చీరాల: ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత ఎంపికయ్యారు. దీంతో ఆమె వరుసగా మూడోసారి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోనున్నారు. బీసీ (పద్మశాలి) సామాజికవర్గానికి చెందిన పోతుల సునీత బాపట్ల జిల్లా చీరాలలో నివాసముంటున్నారు. 2017లో సునీత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పదవీకాలం మరో మూడేళ్లు ఉండగానే ఆమె పదవికి రాజీనామా చేశారు. 2021 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా స్థానం కలి ్పంచారు. ప్రస్తుతం 2023 మార్చితో ఆమె ఎమ్మెల్సీ గడువు పూర్తవుతుంది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే కోటా నుంచి ఆమెకు ఎమ్మెల్సీ స్థానం కలి ్పంచారు. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన పోతుల సునీతను వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమించి ఆమెకు మరిన్ని బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ అభ్యరి్థగా ఎంపికైన సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారన్నారు. స్థానిక సంస్థల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వంగా నిరూపించారన్నారు. బీసీలకు అందించిన సామాజిక న్యాయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఈ రోజు ఇంతమందికి పదవులు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. బీసీలకు చేసిన న్యాయాన్ని అందరూ గుర్తించాలన్నారు. బీసీలంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనను సీఎం చేతల్లో చూపిస్తున్నారని, అందుకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి అఖండ మెజారీటీని కట్టబెట్టి ముఖ్యమంత్రి స్థానంలో మరోసారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉంచేలా అందరూ కృషి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment