సాక్షి, అమరావతి: సీఎం జగన్ పేద, బడుగు వర్గాల వారి కోసం అను నిత్యం కష్టపడి పని చేస్తున్నారని, దీన్ని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు, ఆ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనితకు మా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే నీచ చరిత్ర చంద్రబాబుది’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణే లేదు. అనిత అన్నం తింటుందా? గట్టి తింటుందా?. ఎందుకిలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు?. మహిళలే అనితకు, టీడీపీకి బుద్ది చెప్తారు. అనిత పచ్చకామెర్లతో బాధ పడుతోంది. అందుకే ఎన్‌సీఆర్‌బీ రిపోర్టుని కూడా కూడా పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. దిశ యాప్‌తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. సచివాలయాలలో మహిళా పోలీసులను కూడా జగన్ నియమించారు. పదవుల్లో సైతం మహిళకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. హోంమంత్రి, మండలి వైస్ ఛైర్మన్ లాంటి ముఖ్యమైన పదవుల్లో సైతం మహిళలే ఉన్నారు’’ అని పోతుల సునీత పేర్కొన్నారు.
చదవండి: లెక్కలు తేలాలి.. పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
‘‘పవన్, చంద్రబాబు, లోకేష్ వలంటీర్ల మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో తోక ముడిచారు. టీడీపీ మొదటి నుంచీ మహిళలను కించపరిచే పార్టీ. మహిళల పుట్టుక గురించే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. కానీ జగన్ మహిళలకు అండగా నిలిచారు. విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నడిపిన వారికి చంద్రబాబు పదవులు ఇచ్చారు. రిషితేశ్వరి ఘటనను కప్పి పుచ్చే ప్రయత్నం చేసిన నీచ చరిత్ర చంద్రబాబుది. డ్వాక్రా మహిళకు రుణాలు మాఫీ అని చెప్పి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే మహిళలకే రక్షణ లేదు’’ అంటూ సునీత దుయ్యబట్టారు.
బీసీల తోక కట్ చేస్తా, తోలు తీస్తా అన్న చంద్రబాబు బీసీలకు ఇంకేం న్యాయం చేస్తారు?. మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌లకు లేదు. మీ మోసాలను చూసే 23 సీట్లకు పరిమితం చేశారు. టీడీపీకి మహిళలే మళ్ళీ బుద్ది చెప్పే టైం దగ్గర పడింది. చంద్రబాబు, లోకేష్‌లవి సినిమా ట్రిక్ రాజకీయాలు. వారిమీద ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయింది. కేవలం గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకునే టీడీపీ రాజకీయాలు చేస్తోంది. చివరికి మహిళా కమిషన్‌పై సైతం విమర్శలు చేయటం దారుణం. మహిళల మిస్సింగులు ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ. కానీ సీఎం జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు పవన్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు’’ అని పోతుల సునీత ధ్వజమెత్తారు.
చదవండి: మొసలికన్నీరు సంగతి సరే.. మరి ఈనాడుకు ఆ దమ్ముందా?
Comments
Please login to add a commentAdd a comment