టీడీపీ బినామి సంస్థలు లక్షల కోట్లు కాజేశాయని ఎమ్మెల్సీ పోతుల సునీత ఆరోపించారు. ఒంగోలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండు వేల కోట్లు కాదు రెండు లక్షల కోట్లకు పైగానే చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. రాజధాని అమరావతి పేరుతో రైతుల నుంచి వేల ఎకరాలు కాజేసి, భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారని మండిపడ్డారు