![Local Bodies MLC Elections YSRCP Candidate Subramanyam Cipai - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/21/YS-JAAGN-CM.jpg.webp?itok=2Bk99ZWq)
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి.. స్వీట్లు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మరో సారి జగనన్న ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తిరుపతి కల్చరల్/శ్రీకాళహస్తి/రేణిగుంట/ఏర్పేడు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎంపికపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిపాయి సుబ్రమణ్యం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యరి్థగా ఎంపికయ్యారు.
విషయం తెలుసుకున్న వన్నెకుల క్షత్రియ సంఘం నేతలు సంబరాల్లో మునిగి తేలారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడులో బాణసంచా పేల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, సంఘం గౌరవాధ్యక్షుడు బుజ్జిరెడ్డి, బీసీ నాయకుఉల వేలాయు«ధం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment