![ysrcp complaint to cp fake posts against ys jagan visakhapatnam](/styles/webp/s3/article_images/2024/11/9/Gudivada-Amarnath.jpg.webp?itok=IctfYA9h)
విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ నేతలు సీపీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
‘‘పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి. వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశాం. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొంటాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని డిప్యూటీ సీఎం ఒప్పుకున్నారు. ఎక్కడ పోయినా ప్రజలు ప్రశ్నిస్తున్నారని డిప్యూటీ సీఎం వపన్ చెప్పారు. 6 నెలల్లోనే 50 మందికిపైగా మహిళలపరై అత్యాచారాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం నేరాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది’’ అని తెలిపారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/27_25.png)
Comments
Please login to add a commentAdd a comment