సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో మరో బీసీ నాయకుడికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టం కట్టారు. ఇచ్ఛాపురంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గా ఎంపిక చేశారు. అట్టడుగు వర్గాలకు చెందిన వారిని సీఎం ఒక్కొక్కరిగా రాజకీయంగా పైకి తీసు కొస్తున్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపిస్తూ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పస్తూనే.. పెద్దల సభలకు కూడా వారినే ఎంపిక చేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూనే.. నాయకత్వ లక్షణాలున్న వారికి రాజ్యాధికారాన్ని అప్పగిస్తున్నారు. ఇప్పటికే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును ఎమ్మెల్యేగా చేయడంతో పాటు మంత్రి సీటుపై కూర్చోబెట్టారు.
వెనుకబడిన వర్గాలకు పెద్దపీట
కాళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతా రాంను ఏకంగా రాష్ట్ర శాసన సభాపతిగా నియమించారు. అదే కాళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా విజయను జెడ్పీ చైర్‌పర్సన్‌గా, దువ్వాడ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీగా చేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన ప్రసాదరావును మంత్రిని చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్‌కు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగానే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పాలవలస విక్రాంత్‌ను ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీని చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన గొర్లె కిరణ్‌కుమార్, రెడ్డి శాంతిలకు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించారు. తాజాగా యాద వ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును ఎమ్మెల్సీ చేస్తున్నారు. కళింగ వైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళను సుడా చైర్మన్‌గా, అదే సామాజిక వర్గానికి చెందిన అంధవరపు సూరిబాబును రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్‌ను చేశారు.
సామాజిక వర్గాల సమతుల్యత
ఎస్సీ, ఎస్టీ, రెడ్డిక తదితర సామాజిక వర్గాల వారికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. ఇలా అన్ని వర్గాలకు సంబంధించి సామాజిక సమతుల్యత పాటించారు. ఎలాంటి కుటుంబ చరిత్ర లేకపోయినా దక్షత ఉంటే సాధారణ వ్యక్తిని సైతం ఉన్నత పదవిలో కూర్చోబెట్టవచ్చని చేసి చూపించారు. తాజాగా నర్తు రామారావును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి మరో కీలక పదవి ఇచ్చినట్టు అయింది.
Comments
Please login to add a commentAdd a comment