభూమి సభలను బహిష్కరిస్తామని ఆమంచి కృష్ణమోహన్ వర్గం అల్టిమేటం ఇవ్వడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇన్‌ఛార్జి మంత్రి రావెల సమక్షంలో నేతలు చర్చలు జరిపి నియోజకవర్గ ఇన్చార్జి పదవిని కూడా ఆమంచి కృష్ణమోహన్‌కు కట్టబెట్టారు. దీంతో కంగుతిన్న పోతుల సునీత వర్గం భవిష్యత్ కార్యాచరణపై తమ వర్గంతో చర్చలు జరుపుతున్నారు. -
చీరాలలో జన్మభూమి రచ్చ రచ్చ
చీరాల: ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని విజయనగర కాలనీలో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం ఆదివారం రచ్చ రచ్చ అయింది. జన్మభూమి కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జ్ పోతుల సునీతను ఆహ్వానించడంపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఏ అర్హతతో వచ్చావో చెప్పాలని ఆమంచి వర్గీయులు సునీతను డిమాండ్ చేశారు. దీంతో సునీతతోపాటు ఆమె వర్గీయులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ ఆమె వర్గీయులు ఆమంచి వర్గీయులపై దాడికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అదే క్రమంలో పోతుల సునీతను అదుపులోకి తీసుకునేందుకు మహిళా కానిస్టేబుల్ ప్రయత్నించారు. దీంతో సునీత ఆగ్రహంతో మహిళ కానిస్టేబుల్‌పై దాడి చేసింది. -
తమ్ముళ్ల లొల్లి
చీరాల, న్యూస్‌లైన్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ చీరాల తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. గ్రూపులుగా విడిపోయి ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కరపత్రాలు వేసుకుంటున్నారు. బహిరంగంగానే విమర్శలకు దిగుతుండటతో పార్టీ అధినేతకు ఫిర్యాదుల పరపంపర కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్నేళ్లగా నియోజకవర్గ ఇన్ చార్జి లేక పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రస్తుతం సీటు వ్యవహారంలో విభేదాలు మితిమీరడంతో ఉన్న అతికొద్ది మంది కార్యకర్తలు కూడా అయోమయంలో పడ్డారు. చీరాల సీటు కోసం పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ భార్య సునీత, మునగపాటి వెంకటేశ్వర్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. అలానే సీనియర్లు చిమటా సాంబు, గొడుగుల గంగరాజు, జి.చంద్రమౌళి, జూనియర్లు గొర్ల శ్రీనివాసయాదవ్, బీరక సురేంద్ర, ఆలూరి శ్రీనివాస్‌తో పాటు మరికొందరు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పోతుల సునీత, మునగపాటి వెంకటేశ్వర్లు మధ్యే పోటీ నెలకొని ఉంది. ఒక సామాజిక వర్గంలోని ముఖ్యులంతా పోతుల సునీతకు టికెట్ ఇవ్వాలని కొద్దిరోజులుగా ఆ పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే స్థానిక పార్టీ సీనియర్లు, వేటపాలెం మండలంలోని పార్టీ నాయకులు, సర్పంచులు ఒక్కటయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పోతుల సునీతకు సీటు ఇస్తే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామంటూ తీర్మానం చేసి ఆ ప్రతులను చంద్రబాబుకు పంపారు. నాలుగు రోజుల క్రితం వేటపాలెం మండలం దేశాయిపేట సర్పంచ్ లేళ్ల శ్రీధర్, రామన్నపేట సర్పంచ్ బట్టా అనంతలక్ష్మి, పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శి బొడ్డు సరోజినితో పాటు పలువురు గ్రామ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లో సునీతకు ప్రస్తుతం ఓటుందని, ఆమె ఇంటి అడ్రస్ ఓటు సంఖ్య నంబర్ కూడా సేకరించి మీడియాకు వివరించారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి సీటిస్తే తామంతా వ్యతిరేకంగా పనిచేస్తామని, అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగకుండా సునీత తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళని, ఆమెకు సహకరించొద్దని నియోజకవర్గంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచురణ మాత్రం జగన్ యూత్.. అని ముద్రించి అక్కడ కూడా వైఎస్సార్ సీపీపై తెలుగు తమ్ముళ్లు విషంగక్కారు. ఇదంతా సీటు కోసం పోటీ పడుతున్న మునగపాటి వెంకటేశ్వర్లే తన మద్దతుదారులతో చేస్తున్న పనని పోతుల సునీత వర్గం ఆరోపిస్తుంది. మొత్తానికి చీరాల టీడీపీలో తెలంగాణ చిచ్చు రోజురోజుకూ రాజుకుంటోంది. ఇంత జరుగుతున్నా టీడీపీ జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. జిల్లా ముఖ్య నాయకులైన కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌లు కూడా చెరోవైపు మొగ్గు చూపుతున్నారు. బలరాం మునగపాటికి సిఫార్సు చేస్తుండగా.. జనార్దన్ మాత్రం సునీత వైపు నిలబడ్డారు. ఇప్పటికే పలుమార్లు చీరాల నియోజకవర్గ ఇన్చార్జి విషయంపై చంద్రబాబు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇన్చార్జిని రేపోమాపో నియమిస్తామంటూ దాటవేసే ధోరణిని ఆయన అవలంబిస్తున్నారు. స్థానికంగా మాత్రం పార్టీ కార్యకర్తలు, నాయకులు వర్గ విభేదాల మధ్య ఎటువైపు నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.