మనం చేసిన మంచి బతికే ఉంది: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Meeting With Ysrcp Leaders Of Joint Visakha District Updates | Sakshi
Sakshi News home page

మనం చేసిన మంచి బతికే ఉంది: వైఎస్‌ జగన్‌

Published Wed, Aug 14 2024 10:40 AM | Last Updated on Wed, Aug 14 2024 1:43 PM

Ys Jagan Meeting With Ysrcp Leaders Of Joint Visakha District Updates

సాక్షి, గుంటూరు : మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదని స్పష్టం చేశారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రతీ ఇంటికీ మనం చేసిన మంచి  బతికే ఉందని, మేనిఫెస్టో అమలులో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు.  విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం (ఆగస్ట్‌14) యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు వైఎస్‌ జగన్‌.

చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని,  వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్‌ జగన్‌ మరోసారి గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులు వచ్చాయన్నారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని, శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని, కోవిడ్‌ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదన్నారు.  

YS Jagan Meets Elamanchili YSRCP Leaders 1

యలమంచిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

  •  వైఎస్సార్‌సీపీ కేడర్‌ బలంగా కనిపించడంతో చంద్రబాబులో భయం మొదలైంది
  • దీనివల్లే పోటీనుంచి టీడీపీ విరమించుకుంది
  • గత ఎన్నికలు ఎలా జరిగాయని మీరంతా చూసే ఉంటారు
  • ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు మోసం చేస్తున్నారు
  • మన ప్రభుత్వ హయాంలో మనంచేసిన మంచి ఎక్కడికీ పోలేదు
  • ప్రతి ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉంది
  • మేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పాం
  • చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాడు
  • YS Jagan Meets Elamanchili YSRCP Leaders 12
  • మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి
  • వాటికి వడ్డీలు కూడా ఉన్నాయి
  • వీటికితోడు కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులూ వచ్చాయి
  • ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదు
  • శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదు
  • కోవిడ్‌ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదు
  • ఎన్ని కష్టాలు ఉన్నా.. క్యాలెండర్‌ ప్రకటించి పథకాలు అమలు చేశాం
  • ఐదేళ్లపాటు క్యాలెండర్‌ తప్పకుండా పథకాలు అందించాం
  • పథకాలను ప్రతి ఇంటికీ డోర్‌ డెలివరీ చేశాం
  • దేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాం
  • ప్రతి కార్యకర్తకూడా ఇప్పటికీ ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలడు
  • చెప్పించి మేం చేయగలిగాం అని చెప్పుకోగలడు
  • ఈ  రెండున్నర నెలల పాలనలో ఒక ప్రభుత్వం మీద ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదు
  • రెండున్నర నెలల కాలంలో తీవ్రమైన ప్రజావ్యతిరేకత కనిపిస్తోంది
  • ప్రతి ఇంట్లో కూడా.. జగనే ఉండి ఉంటే.., వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉండే.. అన్న చర్చ జరుగుతోంది
  • ఈపాటికే అమ్మ ఒడి అందేది, రైతు భరోసా అందేది, రైతులకు పంటల బీమా అందేది: ఫీజురియింబర్స్‌మెంట్‌నేరుగా ఖాతాల్లో పడేది
  • వసతి దీవెన కూడా అందేది
  • పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ డబ్బులు పడేవి.. ఇప్పుడు ఇవేమీ అందలేదు
  • పథకాలకోసం ఎవ్వరినీ అడగాల్సిన పనిలేకుండా సాఫీగా అమలు జరగేవి
  • ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ రాకపోగా, చాలా దుర్మార్గాలు చేస్తున్నారు
  • స్కూళ్లలో టోఫెల్‌ పీరియడ్‌ను ఎత్తివేశారు
     
  • ఇంగ్లిషుమీడియం నడుస్తుందన్న ఆశ లేదు
  • మధ్యాహ్న భోజనం ప్రశ్నార్ధకం అయ్యింది
  • డిసెంబర్లో ఇచ్చే ట్యాబులు లేనట్టే
  • ఇప్పుడు ఆర్డర్‌కూడా ఇవ్వలేదు 
  • ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతింది
  • ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.1800 కోట్లపైనే దాటింది
  • ప్రభుత్వాసుపత్రుల్లో జీరో వేకెన్సీ అమలు చేశాం
    ఇప్పుడు డాక్టర్లు ఉన్నారా? లేదా? అన్న పరిస్థితి కనిపిస్తోంది
  • ఆరోగ్య ఆసరా ఊసే లేదు
  • మందులు లేవు, పరిశుభ్రత అంతకన్నా లేదు
  • ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు
  • రైతులు మళ్లీ క్యూలలో ఉండాల్సిన పరిస్థితి విత్తనాలకోసం ఇ- క్రాప్‌ పక్కనపడేశారు
  • ఉచిత పంటల బీమాను వదిలేశారు
  • బియ్యం డోర్‌ డెలివరీ లేదు
  • తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, మళ్లీజన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది
    YS Jagan Meets Elamanchili YSRCP Leaders 4 
  • రెడ్‌ బుక్‌ పాలన కొనసాగుతోంది
  • గ్రామస్థాయిలో కక్షలను ప్రోత్సహిస్తున్నారు
  • మీరు చేయండి.. మేం చూసుకుంటాం అంటున్నారు
  • దిశ యాప్‌ ఏమైందో తెలియడంలేదు
  • దిశ నొక్కగానే 10 నిమిషాల్లో వచ్చేవారు
  • అన్నీ కూడా రెండున్నర నెలల్లోనే జరిగాయి
  • ఎక్కడా అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా ప్రజలకు మంచి చేశాం
  • ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి
  • చంద్రబాబు మోసాలు చూసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
  • కష్టాలు లేకుండా సృష్టే ఉంటుంది
  • చీకటి తర్వాత కచ్చితంగా వెలుగు వస్తుంది
  • రాత్రి తర్వాత పగలు కచ్చితంగా వస్తుంది
  • నన్ను 16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా కష్టపెట్టారు
    YS Jagan Meets Elamanchili YSRCP Leaders 15 
  • అయినా సరే.. మనం నిబ్బరంతో నిలబడగలిగాం
  • మన వ్యక్తిత్వమే మనకు శ్రీరామ రక్ష
  • పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు వెనక్కితగ్గాడు
  • చంద్రబాబు సహజ నైజం ఇది కాదు
  • ఫోన్లు చేసి… అది ఇస్తా, ఇది ఇస్తా అనేవాడు 
  • ఎన్నికల సమయంలోకూడా చంద్రబాబు ఇదే తరహాలో ప్రచారం చేసేవాడు
  • నీకు 15వేలు, నీకు 18 వేలు అని ప్రచారంచేశాడు
  • అందర్నీ మోసం చేసి ఇప్పుడు అందరికీ క్యాబేజీలు పెట్టాడు
  • అలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరికీ కాల్స్‌ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపెట్టే ఉంటాడు
  • కాని ధర్మం, న్యాయం గెలిచింది
  • మీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు మెడలు వంచక తప్పలేదు
  • సంఖ్యాబలం లేనప్పుడు చంద్రబాబు పోటీపెడాననటమే తప్పు
  • కాని మీరంతా ఒక్కటిగా ఉండడం వల్లే విజయం సాధ్యమైంది.

 

భీమిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

  • ఈ ఎన్నికల్లో ధర్మం, న్యాయానికి పాతరవేయాలని చూశారు
  • అదే అజెండాతో యుద్ధంచేయాలని చూశారు
  • కాని మనం అంతా ఐకమత్యంగా ఉన్నాం
  • ప్రలోభాలకు లోనుకాకుండా మీరంతా గట్టిగా నిలబడ్డారు
  • చివరకు అధర్మ రాజకీయాలు చేయాలనుకునేవాళ్లు తలొగ్గారు:
    సహజంగా పోటీపెట్టాలనే ఆలోచనకూడా వాళ్లకి రాకూడదు
  • మనకు అంత మెజార్టీ ఉంది
  • పార్టీ సింబల్‌మీద జరిగిన ఎన్నికల్లో వీళ్లంతా గెలిచారు
  • పోలీసులను పెట్టి బెదిరించాలని చూశారు
  • ఏకంగా సీఎం ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారు
  • మొన్న జరిగిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అన్నీ అబద్ధాలు చెప్పారు:
  • నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు, రైతు కనిపిస్తే నీకు రూ.20వేలు అంటూ మోసపూరితమైన క్యాంపెయిన్‌ చేశారు
  • చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు కొంతమంది ఆశపడ్డారని అనిపిస్తుంది
  • ఇప్పుడు అంతా మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారు
  • ఐదేళ్ల పాలనలో మనం చేసిన మంచి ఎక్కడకీ పోలేదు
  • ఇవ్వాళ్టికీ మన కార్యకర్తలు, నాయకులు తలెత్తుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలుగుతారు:
    చంద్రబాబు అప్పుల భారాన్ని, వడ్డీలభారాన్ని మనంకూడా మోసాం
  • కరోనా లాంటి మహమ్మారి కారణంగా రాష్ట్రం ఆదాయాలు పెరిగిపోయాయి
  • ఖర్చులు కూడా పెరిగిపోయాయి
  • కాని శ్వేతపత్రాల పేరుతో సాకులు చెప్పలేదు 

 

  • చంద్రబాబు అప్పులుగురించి, ఆ అప్పులు వడ్డీల గురించి మనం ఏరోజూ చెప్పలేదు
  • మేనిఫెస్టోలో మనం చేసిన ప్రతి మాటనూ అమలు చేశాం
  • చంద్రబాబులా చెత్తబుట్టలో వేయలేదు
  • దేశచరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో క్యాలెండర్‌ పెట్టి అమలు చేశాం
  • పథకాలను నేరుగా డోర్‌డెలివరీ చేశాం
  • ఇప్పడు ఏ ఇంట్లో చర్చ జరిగినా.. జగన్‌ ఉండి ఉంటే.. అన్నదానిపై చర్చ జరుగుతోంది
  • జగన్‌ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానని ఆశచూపాడని అంటున్నారు
  • చివరకు పలావు పోయింది, బిర్యానీ పోయిందనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది
  • జగనే ఉండి.. ఉంటే, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉండి.. ఉంటే.. అన్న చర్చ జరుగుతోంది
  • టీడీపీ వచ్చాక పథకాలు రాకపోగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి
  • ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ దగ్గర కుర్చీలు కూడా తీసేస్తున్న పరిస్థితి

 

  • వైఎస్సార్‌సీపీ పాలనలో పెన్షన్‌ నేరుగా ఇంటికే అందేది
  • ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి
  • లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉన్నదీ ప్రజలంతా చూస్తున్నారు
  • కక్ష తీర్చుకోండి… పోలీసులు మీకు అండగా ఉంటారని టీడీపీ నాయకులు బాహాటంగా చెప్తోంది
  • రెడ్‌బుక్‌ పాలన కనిపిస్తోంది
  • ప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితి
  • లా అండ్‌ ఆర్డర్‌ నుంచి గవర్ననెన్స్‌, ఆరోగ్య రంగం, వ్యవసాయం, విద్యారంగం… ఇలా ప్రతి వ్యవస్థ కుప్పకూలిపోతోంది
  • మరో మూడు నెలల్లో టీడీపీ కార్యకర్త ఏ గడపకూ వెళ్లలేని పరిస్థితి ఉంటుంది
  • ప్రతి కుటుంబం కూడా టీడీపీని నిలదీసే పరిస్థితి వస్తుంది
  • నువ్వు చెప్పింది ఏంటి.. ఇప్పుడు జరుగుతన్నది ఏంటని అడిగే పరిస్థితి
  • కష్టాలు అనేవి ఉంటాయి, కాని అవి శాశ్వతం కాదు
  • కష్టాలు ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలి
  • ప్రజలకు మనం తోడుగా ఉంటే చాలు.. వాళ్లే మనల్ని ఆదరిస్తారు
  • టీడీపీ అబద్ధాలు, మోసాలతో విసుగెత్తిపోయే పరిస్థితి ఉంటుంది
  • వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తొగ్గలేదు, ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి.. చంద్రబాబే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement