
సాక్షి, గుంటూరు: మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. మంగళవారం ఆమె తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నాడని, ఆయనను ప్యాకేజీ నాయకుడిగానే ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘‘జగన్ ప్రభుత్వంలో మహిళలే మహరాణులుగా ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్‌కి ఇవేమీ కనపడవు. పవన్ వ్యక్తిగత జీవితం చూస్తేనే మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నాడో తెలుస్తుంది. నీ తల్లిని అవమానించిన వారితో ప్యాకేజీ బంధం ఏర్పాటు చేసుకున్నారు. నీ తల్లినే అవమానించావ్’’ అంటూ పోతుల సునీత దుమ్మెత్తి పోశారు.
చదవండి: ఏపీ శ్రీలంక అయిపోతుందన్నావ్.. మరి ఇప్పుడేమో.. ఇదేంటి చంద్రబాబూ..?
‘‘పవన్‌కి బ్రెయిన్ లేదు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటం తప్ప మరేమీ తెలియవు. చంద్రబాబు జెండా, ఎజెండా పట్టుకుని తిరుగుతున్నావ్. పవన్‌ని దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్‌గా మాత్రమే జనం చూస్తున్నారు. మహిళల పుట్టుకనే అవమానం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి వత్తాసు పలుకుతున్నాడంటే ఎంత దిగజారుడు రాజకీయమో తెలుస్తోంది’’ అని దుయ్యబట్టారు.