త ఐదేళ్ల టీడీపీ హయాంలో వడ్డీ రాయితీ చెల్లించలేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ పాలనలో నిర్లక్ష్యం చేసిన డీసీసీబీలు, సహకార బ్యాంకు లను బలోపేతం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బస్సుయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పులేమిటో ముందు చెప్పాలన్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్ వెనుక నిజాలను బయటపెట్టడం తప్పా అని కన్నబాబు ప్రశ్నించారు