నేడు, రేపు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశం | YS Jagan meeting with public representatives of joint Visakha district | Sakshi
Sakshi News home page

నేడు, రేపు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Published Tue, Aug 13 2024 5:02 AM | Last Updated on Tue, Aug 13 2024 9:09 AM

YS Jagan meeting with public representatives of joint Visakha district

సాక్షి, అమరావతి:  ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారాల్లో ఆ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. 

మిగిలిన నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో నేడు, రేపు భేటీ కానున్నారు. ఈ కారణం వల్ల ఇతర నాయకులు, సందర్శకులు వైఎస్‌ జగన్‌ను కలిసే అవకాశం ఉండదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement